Home » Entertainment » Intinti Gruhalakshmi 10 September 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : నందు, లాస్య నిజ స్వరూపం తెలుసుకున్న సామ్రాట్.. తులసికి సారీ చెబుతాడా? తులసి ఇంట్లోకి వెళ్తాడా?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 10, 2022, 9:01 am
Advertisement

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 734 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లక్కీ ఎలాగైనా తులసి ఇంటికి వినాయక పూజ కోసం వెళ్తా అని తన ప్లాన్స్ తాను చేసుకున్నా అని.. మీరు ఇక్కడే పూజ చేసుకోండి అని చెప్పి లక్కీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. హనీ కూడా వస్తుంది అని చెప్పడంతో లాస్య, నందు షాక్ అవుతారు. అసలు హనీని సామ్రాట్ ఎలా పంపిస్తున్నాడు అని షాక్ అవుతారు. హనీని ఒక్కదాన్నే పంపిస్తాడా లేక సామ్రాట్ కూడా వస్తాడా అని నందు అంటాడు. దీంతో ఏది ఏమైనా మనం కూడా అక్కడికి వెళ్లాలి అని అంటుంది లాస్య. కానీ.. పిలవని పేరంటానికి రావడం నాకు ఇష్టం లేదు అంటాడు నందు. కట్ చేస్తే తెల్లవారుతుంది. లేవగానే ఎదురుగా ఉన్న వినాయకుడి బొమ్మను చూసి పుట్టిన రోజు శుభాకాంక్షలు గణేశా అంటుంది తులసి. నువ్వే మా దేవుడివి అంటుంది తులసి. ఇక నుంచి అయినా నేను తలపెట్టే పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని కోరుకొని అందరినీ నిద్ర లేపుతుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 10 september 2022 full episode

అందరూ రెడీ అవుతుంటారు. పూజకు కావాల్సిన సామాన్లను సర్దుతూ ఉంటారు తులసి, శృతి. శృతిని చూసి చెప్తా నీ పని అని అక్కడ సోఫాలో కూర్చొన్న ప్రేమ్… శృతి తలంటు పోసుకున్నా అంటాడు. దీంతో అయితే అంటుంది శృతి. తలంటు పోసుకొని వచ్చాక తల తూడుస్తా అన్నావు కదా.. అంటాడు. దీంతో ఇప్పుడు నా చేతులు ఖాళీ లేవు అంటుంది శృతి. ఏం కాదు.. నువ్వు వెళ్లు.. నేను ఈ పనులు చూసుకుంటా అంటుంది తులసి. ఇక్కడ ఎందుకు గదిలోకి పదా అంటుంది శృతి. దీంతో అమ్మో.. గదిలోకి వెళ్తే ఇంకేమైనా ఉందా అని అనుకున్న ప్రేమ్.. గదిలోకి ఎందుకు.. ఇక్కడ ఎవరూ లేరు కదా.. ఇక్కడే తల తూడ్చు అంటాడు. దీంతో వెళ్లి తూడుస్తూ ఉంటుంది. ఇంత పనికి వస్తావా అని తన మీద కోపంతో గిచ్చుతుంది. ప్రేమ్ కూడా తన నడుము గిల్లుతాడు.

Advertisement

కట్ చేస్తే లక్కీ తులసి ఇంటికి వస్తాడు. ఒక్కడే వచ్చాడు అని దివ్య అనుకుంటుంది. నువ్వు ఒక్కడివే వచ్చావా.. మీ అమ్మకు చెప్పి వచ్చావా అని అడుగుతుంది అనసూయ. దీంతో నేను ఒక్కడినే వచ్చాను… వాళ్లను రావద్దని కూడా చెప్పాను అంటాడు లక్కీ.

మరోవైపు పూజ స్టార్ట్ అవుతుంది. సామ్రాట్ కారులో హనీని తులసి ఇంటికి తీసుకొస్తాడు. బాబాయి కూడా అదే కారులో వస్తాడు. నన్ను తులసి ఇంటికి తీసుకొచ్చినందుకు చాలా థాంక్స్ డాడీ అంటుంది హనీ.

