Intinti Gruhalakshmi 11 March Today Episode : ప్రేమ్, శృతి తిరిగి ఇంటికి వస్తారా? దివ్య ఆరోగ్యం కుదుటపడుతుందా? తులసి మరోసారి షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi 11 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 577 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకితను పిలిచి.. దివ్య భోజనం చేయడం లేదు. నేను ఎంత బతిమిలాడినా తినడం లేదు. ఏదోలా నచ్చజెప్పి దివ్యతో నువ్వే అన్నం తినిపించాలమ్మా అంటుంది తులసి. అది పీకల దాకా నా మీద కోపం పెంచుకుంది. ఏం చేయాలి చెప్పు. ఈ జీవితంలో నాకు మిగిలిందే పిల్లలు.. కానీ.. వాళ్లే నా మాట వినకపోతే నేను ఏం చేయాలి చెప్పు అంటుంది తులసి. దీంతో సరే ఆంటి.. నేను దివ్యకు నచ్చజెప్పుతాను అంటుంది అంకిత. ప్రేమ్ విషయంలో మాత్రం మీరు చేసింది కరెక్ట్ అనిపించలేదు ఆంటి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అంకిత.

intinti gruhalakshmi 11 march 2022 full episode

ఏది ఎప్పుడు వదులుకోవాలో తెలుసుకోవడమే వైరాగ్యం అని అనుకుంటుంది. ఇంతలో శశికళ ఫోన్ చేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది తులసి. టైమ్ దగ్గర పడుతోంది కదా.. అందుకే ఒకసారి గుర్తు చేద్దామని ఫోన్ చేశా అంటుంది శశికళ. నా ప్రయత్నాల్లో నేను ఉన్నాను.. అంటుంది తులసి. దీంతో నేను కూడా నా ప్రయత్నాల్లో ఉన్నాను అంటుంది శశికళ. ఒకవేళ నువ్వు డబ్బులు కట్టకపోతే నేను ఇల్లు అమ్మాలి కదా అంటుంది శశికళ. దీంతో అటువంటి ప్రయత్నాలు నువ్వు వెంటనే మానుకో.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది తులసి. ఇంతలో మాధవి వస్తుంది. నువ్వు తప్పు చేశావేమో వదిన అంటుంది మాధవి. ప్రేమ్ విషయంలో తొందరపడ్డావేమో అంటుంది.

దీంతో నువ్వు కూడా అందరిలాగే ఆలోచిస్తున్నావు అంటుంది తులసి. మరోవైపు అమ్మ ఎంత మొండిగా ఉంటే నేను అంతకంటే ఎక్కువ మొండిగా ఉంటాను అని అంకితతో అంటుంది దివ్య. నేను అస్సలు అన్నం తినను.. నాకు వద్దు.. అని మొండికి పోతుంది దివ్య.

నేను అస్సలు తగ్గను. నేను ఒక్క ముద్ద కూడా తినను. ప్రేమ్ అన్నయ్య ఇంటికి తిరిగి వస్తేనే నేను అన్నం తింటాను. లేకపోతే తినను. వెళ్లి అమ్మకు చెప్పు అంటూ ఆవేశపడుతుంది దివ్య. దీంతో తను కళ్లు తిరిగిపడిపోతుంది. దీంతో రూమ్ కు తీసుకెళ్లి బీపీ చెక్ చేస్తుంది అంకిత.

అమ్మ.. అంకిత ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంది తులసి. ఎంత చెప్పినా దివ్య వినడం లేదు. తినకపోవడం వల్లే ఈ కళ్లు తిరుగుడు.. చాలా వీక్ అయిపోయింది అని చెబుతుంది అంకిత. తులసి పట్టుకున్నా కూడా తనను విదిలించుకుంటుంది దివ్య.

Intinti Gruhalakshmi 11 March Today Episode : ప్రేమ్ వచ్చి అన్నం తినిపిస్తేనే తింటా అని మొండిపట్టుతో ఉన్న దివ్య

దీంతో తప్పు దివ్య అలా చేయకూడదు అంటుంది మాధవి. దీంతో ముందు మామ్ కు చెప్పండి ఆ విషయం అంటుంది దివ్య. ఇన్నాళ్లు ఎప్పుడూ మా మామ్ కు ఎదురు తిరగలేదు.. అంటుంది దివ్య. మీ కోసం అంతగా ఆలోచించే తను.. ప్రేమ్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుందంటే అది మంచిదే అయి ఉండొచ్చు కదా అంటుంది మాధవి.

ప్రేమ్.. ప్రస్తుతానికి మాత్రమే ఇంట్లో నుంచి వెళ్లాడు. ఇది శాశ్వతం మాత్రం కాదు. ఏదో ఒక రోజు ప్రేమ్ ఇంటికి తిరిగి వస్తాడు అంటుంది తులసి. అయితే.. ప్రేమ్ అన్నయ్యను ఇంట్లో నుంచి పంపించడం మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతుంది దివ్య.

దీంతో మీరే కాదు.. అందరూ వ్యతిరేకిస్తున్నారు అంటుంది దివ్య. ఏదో ఒక రోజు నేను అత్తారింటికి వెళ్లాల్సిందే. అలా అని ఇప్పటి నుంచే నేను అన్నయ్యకు దూరంగా ఉండాలా అంటుంది దివ్య. చిన్న కోరిక నాది. ప్రేమ్ అన్నయ్య వచ్చి తినిపిస్తేనే నేను తింటాను అని చెబుతున్నాను. కానీ.. మీరే ఒప్పుకోవడం లేదు అంటుంది దివ్య.

నాలో ఉన్నది మామ్ రక్తమే. మామ్ మొండితనమే నాకు వచ్చింది అనుకోండి. చూడండి.. అత్తయ్య నాకు మాట్లాడే ఓపిక లేదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. అందరూ నా ముందు నుంచి వెళ్లిపోండి అంటుంది దివ్య. దివ్య కూల్ డౌన్ అన్నా కూడా వినకుండా అరుస్తుంది.

పెద్ద వాళ్లకు అనుకూలంగా చిన్నవాళ్లు నడుచుకోనప్పుడు.. చిన్నవాళ్లకు అనుకూలంగా పెద్దవాళ్లు నడుచుకోవాల్సి వస్తుంది. వేరే దారి లేదమ్మా అంటాడు పరందామయ్య. దీంతో తులసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఏం చేయాలో తనకు అర్థం కాదు.

ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది మాధవి. పిల్లలు లేని వాళ్లే హాయిగా ఉంటారని అంటుంది తులసి. దీంతో ఎందుకు అలా మాట్లాడుతున్నావు వదిన అంటుంది మాధవి. చూశావు కదా దాని పంతం అంటుంది. దానితో ఎలా మాట్లాడాలో.. ఎలా తినిపించాలో అయోమయంగా ఉంది మాధవి అంటుంది తులసి.

మరోవైపు తాము తీసుకున్న రూమ్ ను క్లీన్ చేస్తుంటారు ప్రేమ్, శృతి. మధ్యమధ్యలో రొమాన్స్ చేసుకుంటూ ఇద్దరూ సరదాగా రూమ్ ను క్లీన్ చేస్తారు. అక్కడ ఎంత పెద్ద ఇల్లు ఉన్నా ఏదో ఇరుకుగా ఉండేది. కానీ.. ఇక్కడ మాత్రం చాలా ఇరుక్కుగా ఉన్నా ఎంతో విశాలంగా ఉన్నట్టు అనిపిస్తోంది అంటుంది శృతిప.

ఆ తర్వాత కాసేపు ఇద్దరూ రొమాన్స్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎక్కడ ఏ సామాను పెట్టాలో చెబుతుంది శృతి. సరే.. నేను ఒకసారి బయటికి వెళ్లి వస్తాను అంటాడు ప్రేమ్. మరోవైపు తులసి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో నందు వచ్చి దివ్యకు ఎలా ఉంది అని అనసూయను అడుగుతాడు.

దీంతో మమ్మల్ని అడుగుతావేరా.. వెళ్లి చూడు అంటుంది అనసూయ. దివ్య దగ్గరికి వెళ్తాడు నందు. ఏంటమ్మా.. ఇదంతా.. నీకు డాడీ లేడనుకున్నావా.. అంటాడు నందు. మేము డాడీ లేడనుకోవడం కాదు.. మీరే మమ్మల్ని వద్దనుకున్నారు అంటుంది దివ్య.

ఆ తర్వాత తులసి దగ్గరికి వెళ్లి.. అది ప్రేమ్ వస్తే కానీ అన్నం తినను అంటోంది అని చెబుతాడు నందు. దీంతో మరి ప్రేమ్ తిరిగి వచ్చాక వాడితో ఎప్పుడూ గొడవ పడను అని మాటిస్తారా అని నందును అడుగుతుంది తులసి. సమాధానం చెప్పండి అంటుంది. సరే మాటిస్తాను అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Affair : చెల్లెలు భ‌ర్త‌తో స్టార్ హీరోయిన్ ఎఫైర్.. ఆ హీరోని కూడా వ‌ద‌ల్లేదుగా..!

Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్‌ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్‌లో అయితే ఇటువంటి వార్తలు…

7 hours ago

TSRTC : రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC

TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…

8 hours ago

Rakhi Festival : రక్షాబంధన్ స్పెషల్.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన రాష్ట్రాలు!

Rakhi Festival :  రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…

9 hours ago

Holidays : విద్యార్ధుల‌కి గుడ్ న్యూస్.. ఏకంగా 5 రోజులు సెల‌వు..!

Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…

10 hours ago

Best Phones : రూ.15 వేల లోపు ఫోన్ కోసం చూస్తున్నారా.. ఈ ఫోన్స్ బెస్ట్ చాయిస్

Best Phones : భారత మార్కెట్‌లో బడ్జెట్‌ సెగ్మెంట్‌కు భారీ డిమాండ్‌ ఉండటంతో, అనేక స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు అత్యుత్తమ ఫీచర్లతో…

11 hours ago

Rakhi Gift : ప్రధాని మోడీ రాఖీ గిఫ్ట్ – వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు..!?

Rakhi Gift : రాఖీ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు ప్రత్యేక కానుక ప్రకటించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.…

12 hours ago

India : అమెరికా కు భారీ షాక్ ఇచ్చిన భారత్

India  : అమెరికా విధించిన భారీ సుంకాలకు ప్రతిగా భారత్ ఒక కీలకమైన, వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అమెరికా నుండి…

13 hours ago

Nara Lokesh : 2029 సీఎం అభ్యర్థిగా నారా లోకేష్..?

Nara Lokesh  : ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటిన తర్వాత, కూటమిలో ఇబ్బందికర…

14 hours ago