intinti gruhalakshmi 10 june 2022 full episode
Intinti Gruhalakshmi 10 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 జూన్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 655 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముప్పి లహరి దగ్గర పని చేస్తున్నా అని ప్రేమ్.. కంపెనీ మేనేజర్ తో చెబుతాడు. అయితే.. ఆయనతో ఒక కాల్ కొట్టించు అంటాడు. వద్దు సార్.. ఆయనకు ఫోన్ చేస్తే నన్ను జాబ్ లో నుంచి తీసేస్తాడు అంటాడు. మరోవైపు శృతి కూడా ముప్పి లహరి దగ్గరికి వెళ్లి 5 లక్షలు అప్పు కావాలని అడుగుతుంది. దీంతో ముప్పి లహరి ఒప్పుకోడు. మరోవైపు ఆయనకు ఫోన్ చేసి ప్రేమ్ బతిమిలాడటంతో ఫోన్ కట్ చేస్తాడు కంపెనీ వ్యక్తి. మరోవైపు పరందామయ్య.. ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తుంటాడు. పరందామయ్య ఎనర్జీ చూసి తులసి కూడా ముచ్చటపడుతుంది.
intinti gruhalakshmi 10 june 2022 full episode
ఇంతలో నా కొడుకులు కూడా చాలా గొప్పోళ్లు. నా చిన్న కొడుకు బాగా పాడుతాడు అంటుంది తులసి. ఆ తర్వాత నా పెద్ద కొడుకు అభి అంటూ ఏదో అనబోతుండగా.. పెద్ద చవట అంటూ అక్కడికి వస్తాడు అభి. నేను పాపిష్టివాడిని అమ్మ. నువ్వే కదా.. ఊరంతా తిరిగి అందరికీ నా గురించి గొప్పగా పబ్లిషిటీ ఇస్తున్నావు అంటాడు అభి. దీంతో ఏం జరిగింది అమ్మా… వాడు ఎందుకు అంతలా బాధపడుతున్నాడు అని అడుగుతుంది అనసూయ. దీంతో ఇంట్లో వాళ్లకు నువ్వు చెప్పలేదా. నీ కోడలు ఏం చేసిందో తెలుసా నానమ్మ.. నన్ను ఎదగమని ఇంట్లో నుంచి బయటికి పంపించి.. నా కాళ్లు పట్టుకొని కిందికి లాగేసింది అంటాడు. ఇక నుంచి నిన్ను నమ్మను. నీ డ్రామాలు ఇక ఆపు అంటాడు అభి.
నిన్నటి వరకు అత్తారింట్లో నన్ను నెత్తిన పెట్టుకొని కూర్చున్నారు. కలిసి వచ్చిన ఆస్తి నా పేరు మీదికి ట్రాన్స్ ఫర్ అవుతుందని భావించాను. కానీ.. నీ కోడలు శకునిలా వచ్చి నా లైఫ్ ను నాశనం చేసింది అంటాడు అభి. రేపు నీ జీవితం కూడా అంతే అని దివ్యతో అంటాడు అభి.
నేను డాడీని కలవడం మమ్మీకి నచ్చలేదు. డాడీకి దగ్గరైతే.. నేను తన మాట వినను అనే ఉద్దేశంతో నన్ను తొక్కేసింది. ఆటలో అరటిపండును చేసింది. అంకిత దగ్గరైతే.. తన ఆటలు సాగుతాయి. అందుకే అంకిత పేరు మీద ఆస్తి పెట్టేలా చేసింది అంటాడు అభి.
మామ్ గురించి నాకు డాడ్ ముందే చెప్పాడు కానీ.. నేనే నమ్మలేదు. కానీ.. ఇప్పుడు నమ్మాల్సి వస్తోంది అంటాడు అభి. ఇంట్లో ప్రతివాళ్లు తన మాటే వినాలి.. అంటాడు అభి. దీంతో పరందామయ్యకు కోపం వస్తుంది. కానీ.. తులసి ఒక్క మాట కూడా మాట్లాడదు.
చేయాల్సిందంతా చేసి నానమ్మ, తాతయ్య దగ్గర మంచిగా ఉండటం కోసమా ఈ వేషాలు. కొద్దిరోజులు ఆగు మామ్.. నేనేంటో నిరుపిస్తాను. తలెత్తుకొని నీ ముందు నిలబడతాను అంటాడు అభి. జీవితంలో నీ ముఖం కూడా చూడను అని అంటాడు అభి.
