Intinti Gruhalakshmi 10 Sep Today Episode : ప్రేమ్, శృతిని విడదీసిన నందు.. ప్రేమ్ తో పెళ్లికి ఒప్పుకోని శృతి.. ప్రేమ్ తండ్రిమాటను విని.. అక్షర మెడలో తాళి కడతాడా? శృతిని వదిలేస్తాడా?

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 10 సెప్టెంబర్ 2021, శుక్రవారం రోజుది తాజాగా విడుదలైంది. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే లేటెస్ట్ ఎపిసోడ్ 421 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

జీవితంలో డబ్బులు మాత్రమే కాదు.. బంధాలు కూడా ముఖ్యమే అంటుంది తులసి. కానీ.. నందు మాత్రం ఈ జీవితంలో డబ్బు మాత్రమే మనిషిని నడిపిస్తుంది.. అని చెబుతాడు నందు. నువ్వు ఫ్యాక్టరీ నడిపేది డబ్బుకోసమే కదా.. అంటే నేను ఫ్యాక్టరీని నడిపేది డబ్బు కోసం కాదు.. నా ఉనికిని కాపాడుకోవడం కోసం, నేను ఎందుకు చేతగాని దాన్ని కాదని చెప్పడం కోసం అని చెబుతుంది తులసి. మీరు ప్రేమ్, శృతిల మధ్య అస్సలు అడ్డు రాకూడదు.. అని చెబుతుంది తులసి.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

అస్సలు ఊరుకోను. ప్రేమ్, శృతిలకు ఖచ్చితంగా అడ్డు వస్తాను. ప్రేమ్ , శృతి పెళ్లి జరగకుండా అడ్డుకుంటాను.. అని చెబుతాడు నందు. మీకు ప్రేమ్ గురించి సరిగ్గా తెలియదు. వాడికి మనసుకు నచ్చని పనిని ఏనాడూ చేయడు.. అని చెప్పి తులసి వెళ్లిపోతుంది. వెంటనే లాస్య అక్కడికి వచ్చి.. తులసికి బాగా బుద్ధి చెప్పావు నందు. లేకపోతే నీకే చాలెంజ్ చేస్తుందా? అంటుంది లాస్య.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

నాకు అదే అర్థం కావడం లేదు లాస్య. నేను అందరి మంచి కోసం ఆలోచిస్తున్నా.. ఎందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు.. అని అంటాడు నందు. నువ్వు ముందు చేయాల్సింది.. శృతిని తప్పించడం, ప్రేమ్, శృతిని విడదీయడం. ముందు ఆ పని చేయ్.. లేదంటే తులసి.. వాళ్లకు పెళ్లి చేసిన చేసేస్తుంది.. అని అంటుంది లాస్య.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : తులసి దగ్గరికి వెళ్లిన ప్రేమ్

కట్ చేస్తే.. తులసి దగ్గరికి వస్తాడు ప్రేమ్. శృతికి నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి.. అని అడుగుతాడు ప్రేమ్. నేను ఎలాగూ నా ప్రేమ విషయాన్ని శృతికి చెప్పలేకపోతున్నాను. నువ్వే వెళ్లి ఈ విషయం శృతికి చెప్పు అమ్మ.. అని అంటాడు ప్రేమ్. వెంటనే అక్కడికి వచ్చిన ప్రేమ్ వదిన.. అదేంటి.. ప్రేమ్ అలా అంటావు.. శృతిని అడగటం ఏంటి.. ఒకవేళ శృతి ఒప్పుకోకపోతే ఏం చేస్తావు.. అని అడుగుతుంది తన వదిన.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

ఏ ఆడది అయినా నా భర్త నన్ను బాగా చూసుకోవాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వదలకూడదు.. అని అనుకుంటుంది. నువ్వు శృతికి కూడా అలా చేయాలి. అటువంటి నమ్మకం నువ్వు శృతికి కలిగేలా చేస్తే.. అప్పుడు శృతి నీకే తన ప్రేమ విషయం చెబుతుంది. కాబట్టి నువ్వు కాస్త ఆత్మవిశ్వాసం చూపించి ముందుకు వెళ్లు.. ఖచ్చితంగా శృతి ఒప్పుకుంటుంది.. అని చెబుతుంది తులసి. దీంతో సరేనమ్మా.. ఈరోజు శృతికి ఖచ్చితంగా చెప్పేస్తాను.. అని చెప్పి శృతి రూమ్ కు వెళ్తాడు ప్రేమ్. కానీ.. రూమ్ లో శృతి ఉండదు.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

