
intinti gruhalakshmi 16 february 2022 full episode
Intinti Gruhalakshmi 16 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 ఫిబ్రవరి 2022, బుధవారం ఎపిసోడ్ 557 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నీ మాటలు వింటుంటే సగం చచ్చిపోయినట్టు అనిపిస్తోంది అని అంకితతో అభి అంటాడు. దీంతో అభి అలా మాట్లాడకు అంటుంది అంకిత. మంచైనా చెడైనా.. కష్టమైనా.. సుఖమైనా నా తలనొప్పి నన్నే పడనీయండి. ఎవరి జాలి.. ఎవరి సానుభూతి నాకు అవసరం లేదు. నన్ను ఒంటరిగా వదిలేస్తే చాలు. మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు అభి. నా మెడ మా కత్తి వేలాడుతోంది. జాగ్రత్తగా డీల్ చేయకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది. జీవితాన్నే నష్టపోయేలా ఉన్నాను. ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు అభి.
intinti gruhalakshmi 16 february 2022 full episode
మరోవైపు అభి ఏదో ప్రాబ్లమ్ లో ఇరుక్కున్నాడు. ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటుంది తులసి. వాడు నా మాట వినేలా చేసుకోకపోవడం వాడి మొండితనమా. ఇప్పటికే కష్టాల్లో ఇరుక్కున్నాం. కొత్త కష్టాలు ఇవ్వకు తండ్రి అని అనుకుంటుంది తులసి. ఇంతలో దివ్య వస్తుంది. ఏడుస్తుంది. దీంతో ఏమైందమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది తులసి. దీంతో మామ్.. రేపో మాపో మనం రోడ్డు మీద పడబోతున్నామట కదా. ఈ ఇల్లు లాగేసుకుంటారట కదా అని ఏడుస్తూ చెబుతుంది దివ్య. ఎవరు చెప్పారమ్మా అని అడుగుతుంది తులసి. లాస్య ఆంటి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతుంటే విన్నాను అంటుంది దివ్య. లాస్య ఆంటి గురించి తెలిసిందే కదా అమ్మ. తనను పట్టించుకోవద్దు అంటుంది తులసి.
కానీ.. నీకు ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు కదా అమ్మ. నేను చూస్తున్నాను కదా అంటుంది దివ్య. ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా అమ్మ. ఒప్పుకోవడానికి మనసు రావడం లేదు అంతే కదా. డాడీ కోసం నువ్వు ఎంత చేశావు. అయినా ఆయనకు నీ మీద ప్రేమ లేదు. ఫ్యామిలీ పట్ల బాధ్యత లేదు అంటుంది దివ్య.
తప్పు అమ్మ అలా అనకూడదు. ఇదివరకు మీ బాధ్యతలు, ఇంటి బాధ్యతలు చూసుకున్నది ఆయనే కదా అంటుంది తులసి. చేతుల్లో డబ్బులు లేవు. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నారు.. అంటుంది తులసి. నాకు నచ్చజెప్పుతున్నావో.. నీకు నువ్వు నచ్చజెప్పుకుంటున్నావో అర్థం కావడం లేదు అంటుంది దివ్య.
మరోవైపు అభి రోడ్డ మీద వెళ్తుంటాడు. ఇదే ఆలోచించుకుంటూ బైక్ మీద వెళ్తుంటాడు. ఏం చేయాలో అర్థం కాదు తనకు. ఇంతలో ఓ జ్యూస్ షాపు వద్ద మనోజ్ కనిపిస్తాడు అభికి. దీంతో వెంటనే మనోజ్ అంటూ తన దగ్గరికి వెళ్లబోతాడు. ఇంతలో బైక్ స్టార్ట్ కాదు. తనను పట్టుకోవడానికి పరిగెడతాడు. మనోజ్ దొరకకుండా పరిగెడతాడు.
మనోజ్ ను పట్టుకోవడానికి తెగ ప్రయత్నిస్తుంటాడు. చివరకు దొరికించుకొని మనోజ్ పై దాడి చేస్తాడు. వదులురా అంటాడు మనోజ్. ఏంట్రా వదిలేది. ఊపిరి ఆడటం లేదు కదా. ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది కదా. నువ్వు మోసం చేసినప్పుడు కూడా అలాగే అనిపించిందిరా.. అసలు నువ్వు నా ఫ్రెండ్ వేనా ఛీ.. అంటూ ముందుకు నెట్టేస్తాడు అభి.
