
Mahesh babu Athadu Movie producers suffered
Mahesh Babu : మహేశ్ బాబు కెరీయర్లో అతడు సినిమా బిగ్గెస్ట్ హిట్. ఈ సినిమాను ఇప్పటికీ బుల్లి తెర మీద ప్రసారం చేస్తే టాప్ రేంజ్ లో టీఆర్పీ సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. అంటే అతడు హవా ఎంతలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతలా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అతడు సినిమా నిర్మాతకు మాత్రం నష్టాల్నే మిగిల్చిందట. అసలు నిర్మాతకు నష్టాలు రావడానికి గల కారణం ఏంటని పలువురు ఆలోచిస్తున్నారు.
దర్శకుడు త్రివిక్రమ్ తన రెండో సినిమానే మహేశ్ వంటి పెద్ద స్టార్ తో చేయడం నిర్మాతకు నష్టం రావడానికి ఒక కారణమని వాదన వినిపిస్తుంది.అతడు సినిమా హిట్ గా నిలిచినా కానీ సినిమాను నిర్మించిన జయభేరి ఆర్ట్స్ అధినేత, సీనియర్ హీరో మురళీ మోహన్ కు నష్టాలే మిగిలాయని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. మురళీ మోహన్ కు అనుకోని నష్టాలు రావడానికి ప్రధాన కారణం సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాసే అనే విమర్శ కూడా ఉంది.
మెగా ఫోన్ పట్టిన తర్వాత రెండో సినిమాకే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేశ్ వంటి పెద్ద స్టార్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. దీంతో ఉబ్బి తబ్బిబ్బయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ బడ్జెట్ విషయంలో సరిగ్గా నిబంధనలు పాటించలేదట. మొదట అనుకున్న దాని కంటే సినిమా బడ్జెట్ చాలా పెరిగిపోయిందట. ఈ కారణం వలనే అతడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా కానీ నిర్మాతకు మాత్రం నష్టాలను మిగిల్చిందని చెబుతారు.
Mahesh babu Athadu Movie producers suffered
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో అతడు ఎంత బ్లాక్‌బస్టర్ హిట్లో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2005లో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన త్రిష హీరోయిన్‌గా నటించింది. బలమైన కథ, స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాగా వచ్చిన అతడు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. పైగా జయభేరీ ఆర్ట్స్ బ్యానర్‌పై సీనియర్ హీరో మాగంటి మురళీమోహన్ ఈ సినిమాను నిర్మించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పటికే మల్లీశ్వరి, మన్మధుడు, నువ్వు నాకు నచ్చావ్, నువ్వే కావాలి వంటి హిట్ సినిమాలకు కథలు అందించి మంచి ఫామ్ లో ఉన్నాడు.
అంతే కాకుండా దర్శకుడిగా మారి తరుణ్ వంటి లవర్ బాయ్ తో నువ్వే నువ్వే వంటి హిట్ సాధించారు. దీంతో సీనియర్ నటుడయినా మురళీ మోహన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు చాన్స్ ఇచ్చాడని చెబుతారు. మురళీ మోహన్ అంచనాలను తారు మారు చేయని త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమాను బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. కానీ ఈ సినిమా మాత్రం నిర్మాతకు లాభాలను తీసుకురాకపోవడం చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి.
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
This website uses cookies.