intinti gruhalakshmi 13 september 2022 full episode
Intinti Gruhalakshmi 13 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 736 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్ గారు మన ఇంటికి వచ్చారు కదా.. ఆయనతో తిరిగి కలిసిపోవచ్చు కదా అని కుటుంబ సభ్యులు తులసిని అడుగుతారు. ఆయన లోపలికి రాకుండా బయట కారులోనే కూర్చొని ఉంటే, మనం పట్టించుకోకుండా ఉంటే ఆయన్ను అనుమానించినట్టు అవుతుంది. కారణం ఏదైనా అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. నా ఆహ్వానాన్ని మన్నించి ఆయన లోపలికి వచ్చారు కానీ.. మా మధ్య ఉన్న గొడవను గుర్తు చేయలేదు అంటుంది తులసి. పండుగ సమయంలో ఇప్పుడు ఇలా గొడవ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు.. అంటుంది తులసి. ఇవన్నీ సామ్రాట్ దూరం నుంచి వింటాడు. ఆయన వల్లే మనం ప్రశాంతంగా ఉన్నాం అంటుంది తులసి. ఈ పండగ ఇలాగే సంతోషంగా జరగనిద్దాం. ఇప్పుడు కనుక సామ్రాట్ గారికి నేను నిజం చెప్పితే దాని తాలూకు ప్రభావం మీ నాన్న మీద పడొచ్చు.. గొడవ కావచ్చు.. ఏదైనా జరగొచ్చు అంటుంది తులసి.
intinti gruhalakshmi 13 september 2022 full episode
ఈరోజు సామ్రాట్ గారి లాగే మీ నాన్న గారు కూడా అతిథి. ఆయన గౌరవం కాపాడటం నా బాధ్యత అంటుంది తులసి. ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయండి అని చెప్పి వెళ్లిపోతుంది తులసి. తర్వాత సామ్రాట్ ను మొహమాటం లేకుండా తినాలని దివ్య అంటుంది. దీంతో సరే అంటాడు సామ్రాట్. మరోవైపు నందు, లాస్యకు మాత్రం సామ్రాట్, తులసి బిహేవియర్ అస్సలు నచ్చదు. అందరూ కలిసి పులిహోర తింటుంటారు. హనీ, లక్కీ ఇద్దరికీ తులసి పులిహోర తినిపిస్తూ ఉంటుంది. దీంతో ముందు లక్కీని పిలిచి నీ పక్కన కూర్చోబెట్టుకో అంటాడు నందు. దీంతో వాడి సంగతి నువ్వు మరిచిపో నందు అంటుంది. ముందు నన్ను సామ్రాట్, తులసి మీద ఫోకస్ చేయనివ్వు.. నన్ను డిస్టర్బ్ చేయకు అంటుంది లాస్య. తర్వాత పప్పు అన్నం చాలా బాగుంది అంటాడు లక్కీ. దీంతో ఈ పప్పన్నం మీ అంకుల్ కు నచ్చక వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు సద్దన్నానికి కూడా గతిలేక గిలగిల కొట్టుకుంటున్నాడు అని అంటుంది అనసూయ.
ఆ తర్వాత ఒరేయ్ ఇటు రారా అంటుంది లాస్య. దీంతో నేను రాను అంటాడు. ఆంటి చూడండి అంటాడు లక్కీ. దీంతో లాస్య ఊరుకో.. వద్దులే అక్కడే కూర్చోనివ్వు అంటుంది తులసి. మరోవైపు ఇంకొంచెం పాయసం పోయి అని అనసూయ.. దివ్యను అడుగుతుంది.
దివ్య పోస్తుండగా అంకిత చూస్తుంది. దీంతో నేను వద్దంటున్నా తనే పోస్తోంది అంటుంది అనసూయ. ఆ తర్వాత వినాయకచవితి విశిష్టత చెబుతుంది తులసి. వినాయకచవితి పండుగ రోజున 21 కుడుములు, 21 ఉండ్రాళ్లు నైవేద్యంగా పెట్టడం ఆనవాయితీగా వచ్చిందంటారు అంటుంది తులసి.
తినడం పూర్తయ్యాక ఈ ఇంటిని, ఈ కుటుంబాన్ని హనీ ఎందుకు ఇష్టపడుతోందో నాకు ఇప్పుడు అర్థం అయింది అని అంటాడు సామ్రాట్. మళ్లీ అభి మధ్యలో దూరుతాడు. ఏంటి మామ్ ఇదంతా… నటన పక్కన పెట్టండి. కాస్త నిజాయితీగా మాట్లాడుకోండి అంటాడు అభి.
ఆ తర్వాత అభిని అంకిత తీసుకెళ్తుంది. సాయంత్రం సరదాగా ఎంజాయ్ చేద్దాం. ఉండండి అని దివ్య.. సామ్రాట్ తో చెబుతుంది. సాయంత్రం కాగానే అందరూ ఆరుబయట కూర్చొంటారు. కొన్ని స్లిప్పుల్లో టాస్కులు రాసి తీసుకొస్తుంది దివ్య. ముందు అభి, అంకిత చిట్టీ తీస్తారు.
ఆ తర్వాత ప్రేమ్, శృతి టాస్క్ వస్తుంది. ఆ తర్వాత సామ్రాట్ వంతు వస్తుంది. ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు అంటాడు సామ్రాట్. విఘ్నేశ్వరుడి మహిమలను ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు అంటాడు. తన బిజినెస్ పార్టనర్ ను తన మాజీ భర్త బతిమిలాడుకున్నాడు. తనే మాజీ భర్త అని తన ఆఫీసులో తెలియకుండా ఆపాడు.
తన మాటకు కట్టుబడి ఉంది. నిందను భరించింది. బాస్ ఆగడాలను సహించింది. చెయ్యని తప్పుకు ఆ మాజీ భర్త ఆమె కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పినా తక్కువే అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Walking : ప్రతిరోజు నడక చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎవరైనా సరే వాకింగ్ చేసేటప్పుడు ముందుకి…
ce Bath : పైసనీటితో స్నానం చేయాలంటే ఒకప్పుడు క్రీడాకారుల వరకి మాత్రమే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు అంతటా…
Chaildhood Emotions : బాల్యంలో సంతోషంగా, అందంగా గడపాలి. కానీ,ఈ రోజుల్లో పిల్లలు, భావోద్వేగ వేధింపులు పిల్లల జీవితాలపై తీవ్ర…
Rajikanth : తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్గా ముద్రవేసిన రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బస్…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే కొన్ని వస్తువులు…
Telangana : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ Telangana సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, అమలుకు సంబంధించిన కీలక నిర్ణయాలు…
Soaking Rice : కొంతమంది అన్నం వండే విధానంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా…
Zodiac Sings : జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో గ్రహాలకు ఎంతో ఇస్తారు. అందులో శుక్రుడును రాక్షసులకు గురువుగా పరిగణిస్తారు. శుక్రుడు…
This website uses cookies.