Intinti Gruhalakshmi 27 July 2022 Full Episode
Intinti Gruhalakshmi 13 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 జులై 2022, బుధవారం ఎపిసోడ్ 683 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు నిద్ర మాత్రలు కలిపిన మజ్జిగే ఇచ్చావు కదా. తను ఏమాత్రం బెనుకు లేకుండా బోనం ఎత్తుకొని నడుస్తోంది అని భాగ్య లాస్యతో అంటుంది. ఇంతలో తులసి కళ్లు మూస్తూ తెరుస్తూ వెళ్తుండటం లాస్య చూస్తుంది. చూసి సంతోషిస్తుంది. మన నిద్రమాత్రలు ఇప్పుడు పని చేస్తున్నాయి అని అంటుంది లాస్య. అయితే.. తులసికి కళ్లు తిరుగుతున్నట్టు ఉందని తెలుసుకున్న వసుధర తన ముఖాన పసులు నీళ్లు చల్లుతుంది. తులసే తనకు పసుపు నీళ్ల గురించి బోనం తయారు చేస సమయంలో చెబుతుంది. ఆ విషయం గుర్తు తెచ్చుకొని పసుపు నీళ్లు చల్లుతుంది. ఆ తర్వాత ఏమైంది తులసి అని అడుగుతుంది అనసూయ. దీంతో ఏమైందో తెలియదు కళ్లు తిరుగుతున్నాయి అని అంటుంది తులసి. నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని పైకి వెళ్లి అమ్మవారికి బోనం సమర్పిస్తుంది తులసి.
intinti gruhalakshmi 13 july 2022 full episode
ఆ తర్వాత లాస్య బోనం సమర్పించబోతూ పైకి ఎక్కుతూ కింద పడబోతుంది. ఇంతలో తులసి తనను పట్టుకుంటుంది. నిన్న పడకుండా పట్టుకుంది నీ మీద ప్రేమతో కాదు.. నీ తల మీద ఉన్న అమ్మవారి ప్రసాదం కింద పడకూడదని. వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించు అంటుంది తులసి. మరోవైపు జోగిని మాట్లాడుతూ ఉంటుంది. మారిపోతుంది అంటూ తులసిని చూసి మాట్లాడుతుంది జోగిని. అతి త్వరలో నీ జీవితంలో కొత్త రంగులు, కొత్త సంతోషాలు.. కొత్త మనిషి రాబోతున్నాడు అంటుంది జోగిని. దీంతో తులసి షాక్ అవుతుంది. ఆ కొత్త మనిషి నీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతున్నాడు అంటుంది. నీ చిక్కుముడులు విప్పబోతున్నాడు. నరదిష్టి నాశనం అవుతుంది. నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది. ఏడిపించే వాళ్లు ఏడిపిస్తూ పారిపోతారు అంటుంది జోగిని. అధైర్యపడకు. నన్ను నమ్ముకో అంటుంది. సరైన నిర్ణయాలు తీసుకో అంటుంది. నీ వెంట ఉండి నేను నడిపిస్తాను అంటుంది.
కట్ చేస్తే ఏంటి లాస్య ఇలా జరిగింది అని భాగ్య లాస్యతో అంటుంది. ఇంతలో వసుధర వస్తుంది. అనుకున్నదొకటి.. అయింది ఒకటి అంటుంది వసుధర. మీరు మజ్జిగలో నిద్రమాత్రలు కలపడం అన్నీ నేను చూశా అంటుంది వసుధర. వాళ్లకు క్లాస్ పీకుతుంది. మీకు మంచి బుద్ధి ప్రసాదిస్తే వచ్చే ఏడాది మంచిగా మొక్కు తీర్చుతామని మొక్కుకోండి. బాగుపడతారు. వెళ్లొస్తా అని చెప్పి వసుధర అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
తులసి దగ్గరికి వెళ్లి నా కోసం వెతుకున్నారా అని అడుగుతుంది వసుధర. మీరు వచ్చాక మీకు కనిపించి మీ ఆశీస్సులు తీసుకొని వెళ్దామని ఆగాను అంటుంది వసుధర. తనను ఆశీర్వదించమని అడుగుతుంది వసుధర. నా మీద ప్రేమతో దగ్గరుండి నా మొక్కు తీరేలా చేసి నన్ను సమస్య నుంచి బయటపడేలా చేశావు. నీ రుణం తీర్చుకోలేను అంటుంది తులసి.