Advertisement

పదా నాన్నా లోపలికి వెళ్దాం అంటుంది హనీ. దీంతో సామ్రాట్ కు ఏం చెప్పాలో అర్థం కాదు. నాకు ఒక మీటింగ్ ఉంది. నేను కారులో కూర్చొని ఆన్ లైన్ లో కంప్లీట్ చేసుకున్నాక నేను ఇంట్లోకి వస్తాను. తాతయ్యను తీసుకొని వెళ్లు అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 10 Sep Today Episode : దివ్యకు ప్రసాదం ఇవ్వడానికి వెళ్లినట్టు తులసి ఇంటికి వెళ్లిన నందు, లాస్య

బాబాయి, హనీ ఇద్దరూ లోపలికి వెళ్లగా… సామ్రాట్ ఒక్కడే కారులో ఉంటాడు. హనీ ఒక్కదాన్నే పంపిస్తారని అనుకున్నాను. కానీ.. మీరు కూడా వచ్చారు. చాలా సంతోషం బాబాయి అంటుంది తులసి.

కట్ చేస్తే కారులో నందు, లాస్య ఇద్దరూ తులసి ఇంటికి వస్తారు. సామ్రాట్ కారును చూస్తారు. సామ్రాట్ కారే కదా. ఏమాత్రం ఆగలేదా… అప్పుడే వచ్చేశాడా అని అంటుంది లాస్య. పిలవగానే ఎగరేసుకుంటూ వచ్చాడా అని అంటుంది లాస్య.

ఇక ఆపుతావా.. నాకు రావడం ఇష్టం లేదు మొర్రో అంటే తీసుకొచ్చావు అని అంటాడు నందు. నాకు సామ్రాట్ గారి మొహం చూడాలన్నా చిరాకు వేస్తోంది అంటాడు నందు. తర్వాత పదా వెళ్దాం అంటుంది లాస్య.

Advertisement

పిలవని పేరంటానికి వచ్చినట్టుంది అంటాడు నందు. దీంతో నందు చేతుల్లో పటిక బెల్లం పెట్టి దివ్య బాగా చదవాలని గుడిలో పూజ చేయించి తీసుకొచ్చాను అని దివ్య చేతుల్లో ఇది పెట్టు. ఇది ఇవ్వడానికే వచ్చాను అని చెప్పు అంటుంది.

లోపల ఎవ్వరు రెచ్చగొట్టినా కూల్ గా ఉండు. మాజీ భర్త అనే నిజం సామ్రాట్ గారికి తెలియకుండా నువ్వే దాచావని.. తులసికి నువ్వే రిక్వెస్ట్ చేశావనే నిజం పొరపాటున కూడా బయటపెట్టకు… అని నందుతో లాస్య చెబుతుండగా సామ్రాట్ వింటాడు.

వాళ్లు వెళ్లగానే కారు దిగి.. నందు రిక్వెస్ట్ చేయబట్టే తన మాజీ భర్త నందు అనే విషయం తులసి గారు చెప్పలేదా.. నేను తులసి గారిని తప్పుగా అర్థం చేసుకున్నానా.. అని మనసులో బాధపడతాడు సామ్రాట్.

కట్ చేస్తే.. లాస్య, నందు ఇద్దరూ తులసి ఇంటికి వస్తారు. అందరూ వాళ్లను ఆశ్చర్యంగా చూస్తారు. దీంతో మేము పిలవని పేరంటానికి వచ్చామని టెన్షన్ పడుతున్నారా? నందు.. దివ్య కోసం ప్రత్యేకంగా పూజ చేయించాడు.

Advertisement

ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలని పూజ చేయించాడు. ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చాం అంటుంది లాస్య. దివ్యకు ప్రసాదం ఇచ్చాక ఇక వెళ్దామా.. అంటుంది లాస్య. దీంతో వెళ్లిపోవడం ఏంటి డాడ్.. పూజ అయ్యేదాకా ఉండండి అంటాడు అభి.

దీంతో తులసి కూడా ఉండండి అంటుంది. మరోవైపు సామ్రాట్ కూడా వచ్చాడని తెలుసుకొని అతడి దగ్గరికి వెళ్తుంది తులసి. ఇంత దూరం వచ్చి ఇంట్లోకి రాలేదు. ఇంట్లోకి రండి అని చెబుతుంది తులసి.

అయితే.. మా మామ్ కు సారీ చెప్పి పూజలో కూర్చోండి అని సామ్రాట్ తో అభి అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి