Home » Entertainment » Anchor Sreemukhi In Love Says In Valentines Day Special
Entertainment

Sreemukhi : కన్ఫర్మ్.. ప్రేమలో బుల్లితెర శ్రీముఖి, ఇదే సాక్ష్యం..!

Authored By
aruna
The Telugu News | Published on: February 15, 2022, 10:00 am
Advertisement

Sreemukhi : బుల్లితెర రాములమ్మ గా మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అవును అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ప్రేమ లో ఉంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా ఆమె సోషల్‌ మీడియా పోస్ట్‌ చెప్పకనే చెబుతోంది. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తో నిజంగానే ఆమె ప్రేమలో ఉన్నట్లు గా క్లారిటీ వచ్చేసింది. అయితే ఎవరితో ప్రేమలో ఉంది ఎప్పుడూ ఆ విషయాన్ని బయటకు చెప్పబోతోంది పెళ్లి ఎప్పుడు అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నట్లు గా పేర్కొంది.

Advertisement

వాలెంటైన్స్ డే సందర్భంగా శ్రీముఖి షేర్‌ చేసిన ఫోటో లో ఒక పూల బొకే ను పట్టుకుని ఉంది.. అది కూడా రెడ్ రోజ్ బొకే. ఫోటోతో పాటు ఫిబ్రవరి 14, 2002 ఇది గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుందాం.. ఇప్పటి వరకు నా జీవితంలో ఇదే బెస్ట్ వాలెంటైన్స్ డే అంటూ లవ్ సింబల్స్.. నా ప్రేమ ఈమోజీ లను షేర్ చేసింది. దాంతో ఈ అమ్మడు అతి త్వరలోనే ఏదో ముఖ్యమైన విషయమే షేర్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ ప్రతి ఒక్కరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మొహం కూడా ఆనందంతో వెలిగిపోతుంది. ఏదో సక్సెస్ సాధించిన వ్యక్తి తరహాలో ఆనందం గా ఫేస్ కనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కచ్చితంగా శ్రీముఖి పెళ్లి వార్త లేదా ప్రేమ వార్త ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

anchor Sreemukhi in love says in Valentines day special

Advertisement

2022 సంవత్సరంలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అన్నట్లుగా ఒక షోలో శ్రీముఖి చెప్పింది. కనుక ఖచ్చితంగా శ్రీముఖి అతి త్వరలోనే వాలెంటైన్స్ డే కు సంబంధించిన విషయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంత నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంటూ మరి ఆమె చెప్పడంతో ఏదో ముఖ్యమైన విషయమే ఆమె చెప్పబోతున్న అనే విషయం క్లారిటీ వచ్చింది. అది ప్రేమ విషయం అయ్యి ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సన్నిహితులు కూడా శ్రీముఖి ప్రేమ లో ఉన్నట్లుగా అనధికారికంగా ధృవీకరిస్తున్నారు. కనుక వచ్చే వాలంటైన్స్ డే కి ఆమె జంటగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమలో పడ్డ బుల్లి తెర రాములమ్మకు అభిమానుల తరపున మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి