Home » Entertainment » Intinti Gruhalakshmi 11 April 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 11 April Today Episode : తులసి ఇల్లు అమ్మిన విషయం ప్రేమ్ కు తెలుస్తుందా? ప్రేమ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు? ఇంతలో మరో ట్విస్ట్ ఏంటంటే?

Authored By
Varun G
The Telugu News | Published on: April 11, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 11 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 ఏప్రిల్ 2022, సోమవారం ఎపిసోడ్ 603 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన తమ్ముడు దీపక్ ను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెబుతుంది తులసి. దీంతో ఏం మాట్లాడకుండానే అక్కడి నుంచి దీపక్ వెళ్లిపోబోతూ.. నువ్వు ఏం నష్టపోతున్నావో నీకు తెలియట్లేదు అక్క.. తెలిసిన రోజున నువ్వే పుట్టింటి గడప తొక్కుతావు అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు మ్యూజిక్ ఆఫీసుకు వెళ్తాడు ప్రేమ్.

Advertisement

intinti gruhalakshmi 11 april 2022 full episode

మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి నేను ఒక పాట రాశాను సార్.. మీకు చూపిస్తా అని అంటాడు. దీంతో ఈరోజు అడక్కుండానే పాట రాశావు.. రేపు అడక్కుండానే ట్యూన్ కడతావు.. ఎల్లుండి నా సీటును కూడా కబ్జా చేస్తావు అంటాడు. నన్ను తక్కువ అంచనా చేయకు. మప్పి లహరి దగ్గర కాదు నీ కుప్పిగంతులు. ప్రతి ఒక్కడు బాలసుబ్రహ్మణ్యం అయిపోదామని. ముందు పోయి సిగిరెట్ ప్యాకెట్ తీసుకురా అంటాడు మప్పి లహరి. దీంతో డబ్బులు తీసుకొని వెళ్తాడు ప్రేమ్.

Advertisement

మరోవైపు రూమ్ ఖాళీ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతుంది తులసి. మేనేజర్ కు ఫోన్ చేసి అడుగుతుంది. ఇంతలో అభి వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు ఒకటి ఖాళీగా ఉంది. అందులోకి రేపే వెళ్లిపోదాం అని అంటాడు అభి. దీంతో సరే.. రేపే వెళ్లిపోదాం అంటుంది తులసి.

అద్దెకు ఇల్లు దొరికింది అని పరందామయ్యకు చెబుతుంది తులసి. ఎందుకో కానీ.. నీలో చాలా మార్పు కనిపిస్తోంది అమ్మ అని అంటాడు పరందామయ్య. నువ్వు బాధతో అలా మాట్లాడుతున్నావో.. బాధపడి అంటున్నావో అర్థం కావడం లేదు. మీ తమ్ముడి మీద నువ్వు అరిచిన విధానం నాకు నచ్చలేదు అంటాడు పరందామయ్య.

Advertisement

నువ్వు పడుతున్న కష్టాలను చూసి అతడు తట్టుకోలేకపోయాడు అంటాడు పరందామయ్య. వాడికి నా మీద నిజంగా ప్రేమ ఉంటే అర్థం చేసుకుంటాడు అంటుంది తులసి. మా అమ్మ ప్రేమ, కోపం ఎలా ఉంటాయో నాకు తెలుసు. అర్థం చేసుకుంటుంది అమ్మ కదా. మా అమ్మ నాలా మొండిది కాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు దివ్య ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ సంతోషంగా గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. అభి కూడా అంతే. మామ్ నాకు జన్మనివ్వడమే కాదు.. ప్రాణాలు కూడా కాపాడింది. కానీ.. ఇటువంటి క్రిటికల్ టైమ్ లో మామ్ కు సాయం చేయలేకపోయాను అని అంకితతో చెప్పి బావురుమంటాడు అభి.

Intinti Gruhalakshmi 11 April Today Episode : తన తల్లికి సాయం చేయలేకపోయానని బాధపడ్డ అభి

అంత డబ్బు ఎవరైనా ఎక్కడి నుంచి తెస్తారు చెప్పు. ఇల్లు అమ్మడం తప్ప ఇంకో మార్గం లేదు అంటుంది అంకిత. ఈ ఇంటికి దూరం అవడం అంటే అమ్మకు దూరం అవుతున్నట్టుగా ఉంది అంటాడు అభి. ఇదే ఈ ఇంట్లో ఆఖరి రోజు అంటే నా మనసు ఒప్పుకోవట్లేదు అంటాడు అభి.

ఇదంతా ఒక పీడ కల అయితే ఎంత బాగుండు అనిపిస్తోంది అంటాడు అభి. ఏం జరిగినా మన మంచికోసమే అని అనుకోవాలి అంటుంది అంకిత. ఇన్ని రోజులు నా మనుషులు దూరం అయ్యారు. ఇప్పుడు ఇల్లు కూడా దూరం అవుతోంది అని బాధపడతాడు పరందామయ్య.

Advertisement

ఒకసారి ఇల్లంతా తిరిగి చూసుకొని బాధపడుతుంది తులసి. ప్రతి ఒక్క రూమ్ కు వెళ్లి.. అక్కడి సామాన్లను చూసి పాత మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది. చాలా బాధపడుతుంది తులసి. తనకు ఏం చేయాలో అర్థం కాదు. ఒక చోట కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది.

ఎన్ని తీపి మెమోరీస్ ను ఇచ్చి ఈ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది అని బాధపడుతుంది తులసి. ఇంతలో అక్కడికి రాములమ్మ వస్తుంది. ఈ ఇల్లు వదిలి వెళ్లాలంటే కష్టంగానే ఉంటుందమ్మ అంటుంది రాములమ్మ. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. ఎవ్వరూ శాశ్వతం కాదు అని తెలుసు. అయినా మనసు బాధపడటం మానదు.. ఆశ పడటం మానదు.. ఏడిపించడం మానదు అంటుంది తులసి.

భోజనానికి సిద్ధం చేశావా అని అడుగుతుంది తులసి. దీంతో చేశానమ్మా.. టేబుల్ మీద సిద్ధం చేశా అంటుంది రాములమ్మ. కట్ చేస్తే తెల్లారుతుంది. జీవితంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని బంధాలు పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. కొన్ని బంధాలు తెంచుకోవడం కూడా అంతే అవసరం అంటుంది తులసి.

ఆ తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి