
intinti gruhalakshmi 11 may 2022 full episode
Intinti Gruhalakshmi 11 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 11 మే 2022, బుధవారం ఎపిసోడ్ 629 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి.. కలెక్టర్ ప్రవళిక అవార్డును ఇచ్చి.. తులసి గొప్ప తల్లి అని తెలుసు కానీ.. ఎంత గొప్ప తల్లో ఈరోజే తెలిసింది అంటుంది ప్రవళిక. పిల్లల భవిష్యత్తు కోసం జీవితంలో త్యాగం చేసేది నాన్న అయితే.. జీవితాన్నే త్యాగం చేసేది అమ్మ అంటుంది ప్రవళిక. ఒక మొబైల్ ను ఎంతో జాగ్రత్తగా చూసుకునే నేటి జనరేషన్ తల్లి విషయంలో మాత్రం ఎందుకు అంత అశ్రద్ధ చూపిస్తారు. ఒక మొబైల్ పోతే ఇంకో మొబైల్ కొనుక్కోవచ్చు కానీ.. తల్లి విషయంలో అలా జరగదు కదా.. అని చెప్పి తన మీటింగ్ ను ముగించేస్తుంది ప్రవళిక.
intinti gruhalakshmi 11 may 2022 full episode
తర్వాత తన అవార్డును చూసుకొని మురుస్తుంది తులసి. నువ్వు బెస్ట్ మదర్ అవార్డును గెలవడం కాదు. నీ మీద ఉన్న నమ్మకాన్ని గెలిచావు. నిన్ను నువ్వు గెలిచావు అంటుంది ప్రవళిక. నీ ఫ్యాక్టరీ కోసం పెట్టుకున్న అప్లికేషన్ చూసే నీ గురించి తెలుసుకున్నాను అంటుంది ప్రవళిక. కానీ.. నీ గురించి మాత్రం చెప్పకుండా దాచావు కదా అంటుంది తులసి. నువ్వు కలెక్టర్ వి. ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఇంత బిజీలో నాతో ఎలా ఉండగలుగుతున్నావవు అని అడుగుతుంది. ఎంత బిజీగా ఉన్నా.. నాకంటూ ఒక సమయం ఉంటుంది. నా మనసుకు నచ్చిన పని చేసి గడుపుతాను. నాకోసం కేటాయించుకున్న ఆ టైమ్ లోనే నీతో గడుపుతున్నాను. ఆ పని నువ్వెందుకు చేయలేవు అని అడుగుతుంది ప్రవళిక.
రెండు రోజుల పాటు మన పనులను మరిచిపోయి.. చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేశాం. అలా తిరగడం వల్ల నీ బాధ్యతలను వదులుకున్నావా? మీ వాళ్లు ఏమైనా అన్నారా.. లేదు కదా. నువ్వు ఎంత వెంపర్లాడినా.. ఏ బంధం నీతో రాదు తులసి. వాటి కోసం నీ ఆనందాన్ని దూరం చేసుకోకు. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను అంటుంది ప్రవళిక.
మరోవైపు లక్కీని కోపంతో ఇంటికి తీసుకొచ్చి బెడ్ రూమ్ లో పడేస్తుంది లాస్య. ఏరా.. పది మందిలో నా పరువు తీస్తావా. నన్ను పట్టించుకోలేదని చెప్తావా? అసలు నీకు ఏం తక్కువ చేశానురా నీకు అని అడుగుతుంది. అసలు.. నిన్ను ఇలా కాదు.. బెల్ట్ తో కొడితే కానీ.. నీకు బుద్ధి రాదు అంటుంది.
సారీ మమ్మీ.. ఇంకోసారి అలా చేయను. నీ గురించి గొప్పగా చెబుదామనుకున్నాను కానీ.. నా మనసులోని మాటలు వచ్చాయి అని అంటాడు. ఇంతలో నందు వస్తాడు. లాస్య.. చిన్నపిల్లాడు వదిలేయ్ అంటాడు నందు. వీడికి నాకంటే తులసే ఎక్కువయిపోయింది అంటుంది లాస్య.
తులసి మీద ఉన్న కోపం వాడి మీద చూపిస్తే ఎలా అని అడుగుతాడు నందు. వద్దు అన్నా కూడా కాంపిటిషన్ లో పార్టిసిపేట్ చేశావు. నీ కొడుకే నీ పరువు తీశాడు అంటాడు నందు. దీంతో మరి నీ కొడుకులు చేసింది ఏంటి. వాళ్లు కూడా నీ పరువు తీశారు కదా అంటుంది లాస్య.
నీ మాజీ భార్యకు బెస్ట్ మదర్ అవార్డు రావాలని నువ్వు ఇన్ డైరెక్ట్ గా హెల్ప్ చేశావా అని నందు మీద సీరియస్ అవుతుంది లాస్య. దీంతో నందు ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఆ తర్వాత ఈ ఆడాళ్లకు ప్రస్ట్రేషన్ తీరడానికి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటారేమో అని అనుకుంటాడు నందు.
తర్వాత నువ్వు మా డాడీ కాదు కదా. నేను, మమ్మీ గొడవ పడుతుంటే మధ్యలో ఎందుకు వచ్చావు అంటాడు లక్కీ. దీంతో అంటే ఏంటి.. నన్ను డాడీ అని పిలుస్తావా అని అంటాడు నందు. దీంతో అంతలేదు.. నా మనసు ఒప్పుకోవాలి అని చెప్పి లక్కీ అక్కడినుంచి వెళ్లిపోతాడు.
ప్రవళిక మాటలు తులసిని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇక నుంచి నా కోసం.. నాకు నచ్చింది చేస్తా అని తన ఇంటి ముందు ఉన్న గులాబీ చెట్టుకు చెబుతుంది. కట్ చేస్తే ఉదయమే జాగింగ్ డ్రెస్ వేసుకొని యోగా చేస్తుంది తులసి. ఆ తర్వాత కాసేపు చెట్లకు నీళ్లు పోస్తుంది.
తర్వాత ఇంట్లో పనులన్నీ చేసి బయటికి వెళ్తుంది తులసి. మరోవైపు ఉద్యోగం కోసం ఓ ఆఫీసుకు వెళ్తుంది తులసి. అక్కడ నందు కూడా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.