Intinti Gruhalakshmi 12 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 12 మే 2022, గురువారం ఎపిసోడ్ 630 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంట్లో వాళ్లందరికీ వంట వండిన తర్వాత తులసి రెడీ అవ్వడం కోసం తన రూమ్ లోకి వెళ్తుంది. ముందు చీర కట్టుకుందామని అనుకుంటుంది కానీ.. చీర కంటే.. ప్రవళిక కొనిపించిన డ్రెస్ వేసుకుందామని అనుకుంటుంది. తనను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని.. వెళ్లి రెడీ అవుతుంది. మరోవైపు పరందామయ్య, అనసూయ ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఇంతలో తులసి చుడీదార్ వేసుకొని రెడీ అవుతుంది. తనను చూసి అనసూయ ఇలారా అని పిలుస్తుంది. దివ్య.. తులసి వేసుకున్న డ్రెస్ చూసి షాక్ అవుతుంది.
ఈ డ్రెస్ బాగుంది అని అంటుంది అనసూయ. ఇన్నేళ్ల ప్రయాణం తర్వాత కూడా కాలం నిన్ను మొదటి మెట్టు మీదనే నిలబెట్టి యుద్ధం చేయమంటోంది అంటాడు పరందామయ్య. తులసి ఇంటర్వ్యూకు వెళ్తుండటంతో అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతారు. ఇంతలో ప్రవళిక ఫోన్ చేస్తుంది. ఈరోజు రెగ్యులర్ చెకప్ కు హాస్పిటల్ కు వెళ్తున్నావా అని అడుగుతుంది. దీంతో వెళ్లాలి అంటుంది తులసి. దీంతో నేను కూడా నీతో వస్తా అంటుంది. కానీ.. నువ్వెందుకు.. నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నా. ఇంటర్వ్యూ అయ్యాక చెకప్ కు వెళ్తా అంటుంది. దీంతో నీ ఇంటర్వ్యూ ఎక్కడో చెప్పు.. నేను అక్కడికి వచ్చేస్తా అంటుంది. ఆ తర్వాత దివ్యను ఆన్ ది వేలో డ్రాప్ చేసి.. తను ఇంటర్వ్యూకు వెళ్తుంది. మరోవైపు పరందామయ్య, అనసూయ.. ఇద్దరూ గుడికి వెళ్తారు.
కట్ చేస్తే.. నందు.. ఓ కంపెనీకి వెళ్తాడు. ఆ కంపెనీ తన ఫ్రెండ్ దే. కలిసి బిజినెస్ చేద్దామని నీకు చాలా ఆఫర్లు ఇచ్చాను కానీ.. నువ్వు ఓకే చెప్పలేదు అంటాడు. ఏం చేద్దాం.. శని నా నెత్తిన కూర్చున్నాడు అంటాడు. నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఎనర్జీ అస్సలు వేస్ట్ కాకూడదు అంటాడు. ఈరోజు నుంచి నువ్వు నా కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్ వి అంటాడు.
దీంతో థాంక్యూ చెబుతాడు నందు. ఇద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అదే కంపెనీకి తులసి ఇంటర్వ్యూకు వస్తుంది. రిసెప్షనిస్ట్ దగ్గర ఇంటర్వ్యూకు వచ్చాను అని చెబుతుంది. మీరు ఇక్కడ వెయిట్ చేయండి. నేను సార్ కు చెప్పి వస్తాను అంటుంది రిసెప్షనిస్ట్.
సార్.. ఇంటర్వ్యూ కోసం ఒక లేడీ వచ్చారు అంటుంది. దీంతో సరే రమ్మను అంటాడు. నందు కూడా అక్కడే కూర్చుంటాడు. తులసి లోపలికి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఇంతలో అక్కడే ఉన్న నందును చూస్తుంది తులసి.
నేను పెద్దగా చదువుకోలేదు అని అంటుంది. కానీ.. జీవితాన్ని పూర్తిగా చదివేశాను అంటుంది. మినిమన్ క్వాలిఫికేషన్ లేకుండా ఉద్యోగం ఇవ్వడం కుదరదు అంటాడు అతడు. కొంచెం ఓపిక చేసుకొని నా ఫైల్ చూడండి. నేను ఏం సాధించానో మీకు తెలుస్తుంది.. అంటుంది తులసి.
మూతపడిన ఒక ఫ్యాక్టరీని నేను ప్రాఫిట్ లోకి తీసుకొచ్చాను అంటుంది తులసి. పని చేయాలంటే చదువే కావాలా.. కష్టపడే నైజం, నిజాయితీ ఉంటే చాలదా అంటుంది. మీరు నాకు ఎలాంటి పని అయినా ఇవ్వండి.. నేను కష్టపడి పని చేస్తాను అంటుంది తులసి.
నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి.. అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది. దీంతో మీ బాధ్యతలతో మాకు సంబంధం ఏంటి అంటాడు. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తాడు అని అడుగుతాడు. దీంతో విడాకులు తీసుకున్నాను అని చెబుతుంది తులసి.
చూడండి తులసి గారు.. మీ కథ నా గుండెను పిండేసింది. సింపథీ చూపించగలను తప్ప ఏం చేయలేను. మా కంపెనీ పాలసీ ప్రకారం.. బేసిక్ క్వాలిఫికేషన్ లేకుండా జాబ్ ఇవ్వడం కుదరదు అని అంటాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.
ఆ తర్వాత నీకో విషయం చెప్పాలి అని నందు.. అతడితో అంటాడు. ఇంతలో తులసిని పిలుస్తారు. మీరు నందు భార్య అని ఒక మాట ముందే చెప్పి ఉంటే చాలు కదా. అపాయింట్ మెంట్ ఆర్డర్ చేతుల్లో పెట్టేవాడిని కదా అంటాడు ఇంటర్వ్యూయర్.
దీంతో నంద గోపాల్ భార్యనని నేను చెప్పలేదు అంటుంది. నంద గోపాల్ భార్య అని నాకోసం ఏం చేయకండి. నాకు భర్త లేడు. నేను ఒంటరి ఆడదాన్ని అంటుంది తులసి. కోపంతో నంద గోపాల్ మీద రగిలిపోతుంది తులసి. అక్కడి నుంచి కోపంతో వెళ్లిపోతుంది.
కానీ.. ఇంటర్వ్యూయర్.. నువ్వేంటో తెలిశాక అసహ్యంగా ఉంది. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకు. నాకేం చెప్పకు వెళ్లు అంటాడు అతడు. దీంతో నందు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తులసి దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకుంటాడు.
నువ్వు అడుగడుగునా నా జీవితానికి అడ్డు పడుతున్నావు అంటాడు. నాకు అలాంటి సరదాలేవీ లేవు అంటుంది తులసి. కసిగా కడుపులో కత్తి దింపిన వాడే జాలి పడుతుంటే చాలా అసహ్యంగా ఉంటుంద నంద గోపాల్ గారు అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.