దీంతో అక్కడే ఉన్న పగిలిన బీరు సీసా మనోజ్ కు గుచ్చుకొని మనోజ్ ప్రాణాలు విడుస్తాడు. దీంతో ఏం చేయాలో అభికి అర్థం కాదు. దీంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అతడు పారిపోవడం అక్కడ ఉన్న ఓ మహిళ చూస్తుంది. మరోవైపు అంకిత అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది.
ఇంతలో తులసి వచ్చి ఏమైంది అమ్మా అని అడుగుతుంది అంకితను. ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది ఆంటి అంటుంది అంకిత. అభి ప్రవర్తన ఏం అర్థం కావడం లేదు. పొద్దున వెళ్లాడు.. ఇప్పటి వరకు రాలేదు అంటుంది అంకిత. నిన్నటి నుంచి మనిషి మనిషిగా లేడు. నేను అడిగినా కూడా ఏం చెప్పడం లేదు అంటుంది తులసి.
ఇంతలో నందు వెళ్తుంటే.. పిలిచి అభి ఇంకా రాలేదు అని చెబుతుంది తులసి. వాడు ఏనాడు తొందరగా ఇంటికి వచ్చాడని అంటాడు. వాడేం చిన్నపిల్లాడు కాదు తప్పిపోవడానికి. వాడికి ఏదైనా అయితే.. మనకే ముందు ఇన్ఫామ్ చేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నందు.
మరోవైపు అభి భయంతో అక్కడి నుంచి పరిగెడుతుంటాడు. ఓ టీ కొట్టు దగ్గర మంచినీళ్లు తాగి ఒక చాయ్ చెబుతాడు. ఇంతలో అక్కడ ఉన్నవాళ్లు ఫ్రెండ్ నే మర్డర్ చేసి పారిపోయాడట అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో అభి భయపడిపోతాడు.
మరోవైపు అభి ఇంకా రాలేదు అని టెన్షన్ పడుతుంటారు అంకిత, తులసి. అభి ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను. ఎవ్వరూ తమ దగ్గరికి రాలేదని చెప్పారు అని అంటుంది. పోలీస్ కంప్లయింట్ ఇద్దామా అని అంటుంది తులసి. అభి ఏమైనా చిన్నపిల్లాడా.. పోలీస్ కంప్లయింట్ ఇవ్వడానికి అంటుంది లాస్య. దీంతో లాస్యపైన చిరాకు పడుతుంది తులసి.
ఇంతలో పోలీసులు వస్తారు. ఇక్కడ అభి అంటే ఎవరు అని అడుగుతారు. ఇక్కడే ఉంటాడా అని అడుగుతారు. అభి నా పెద్ద కొడుకు.. ఎందుకు అని అడుగుతుంది తులసి. వాడు ఎక్కడున్నాడో ముందు తీసుకురండి అని అడుగుతారు. మా అభి ఏం చేశాడు అని అడుగుతాడు నందు.
దీంతో డబ్బుల కోసం గొడవ పడి తన ఫ్రెండ్ ను పొడిచి పారిపోయాడు అని చెబుతారు పోలీసులు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
Vijay Devarakonda -Naveen Polishetty : మొన్నటి వరకు టాలీవుడ్ సేఫెస్ట్ హీరో ఎవరంటే చాలామంది విజయ్ దేవరకొండ అని…
Central Government: మన దేశంలోని చిన్న వ్యాపారులకు (MSMEs) ఇది నిజంగా పండగలాంటి వార్త. భారత్–UAE మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం…
Nara Lokesh : దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
Post Office Recurring Deposit (RD) Scheme : షేర్ మార్కెట్ ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్న తరుణంలో,…
Husband and Wife : దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్లో నిర్వహించిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
ఒకప్పుడు బంగారం అంటే టక్కున కొనేవారు..కానీ ఇప్పుడు బంగారం పేరు చెపితేనే వామ్మో అంటున్నారు. గత ఐదేళ్లుగా బంగారం ధరలు…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 జనవరి 20 ఎపిసోడ్లో కథ ఒక్కసారిగా ఉత్కంఠకు చేరింది.…
This website uses cookies.