
intinti gruhalakshmi 13 november 2021 full episode
Intinti Gruhalakshmi 13 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 నవంబర్ 2021, శనివారం ఎపిసోడ్ 476 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య అసలు స్వరూపం తెలుసుకున్న అనసూయ తులసి విషయంలో తను చేసిన తప్పును చాలా బాధపడుతుంది. తులసిని ఇన్ని రోజులు చాలా బాధపెట్టాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మంచి కోడలు తులసిని కాదనుకొని.. లాస్య వెంట పడ్డాను ఏంటి అని అనుకుంటుంది. మొత్తానికి లాస్య అసలు స్వరూపం తెలుసుకొని లాస్యను పక్కన పెడుతుంది అనసూయ.
intinti gruhalakshmi 13 november 2021 full episode
తులసి రూమ్ లో ఉంటుంది. ఇంతలో నందు డోర్ కొడతాడు. డోర్ ఓపన్ చేయగానే నందు లోపలికి వస్తాడు. నందు మందు తాగి వస్తాడు. తూగుతుంటాడు. తాగి వచ్చార అంటే తాగాల్సి వచ్చింది అంటాడు. నా జీవితం నాది.. నీ జీవితం నీది అన్నావు. మన్నిద్దరం మాజీ భార్యాభర్తలం అన్నావు. మరి నన్ను ఎందుకు నిలదీస్తున్నావు. ఏ హక్కుతో నిలదీస్తున్నావు అంటాడు నందు. ధైర్యం కోసం తాగి వచ్చాను. నీకు నిజాలు చెప్పడం కోసం తాగి వచ్చాను అని తన మనసులో ఉన్న బాధను వెళ్లగక్కుతుంటాడు నందు.
అందరి జీవితాలు ఒకేలా ఉండవు తులసి. ఎవరి బతుకులు వాళ్లవి. నా బలహీనతలను నా బలంతో గెలవాలని చాలాసార్లు ప్రయత్నించాను కానీ.. కొన్ని సార్లు గెలిచాను.. మరికొన్నిసార్లు ఓడిపోయాను. ఆ సమయంలోనే నిన్ను కూడా పోగొట్టుకున్నాను తులసి. ఎప్పటి నుంచో నీకు ఈ నిజం చెప్పాలనుకున్నాను కానీ నాకు ఇన్ని రోజులు కుదరలేదు తులసి.
నిన్ను పట్టించుకోవడం లేదని చాలాసార్లు బాధపడ్డావు. కానీ.. నేనెందుకు అలా చేశానన్నది మాత్రం అర్థం చేసుకోలేకపోయావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం తులసి. ఆ ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. బయటికి చెప్పుకోలేక నలిగిపోయాను. ఎందుకంటే.. అప్పటికే నా జీవితం నా చేయి దాటి పోయింది. నా జీవితంలోకి లాస్య ఎంటర్ అయింది.
నేను తప్పు ఒప్పుకుంటున్నాను.. తల వంచుకొని బతుకుతున్నాను అంటే.. ఎందుకు తల వంచుకొని బతకడం.. నీ బతుకు నీది.. నా బతుకు నాది అంటుంది. నా మీద నీకు ఇప్పటికీ ప్రేమ ఉంది తులసి అంటాడు నందు. కానీ.. తులసి మాత్రం వినదు. లేదు.. నేను ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. నా జీవితం ఇప్పుడే ప్రశాంతంగా ఉంది అంటూ నందుకు తేల్చి చెబుతుంది తులసి. తర్వాత తులసిని నందు బతిమిలాడటం.. ఇద్దరూ కలిసిపోవడం.. ఇదంతా కలగంటుంది లాస్య.
ఇలాంటి కల ఎందుకు వచ్చింది. అతిగా ఊహించుకొని భయపడుతున్నానా.. అని అనుకుంటుంది లాస్య. మరోవైపు తన రూమ్ లో బిజీగా ఏదో పని చేస్తుంటాడు నందు. తులసి మాత్రం పేపర్ చదువుతూ ఉంటుంది. ఇంతలో తులసి నందుకు మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. ఇంతలో లాస్య.. నందుకు ఫోన్ చేస్తుంది.
ఫోన్ చేసి విసిగిస్తుంది. ఏం చేస్తున్నావు అంటుంది. రూమ్ లో ఉన్నాను అంటాడు నందు. అలాకాదు కానీ.. వీడియో కాల్ చేస్తాను లిఫ్ట్ చేయ్ అంటుంది లాస్య. తప్పని పరిస్థితుల్లో వీడియో కాల్ యాక్సెప్ట్ చేస్తాడు నందు. తన రొమాంటిక్ యాంగిల్ గురించి లాస్య.. చెబుతుంది. అ.. ఇద్దరూ చాలా సేపు వీడియో కాల్ లో మాట్లాడుకుంటారు. ఇంతలో తులసి రూమ్ లోపలికి వస్తుంది.
రేపు మార్నింగ్ మీటింగ్ ఉంది కదా.. అని నందు ఏదో అంటుండగానే.. టీ తాగండి అని నందుకు చాయ్ తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో వీడియో కాల్ లో తులసిని చూసి లాస్య షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
This website uses cookies.