namrata opens about re entry
Namrata : సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఒకప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించిన విషయం తెలిసిందే. వంశీ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె అదే సమయంలో మహేశ్‌తో ప్రేమలో పడిపోయింది.ఆ మూవీ తర్వాత మహేశ్‌ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పింది. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలు, బిజినెస్ వ్యవహరాలతో బిజీగా ఉంది. ఇక మహేశ్ సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంటే.. భర్తకు సంబంధించిన వ్యాపారాలు, జీఎమ్‌బీ ప్రొడక్షన్స్ వ్యవహరాలతో పాటు పిల్లల బాధ్యతలను నమ్రత చూసుకుంటుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ బిజీగా ఉంటే..
ఫ్యామిలీకి సంబంధించిన విషయాలన్నీ నమ్రతనే చూసుకుంటుంది. ఏది చేయాలి అన్నా.. ఆమె. మహేష్ కు సంబధింన విషయాలు కూడా ఆమె చూసుకుంటుంది. అంతే కాని మహేష్ తన కోసం ఏం చేయలేదంటోంది నమ్రత. అయితే తాను బిజీగా ఉండటం వల్లే అంటోంది మాజీ హీరోయిన్. తన రీఎంట్రీపై మరోసారి క్లారిటీ ఇచ్చింది నమ్రత. ఇటీవల తన స్నేహితులు ప్రారంభించి స్టైలింగ్ స్టోర్ ప్రారంభోత్సవానికి నమ్రత ముఖ్య అతిథిగా హజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తిక విషయాలు పంచుకుంది. మహేశ్‌కు షాపింగ్ అంటే అసలు నచ్చదని, ఆయన కోసం కూడా తానే షాపింగ్ చేస్తానని చెప్పింది.
namrata opens about re entry
ఆ తర్వాత సినిమాల్లోకి తన రీఎంట్రీపై స్పందిస్తూ.. ‘తిరిగి నేను సినిమాల్లో నటించాలని చాలా మంది కోరుకుంటున్నారు. కానీ వారందరిని ఎప్పుడు హర్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం నేను నా కుటుంబ బాధ్యతలను చూసుకోవడం బిజీగా ఉన్నాను. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినిమాలపై దృష్టి పెట్టడం లేదు. నిజానికి మళ్లీ నటించాలనే ఆసక్తి కూడా నాకు లేదు. అందుకే నటించాలనే ఆలోచనే చేయడం లేదు. భవిష్యత్తులో కూడా ఆ ఆలోచన ఉండకపోవచ్చు’ అంటూ నమ్రత క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇక నమ్రతను తెరపై చూసే అవకాశం లేదా? అని ఆమె ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
This website uses cookies.