డాడ్ అలా ప్రవర్తించడానికి కారణం ఎవరో.. ఆ తప్పు ఎందుకు చేశాడో ఇప్పుడు తెలుస్తోంది మామ్. దోషివి నువ్వే అంటాడు అభి. ఆ తర్వాత అభి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో తులసి తీవ్రంగా బాధపడుతుంది. చివరకు అభి కూడా నన్ను అర్థం చేసుకోలేదు అంటుంది తులసి.
కానీ.. వాడి ఆవేశంలో అర్థం ఉంది అంటుంది. తర్వాత మ్యూజిక్ క్లాస్ కోసం వెళ్తుంది తులసి. మరోవైపు ఆస్తి.. అంకిత పేరు మీదకు మారిందని తెలుసుకొని లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. ఇదంతా తులసే చేసింది అని అంటుంది లాస్య. పాపం ఇప్పుడు అభి పరిస్థితి ఏంటి అని అంటాడు నందు.
అప్పుడే అక్కడికి వచ్చిన అభి.. సిగ్గుగా అనిపిస్తోంది డాడ్. నా ఆత్మాభిమానం చచ్చిపోయింది. మామ్ అంటే చిరాకు వేస్తోంది అంటాడు అభి. దీంతో అభి ఏంట్రా ఈ మాటలు అంటాడు నందు. తను ఏం చేసినా నా మంచి కోసమేనట. నేను బాగుపడటం కోసమేనట. ఇలాంటి పచ్చి అబద్ధాలు నేను ఎలా నమ్ముతానని అనుకుంటోంది అంటాడు అభి.
ఆవిడను బెదిరించి కూడా ఏంటి లాభం. ఆస్తి నా పేరు మీద రాయనందుకు నాకు బాధ లేదు. నాకు అవమానం జరిగింది. ఆస్తి నా పేరు మీద ఉన్నా.. అంకిత పేరు మీద ఉన్నా నాకు ఏం నష్టం లేదు. కానీ.. నేను అంత చేతగాని వాడినని అనుకుంటోంది అంటాడు అభి.
అంకిత పేరు మీద ఉన్నా నా పేరు మీద ఉన్నట్టే కదా. మీ బిజినెస్ కోసం డబ్బు నేను ఇస్తాను. తీసుకొచ్చే బాధ్యత నాది అంటాడు అభి. దీంతో మా కారణంగా మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదు అని అంటాడు నందు. మనం అంటే అంకితకు ఇష్టం లేదు కదా.. ఎలా ఇస్తుంది.. ఎందుకు ఇస్తుంది అంటాడు నందు.
ఆ సంగతి అభికి తెలియదా.. తెలియకుండానే మనకు మాటిచ్చాడా… తను చేతగాని వాడు కాదు అని నిరూపించుకోవడం ఇక్కడి నుంచే మొదలుపెడతాడు అంటుంది. దీంతో అవును.. ఇప్పుడే అంకితతో మాట్లాడి మీకు చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతాడు అభి.
మరోవైపు శృతి రోడ్డు మీద చెత్త వేస్తుండగా అంకిత, తులసి చూస్తారు. శృతి పనిమనిషిగా మారడం చూసి షాక్ అవుతుంది తులసి. అంకిత కూడా షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏ జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
RBI Good News : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా తీసుకున్న నిర్ణయం చిన్న పిల్లల కోసం…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంకి గట్టి బలం లభించబోతోంది.…
Ys Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ అధికారంలోకి రావాలంటే, పాత తప్పులను పునరావృతం చేయకూడదని పలువురు అభిప్రాయపడుతున్నా, సజ్జల…
Mahesh Babu ED notices : సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఈడీ నోటీసులు అనే వార్త అభిమానులనే…
Tomato Juice To Regrow Hair : కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధిస్తున్న సమస్య జుట్టు రాలిపోవడం. ఎన్నో…
Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్…
Glowing Skin : ఈ రోజుల్లో అందంగా కనిపించాలంటే మేకప్ లు తీసేయాల్సిందే. చర్మం కోసం తప్పనిసరిగా కొన్ని ప్రత్యేకమైన…
Papaya Leaf : బొప్పాయ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో.. బొప్పాయ ఆకు కూడా అంతే మేలు చేస్తుంది.…
This website uses cookies.