Intinti Gruhalakshmi 15 Today Episode : 10 లక్షల విషయంలో మనోజ్ తో అభి గొడవ.. మనోజ్ ను కత్తితో పొడిచి పరార్.. దీంతో పోలీసులు తులసి ఇంటికి వచ్చి హల్ చల్.. దీంతో తులసి ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi 15 Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 556 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనోజ్ మోసం చేశాడని తెలుసుకొని తీవ్రంగా బాధపడతాడు అభి. అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. దీనంగా… ఏదో కోల్పోయిన వాడిలా మొహం పెట్టి రావడంతో.. అతడిని గమనించిన అంకిత.. ఏమైంది అని అడుగుతుంది. మనిషి ఇక్కడ ఉన్నావు కానీ.. మనసు ఎక్కడో ఉంది. మొహంలో ఏదో తెలియని కలవరం.. మొహం మీద ఆ చెమటలు ఏంటి అభి.. ఒంట్లో బాగోలేదా.. అని అడుగుతుంది. బాగానే ఉంది అంటాడు అభి. ఏం జరిగింది అభి అని ప్రశ్నిస్తుంది.

intinti gruhalakshmi 15 february 2022 full episode

మనీ కోసం ట్రై చేస్తున్నాను. దాని కోసమే టెన్షన్ అంటాడు అభి. సారీ అభి.. భోం చేద్దువు గానీ పదా. నీకోసమే వెయిట్ చేస్తున్నా అని అంటుంది అంకిత. నాకు ఆకలి లేదు అంటాడు అభి. నా బదులు కూడా నువ్వే తిను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో తన రూమ్ లోకి తులసి వస్తుంది. ఏం జరిగిందిరా అని అడుగుతుంది తులసి. చెప్పు నాన్న అంటుంది. నేను నీ శత్రువును కాదు అమ్మను. ఎందుకు నన్ను దూరం పెడుతున్నావు అని అడుగుతుంది తులసి. అలా చేసింది నువ్వు. నాకు ఇఫ్పుడు ఎవరితో మాట్లాడే మూడు లేదు. నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నారు అంటాడు అభి. నా బిడ్డ ఇలా ఉండటం నేను చూడలేను అంటుంది తులసి. దీంతో ఎవరు చూడమన్నారు. నాకు మాట్లాడాలని లేకపోతే మీరు ఎంత వెంటపడ్డా నేను మాట్లాడను. నేను ఎదైనా చెప్పాలి అనుకుంటే.. నీకు ఇష్టం లేకపోయినా వెంటపడి మరి చెబుతాను అని అరిచి మరీ చెబుతాడు అభి.

అరిచి చెప్పినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. ఈ అమ్మ ఉన్నది నీకు సహాయం చేయడానికే కానీ.. విసిగించడానికి కాదు. మరి నిన్ను నువ్వు చేసింది ఏంటి మామ్. అడుగడుగునా అవమానించలేదా. మామ్.. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నన్ను ఒంటరిగా వదిలేయ్ ప్లీజ్ అని తనకు చేతులెత్తి మొక్కుతాడు అభి.

దీంతో బయటికి వచ్చేస్తుంది తులసి. అప్పుడే నందు వస్తాడు. ఏమండి అంటుంది. అభి ఏదో టెన్షన్ లో కనబడుతున్నాడు. నేను ఎంత అడిగినా కారణం చెప్పడం లేదు. బాగానే ఉన్నానంటూ బుకాయిస్తున్నాడు.. అంటుంది. ఈ సోది అంతా నాకు ఎందుకు చెబుతున్నావు అంటాడు నందు. నా తలనొప్పులు నాకున్నాయి అంటాడు నందు.

ఈ ఒక్కసారికి నా మాట వినండి ప్లీజ్ అంటుంది తులసి. నీ మాట విన్నందుకే శశికళకు కట్టే డబ్బుల కోసం రోడ్డు పట్టుకొని పిచ్చోడిలా తిరుగుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు.

అంకిత.. అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏమైంది.. అభి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడని టెన్షన్ పడుతుంది. ఇంతలో తులసి వచ్చి.. ఏం చేస్తున్నాడు వాడు అంటుంది తులసి. వాడిలో వాడే బాధపడితే సమస్య ఏంటో మనకు ఎలా తెలుస్తుంది. మనకు చెప్పాలి కదా అంటుంది.

Intinti Gruhalakshmi 15 Today Episode : ఇంటికి వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ గొడవ చేసిన సేటు

ఇంతలో సేటు వచ్చి అభి బయటికి రా అంటాడు. దీంతో సేటు ఏంటి డైరెక్ట్ గా ఇంటికే వచ్చేశాడు అని అనుకుంటాడు. ఇంతలో నందు, వాళ్లంతా వస్తారు. నేను అభి తండ్రిని ఏమైంది చెప్పండి అని అడుగుతాడు. మీ వాడు నాదగ్గర 10 లక్షల అప్పు తీసుకున్నాడు అంటాడు.

దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో అభి వచ్చి.. సేటు మీరు ఇంటికి ఎందుకు వచ్చారు.. అంటాడు. నాకు తెలుసు అప్పు ఎలా వసూలు చేసుకోవాలో అంటాడు. నీ ఫ్రెండ్ డబ్బులు తీసుకొని పారిపోయిన విషయం నాకు తెలుసు. ముందు నా డబ్బు నాకు ఇచ్చేయ్ అంటాడు సేటు.

అసలు నువ్వు 10 లక్షలు నువ్వు ఎందుకు తీసుకున్నావురా. అప్పు ఎందుకు తీసుకున్నావు అంటూ తులసి ప్రశ్నిస్తుంది. చెంపదెబ్బ కొడుతుంది. మధ్యలో లాస్య రాబోతే తనపై సీరియస్ అవుతుంది తులసి. ఎదిగిన కొడుకు కదా.. గీత దాటి అరవడం ఎందుకు అనుకున్నాను.. అంటుంది తులసి.

ఇంతలో అంకిత వచ్చి ఆంటి మాటలు విను అంటే అస్సలు నువ్వు పట్టించుకోలేదు. నీకు చేతగాని పనుల్లో చేయి పెట్టడం ఎందుకు.. కాల్చుకోవడం ఎందుకు అంటుంది అంకిత. ఎందుకు ఇంత దిగజారి ప్రవర్తిస్తున్నావు. ఎందుకు నన్ను కూడా అందరి ముందు తలదించుకునేలా చేస్తున్నావు అంటుంది.

నా ఫ్రెండ్ ను ఎలాగైనా పట్టుకుంటా.. అంటాడు అభి. దీంతో నందు కూడా అభిని కొప్పడతాడు. ఆంటి.. ఇక నేను అభితో ఉండను ఆంటి. రేపు డబ్బు కోసం నువ్వు నన్ను తాకట్టు పెట్టమని నమ్మకం ఏంటి అని ఏడుస్తుంది అంకిత. నా ప్రేమకు అర్థం లేదు. మా మమ్మి చెబుతున్నా వినకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను.. జీవితంలో నీ మొహం నాకు చూపించకు. నన్ను మరిచిపో అని చెప్పి అంకిత అభిని వదిలేసి వెళ్లిపోబోతుంది.

ఇంతలో అంకిత.. అంటూ గట్టిగా అరుస్తాడు అభి. నిద్రలో నుంచి లేస్తాడు. ఇదంతా కల అని అనుకుంటాడు. ఇంతలో అంకిత నిద్ర లేస్తుంది. ఏమైంది అభి అంటుంది. ఏం లేదు అంకిత అంటాడు అభి. ఏమీ లేకపోవడం కాదు అభి. ఏదో ఉంది నువ్వే చెప్పడం లేదు అంటుంది అంకిత.

నీ మొహంలో ఏదో బాధ ఉంది. ఏదో కంగారు ఉంది. అసలు విషయం ఏంటో చెబితే నీకు సపోర్ట్ గా నిలబడతాం కదా అంటుంది. దీంతో సపోర్ట్ గా ఉండటం కాదు. నన్ను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోతావు అని అనుకుంటాడు అభి. శశికళకు ఇవ్వాల్సిన 20 లక్షల కోసమేనా నీ బాధ అంటుంది అంకిత.

అదే అయితే ఆంటితో మాట్లాడుదాంలే అంటుంది. ఇంతలో అభికి కోపం వస్తుంది. మరోవైపు తులసి ఇంటికి పోలీసులు వస్తారు. ఏమైంది సర్.. ఇటు వచ్చారు అని నందు అడుగుతాడు. దీంతో అభి ఎక్కడ అని అడుగుతారు పోలీసులు. ఏమైంది.. అభి ఏం చేశాడు అని అడుగుతాడు. దీంతో డబ్బుల కోసం తన ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు. రాగానే లొంగపోవాలని చెప్పండి.. లేకపోతే ఇంటిల్లిపాదిని అరెస్ట్ చేస్తాం అంటాడు పోలీస్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

War 2 vs Coolie | వార్ 2 vs కూలీ: హైప్ పెరుగుతున్న వార్ 2 …ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

War 2 vs Coolie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న చిత్రం వార్ 2. ఇది…

23 minutes ago

Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా..?

Court Heroine Sridevi : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…

1 hour ago

Good News : ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌… ఒక్కొక్క‌రికి ల‌క్ష‌..!

Good News : ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…

2 hours ago

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

3 hours ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

4 hours ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

5 hours ago

Turmeric Water Bath : ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కలపండి.. ఆ తరువాత జరిగే అద్భుతం తెలిస్తే షాకే…?

Turmeric Water Bath : స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేశారంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి…

6 hours ago

Uppal : ఫ‌లించిన ప‌ర‌మేశ‌న్న కృషి.. మంత్రి ఆదేశాల‌తో జీహెచ్ఎంసీ చేతికి ఉప్ప‌ల్‌ ర‌హ‌దారి ప‌నులు..!

Uppal  : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మందుముల ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి mandumula parameshwar reddy, కృషి ఫ‌లించింది. ఫ‌లితంగా…

7 hours ago