Business Idea : తన పాప కోసం చేసిన జామ్.. ఆమెకు వ్యాపారంగా మారింది. అమ్మమ్మ నేర్పిన వంట ఉపాధిగా మారింది ఆమెకు. ‘యమ్ యమ్మీ’ పేరుతో జామ్ అమ్మకాలు ప్రారంభించి విజయపథంలో సాగుతున్న హరియామా కురుక్షేత్రానికి చెందిన బ్యాంకర్ తల్లి ‘సౌమీ దే’ పై ప్రత్యేక కథనం.’మా అమ్మమ ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది. మా అమ్మమ్మ వాటితో టేస్టీ.. జామ్ తయారు చేసేది. వాటిని మేము లొట్టలేసుకుని తినేవాళ్లం. నా కూతురికి జామ్ అంటే చాలా ఇష్టం. బయట జామ్ లు తినగానే తన ఆరోగ్యం పాడయ్యేది. తనకి ప్రిజర్వేటీవ్ లు, కృత్రిమ రంగుల వల్ల అలర్జీ ఉందని మాకు అర్థమైంది. నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. వెంటనే ఇంటర్నెట్ లో చూసి కొన్ని జామ్ రెసిపీస్ నేర్చుకున్నా. ముందుగా స్ట్రాబెరీ జామ్ చేశాను. నా కూతురికి అది చాలా నచ్చింది. అలా నా జామ్ వ్యాపారం మొదలైంది’ -సౌమీ దేఇలా చేసిన జామ్ ను సౌమీ తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు రుచి చూపించింది..
అది వాళ్లకు చాలా నచ్చి.. వ్యాపారంగా చేయమని ఐడియా ఇచ్చారు. 2015 జనవరిలో, సౌమి ‘యమ్మియం’ అనే పేరుతో కంపెనీ పెట్టి.. జామ్ లు అమ్మడం ప్రారంభించింది.ప్రస్తుతం, ఆమె ఎనిమిది రకాల జామ్‌లను విక్రయిస్తోంది. ఆరు రకాల ఊరగాయలను కూడా పరిచయం చేసింది. ఇప్పటి వరకు, సౌమీ 10 వేలకు పై బాటిళ్లను విక్రయించారు. ‘జామ్‌ల తయారీలో శుభ్రపరచడం, ముక్కలు కోయడం లాంటి పనులు చాలా ఉంటాయి. మేము రాత్రిపూట చక్కెరలో పండ్లను నానబెడతాము. మరుసటి రోజు, 30 నుంచి 45 నిమిషాలు ఉడికించాలి. ఎటువంటి కృత్రిమ రుచులు, గుజ్జు లేదా రంగుల ఉపయోగించం.”అని సౌమీ వివరించారు. ‘నాకు వ్యాపారం చేయడంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండి లేదు.
ఇది మాకు ఒక పెద్ద సవాలు, ఇక్కడ మేము మొదట్నుంచీ ప్రతిదీ నేర్చుకోవాలి. నాణ్యత పారామితుల కోసం మా ఉత్పత్తులను పరీక్షించడానికి యంత్రాలను గుర్తించడం నుండి ప్యాకేజింగ్ వరకు, ప్రతిదీ మాకు సవాలు. యమ్మియం అన్ని ఉత్పత్తులను ఎఫ్ఐసీసీఐ ఆమోదించింది.జార్ లేబుల్‌లలో పేర్కొన్న షెల్ఫ్ లైఫ్ కు పరీక్షించబడ్డాయి.’ – సౌమీ’మీరు మంచి పని చేస్తున్నారన్న అనుభూతి మీకు ఉన్నంత కాలం మీరు విజయం సాధిస్తారు. బయటకు వెళ్లి, వ్యక్తులను కలవండి, వారికి ఏమి కావాలి, మీ సర్వీస్ ఎలా మెరుగుపరచు కోవచ్చు. అని వారిని అడగండి. వ్యాపారం చేయడం అనేది సవాళ్లతో కూడిన పని.. కానీ చివరికి, ఇది విలువైనదే’- సౌమీ ఇచ్చే సలహా
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.