Nayanthara has a range that even star heroes don't have Here is the proof
Nayanthara : సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయనతారకు ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన నయనతార , ఆ తర్వాత తమిళ భాషలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ రెండు భాషలలో అవకాశాలు అందుకున్న నయనతార ఆ తర్వాత ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తెలుగులోనే. దాంతో సౌత్ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్‌గా నయన్ హాట్ టాపిక్ అయింది. చెప్పాలంటే ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న స్టార్ హీరోలకు ఏ రేంజ్ ఉందో అదే రేంజ్ అమ్మడికీ ఉంది.
నయనతార హీరోయిన్ అంటేనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయిపోతుంది. మూవీ ప్రమోషన్స్‌కు నయన్ రాదు. పైగా భారీ రెమ్యునరేషన్. ఒక్కసారి తన డేట్స్ గనక మేకర్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ ఇవ్వడం చాలా కష్టం. అంత బిజీగా నయన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తోంది. జూన్ 9న ఘనంగా పెళ్లి చేసుకున్న నయన్ మళ్ళీ పెద్ద గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్స్‌లో జాయిన్ అయిపోయింది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్, బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన జవాన్ సినిమాలలో నటిస్తోంది. అయితే, ఇవి పెళ్లికి ముందే కమిటైన సినిమాలు కదా అందుకే కంప్లీట్ చేస్తుంది తప్ప కొత్త ప్రాజెక్ట్స్ ఇక కమిటవదని ప్రచారం జరిగింది.
Nayanthara has a range that even star heroes don’t have Here is the proof
కానీ, దానికి ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చి స్వీట్ షాక్ ఇచ్చింది. తన 75వ సినిమాను నయనతార తాజాగా ప్రకటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంస్థలో నయన్ కొత్త మూవీ కమిటైంది. తాజాగా ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మేరకు మేకర్స్ సాలీడ్ వీడియోతో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఇక అతి త్వరలో ఈ నయనతార 75వ సినిమాను సెట్స్ మీదకు తీసుకు రానున్నారు. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద దర్శకత్వ విభాగంలో పని చేసిన నీలేష్ కృష్ణా దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. కాగా, త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ మేకర్స్ వెల్లడించనున్నారు. ఇక నయనతార బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ చేస్తున్న జవాన్ గనక భారీ హిట్ సాధిస్తే అక్కడ నుంచి కూడా వరుసగా సినిమాలు వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశాలను ఖచ్చితంగా దక్కించుకుంటుంది.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.