కట్ చేస్తే ప్రేమ్, శృతి ఇద్దరూ దేవుడికి పూజ చేసి.. 5 లక్షల చెక్ ను దేవుడి దగ్గర పెడతారు. ఈ 5 లక్షలు నీ కష్టార్జితం. చాలా ఆనందంగా ఉంది కదా అని అంటుంది శృతి. దీంతో అవును కానీ.. నాకు ఈ కప్పు మా అమ్మ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటాడు ప్రేమ్.
వెంటనే నువ్వు ఆల్బమ్ చేసి నువ్వేంటో నిరుపించుకో అంటుంది శృతి. దీంతో నేను ప్రస్తుతానికి ఆల్బమ్ చేద్దామనే ఆలోచనను విరమించుకుందామనుకుంటున్నాను.. అంటాడు. దీంతో ఎందుకు ప్రేమ్ ఏమైంది అని అడుగుతుంది. దీంతో దీని అవసరం ఎవరికి ఉందో వాళ్లకే ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు ప్రేమ్.
నేను ఈ డబ్బు ఇద్దామనుకునేది అమ్మకే అంటాడు ప్రేమ్. నాకంటే అమ్మకే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. అప్పుడు డబ్బు లేక ఏం చేయలేకపోయాను. ఇప్పుడు డబ్బు ఉండి ఇవ్వకపోతే నేను స్వార్థపరుడిని అవుతాను అంటాడు. మ్యూజిక్ స్కూల్ కోసం అమ్మకు ఇది నా ఉడుతాభక్తి సాయం చేస్తాను అంటాడు ప్రేమ్.
కట్ చేస్తే.. అంకిత తనకు ఒక సలహా కావాలని అడుగుతుంది తులసిని. నాకు తెలిసిన ఓ హాస్పిటల్ ఉంది. దాన్ని మూసేద్దామనుకుంటున్నారు. నా కొలిగ్స్ అంతా కలిసి అక్కడ క్లీనిక్స్ పెట్టాలనుకుంటున్నారు అని అడుగుతుంది అంకిత. దీంతో అందరూ ఒకేచోట ఉంటే మంచిదే కదా అంటుంది తులసి.
ఇంతలో నాకో ఐడియా అంటుంది. అంకితకు చెప్పిన సలహానే నువ్వు ఎందుకు పాటించకూడదు అంటుంది అనసూయ. ఏదైనా స్కూల్ లో రెంట్ కు తీసుకొని అందులో మ్యూజిక్ స్కూల్ పెట్టుకోవచ్చు కదా అంటుంది అనసూయ. దీంతో నాకు తెలిసిన ఒక డ్యాన్స్ స్కూల్ ఉంది. ఇప్పుడే వెళ్లి అడిగి వస్తాను అంటుంది తులసి.
ఇంతలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. దీంతో ఓకే రండి అంటుంది స్కూల్ ప్రిన్సిపల్. కట్ చేస్తే హనమ్మ ఇంటి బయట ఆడుకుంటూ ఉంటుంది. సైకిల్ తొక్కుతూ ఉంటుంది. నాకు బోర్ కొడుతోంది. సైకిల్ ఇక్కడ తొక్కకుండా కాసేపు రోడ్ మీదికి వెళ్లి తొక్కుతా అంటుంది హనీ.
వద్దు.. అయ్యగారికి తెలిస్తే నాకు ఇక్కడే సమాధి కడతారు వద్దు అంటాడు పని వ్యక్తి. దీంతో సరే.. నాకు దాహంగా ఉంది.. మంచి నీళ్లు తీసుకురా అంటుంది. ఆ తర్వాత పరందామయ్య, అనసూయను జైలులో వేస్తారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తులసిపై ఇన్ స్పెక్టర్ కోపంతో గన్ గురి పెట్టి నా హనీనే కిడ్నాప్ చేస్తావా? షూట్ చేసి పడేస్తా అంటూ బెదిరిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
This website uses cookies.