వెళ్లి తన తాతయ్యను అడుగుతాడు ప్రేమ్. గుడికి వెళ్తాను అని చెప్పింది.. అని అంటాడు తన తాత. ఇక ఆలోచించకూడదు. వెంటనే గుడికి వెళ్లి నా మనసులో మాటను చెప్పేయాలి.. అని అనుకుంటాడు. ఇంతలో శృతి గుడిలో కూర్చొని ఆలోచిస్తుంటుంది. ప్రేమ్.. బైక్ మీద గుడికి వెళ్తుంటాడు.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : శృతి దగ్గరికి వెళ్లిన నందు

ఇంతలో గుడికి నందు వస్తాడు. వచ్చి శృతిని చూసి.. తన దగ్గరికి వెళ్తాడు. నన్ను ఇక్కడ చూసి నీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ.. రాకతప్పలేదు. అర్థం కాలేదు కదూ. కానీ.. నేను నీకోసమే వచ్చాను. నీతో మాట్లాడటానికే వచ్చాను. ఏ విషయం గురించి అంకుల్ అని అడుగుతుంది శృతి. నా కుటుంబ విషయం గురించి.. అని చెబుతాడు నందు. నా కుటుంబ భవిష్యత్తు నీ మీదే ఆధారపడి ఉంది అంటాడు నందు.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

నా మీద ఆధారపడి ఉండటం ఏంటి. నేనేం చేయగలను.. అని అంటుంది శృతి. నేనే ఏ దిక్కు లేకుండా మీ ఇంట్లో ఉంటున్నాను. అంతే కాకుండా నిన్న మీరు చెప్పిన మాటల బట్టి నాకు అర్థం అయింది. నేను మీ ఇంట్లో ఉండటం ఎంత అనర్థానికి దారి తీస్తుందో. అందుకే.. ఇకపైన మీ ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అని అనుకుంటున్నాను.. అంటుంది శృతి.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతే మరో తప్పు చేసిన దానివి అవుతావు.. అంటాడు నందు. నువ్వు వెళ్లిపోతే సమస్యలు తీరిపోవు. పెరిగిపోతాయి. ప్రేమ్ కి గొప్పింటి సంబంధం చూశాను. కానీ వాడు నిన్ను ఇష్టపడుతున్నాడు. అలా అని నీకు ప్రేమ్ ను ఇచ్చి పెళ్లి చేస్తే వాడు భవిష్యత్తులో చాలా సమస్యలు పడాల్సి వస్తుంది. నీకు ఇప్పటికే పెళ్లయి పోయింది. ఇప్పటికే పెళ్లయిన ఆడదాన్ని పెళ్లి చేసుకుంటే.. సమాజంలో వాడికి ఏం విలువ ఉంటుంది చెప్పు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం.. నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లిపోవడం కాదు. ప్రేమ్ కు అర్థమయ్యేలా చెప్పడం. ఎందుకంటే.. నీలా అర్థమయ్యేలా వాడికి ఇంకెవరూ చెప్పలేరు కాబట్టి. ఇప్పుడు నా కంపెనీ కష్టాల్లో ఉంది. ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతే క్లయింట్ కు కోటి రూపాయల ఫైన్ కట్టాలి. లేకపోతే జైలుకు వెళ్లడం ఖాయం. ఇక తులసి ఫ్యాక్టరీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తనకున్న మిడిమిడి నాలెడ్జ్ తో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నేను జైలుకు వెళ్తే.. ఇంకేమన్నా ఉంటుందా? అసలు నేను జైలుకు వెళ్లే పరిస్థితే వస్తే.. అవమానం భరించడం కన్నా.. చావడం మేలు. నేను అదే పని చేస్తా. నేను ఓటమిని భరించలేను.. అని అంటాడు నందు.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

నీకు ఆశ్చర్యం కలిగించినా ఇదే నిజం. సమాజంలో గౌరవం పోతే బతకలేను. నేను కనుక దూరం అయితే మా అమ్మానాన్న పరిస్థితి ఏంటి. అభి, ప్రేమ్ ఇంకా సెటిల్ అవ్వలేదు. దివ్య చదువే పూర్తి కాలేదు. తన పెళ్లి ఎవరు చేస్తారు. తులసి ఒక్కతే ఇన్ని భారాలు మోయగలదా? ఎంతో ఆలోచించాను శృతి. అన్నింటికీ ఒకటే సొల్యూషన్. ప్రేమ్.. జీకే కూతురును పెళ్లి చేసుకోవడం. అదే జరగాలి. అలా అయితేనే మేమంతా సంతోషంగా ఉంటాం. ఇవన్నీ జరగాలంటే.. నువ్వు నీ ప్రేమను త్యాగం చేస్తే చాలు. ఏం శృతి.. నిన్ను ఎంతో అభిమానించే ఈ కుటుంబం కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? నీ ప్రేమను త్యాగం చేయలేవా? మనకెవరైనా సహాయం చేస్తే తిరిగి సాయం చేయాలి కానీ.. పతనం కోరుకోవద్దు. నువ్వు నీ ప్రేమే ముఖ్యం అనుకుంటే.. మా కుటుంబం మొత్తం నాశనం అవుతుంది.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

నువ్వు నీ ప్రేమను త్యాగం చేయకపోతే.. నువ్వు, ప్రేమ్ పెళ్లి చేసుకుంటే మా కుటుంబం ముక్కలు అయిపోవడం కాయం. ప్రేమ్ కు తండ్రి ఉండడు. నేను లేని నాడు.. ఆ కుటుంబం వీధిన పడుతుంది.. అనగానే చాలు అంకుల్.. చాలు.. నాకు ఇంకేం చెప్పకండి. నా మూలంగా మీ కుటుంబం వీధిన పడటం నాకు ఇష్టం లేదు. మీకేం కావాలి.. నేను ప్రేమ్ కు దూరంగా ఉండాలి. ప్రేమ్ ను పెళ్లి చేసుకోకూడదు. అంతే కదా.. మీరు చెప్పినట్టే చేస్తాను. ప్రేమ్, ప్రేమ్ ప్రేమకు నేను దూరంగానే ఉండిపోతాను.. ఇక తన జీవితంలోకి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశించను. మీరు చెప్పినట్టు.. మా ప్రేమ ముఖ్యం అనుకొని నేను ప్రేమ్ ని పెళ్లి చేసుకుంటే కుటుంబం అంతా నాశనం అవుతుంది.

మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కష్టాలను అనుభవించడం, కన్నీళ్లను దిగమింగడం నాకు ఎలాగూ అలవాటు అయిపోయింది. ఇకపై అలవాటు చేసుకుంటాను. నా ప్రేమను చంపుకుంటాను. ప్రేమ్ ను దూరం చేసుకుంటాను. ఇది చాలు కదా మీకు.. అనగానే.. నాకు తెలుసు శృతి. నిన్ను ఇలా అడగడం నీకు బాధపెట్టడమే కానీ.. నా కుటుంబం కోసం మాత్రమే ఇలా చేయాల్సి వస్తోంది.. అంటాడు నందు.

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : నేను ప్రేమ్ ను పెళ్లి చేసుకోను అని చెప్పిన శృతి

వద్దు అంకుల్.. నా గురించి మీరు ఆలోచించవద్దు. నాకు ఎదురు దెబ్బలు సహజమే. ఇక నుంచి వచ్చే ఎదురు దెబ్బలు కూడా నాకు కామన్. అంకుల్ మీరు నిశ్చింతగా ఉండండి. మీరు తీసుకొచ్చిన సంబంధం.. ప్రేమ్ చేసుకునేలా చేస్తాను. నేను ఒప్పిస్తాను అని అంటాడు నందు. నాకే కనుక అప్పుల బాధలు లేకపోయి ఉంటే.. ప్రేమ్ తో నీ పెళ్లి జరిపి ఉండేవాడిని. కానీ.. పరిస్థితులు ఇప్పుడు అలా లేవు.. ఏం అనుకోకు అమ్మ.. అని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో.. శృతి.. వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : శృతిని ప్రేమిస్తున్నానని అందరి ముందు చెప్పిన ప్రేమ్

కట్ చేస్తే ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రేమ్ నిర్ణయం ఏంటో నాకు తెలియాలి.. అని అడుగుతాడు నందు. దీంతో వాడికి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు.. వాడి మీద మీ నిర్ణయాన్ని ఎందుకు పదే పదే రుద్దాలని చూస్తున్నారు.. అని అంటుంది తులసి. నేను తీసుకొచ్చిన సంబంధానికి ఓకే చెప్పు.. అంటాడు నందు. లేదు నాన్న.. అంటాడు ప్రేమ్. ఏంట్రా రీజన్ అంటాడు నందు. దీంతో శృతి అని చెబుతాడు ప్రేమ్. దీంతో శృతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నాకు శృతి అంటే ఇష్టం నాన్న. తనను నేను ప్రేమిస్తున్నాను.. అంటాడు ప్రేమ్. దీంతో ఇక చాలు ఆపు ప్రేమ్ అంటూ గట్టిగా అరుస్తుంది శృతి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయి భాగంలో చూడాల్సిందే.

intinti gruhalakshmi 10 september 2021 friday episode 421 highlights

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago