Intinti Gruhalakshmi 16 July Today Episode : తులసి, పరందామయ్య, అనసూయను కోర్టుకు తీసుకెళ్తారా? నందునే ఆ యాక్సిడెంట్ చేశాడని సామ్రాట్ కు తెలుస్తుందా?

Intinti Gruhalakshmi 16 July Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 జులై 2022, శనివారం ఎపిసోడ్ 686 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్క పూట నువ్వు కనబడకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డా. నువ్వు నా ప్రాణం. నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్లను మాత్రం నేను వదిలిపెట్టను అని పడుకున్న హనీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతాడు సామ్రాట్. కానీ.. హనీ పడుకోదు. పడుకున్నట్టు నటిస్తుంది. ఇంతలో సామ్రాట్ అంకుల్.. అతడితో మాట్లాడుతాడు. తులసి మీద నువ్వు అంతలా హార్ష్ గా బిహేవ్ చేయకు అంటాడు అంకుల్. ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తు పెట్టుకొని లోకాన్ని అదే తీరుతో చూడకు అంటాడు అంకుల్. దీంతో తులసి మీద జాలి పడాల్సిన అవసరం లేదు. నా హనీని ఎత్తుకుపోయింది. తన అంతు చూసేదాకా వదలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు సామ్రాట్. దీంతో సామ్రాట్ మాటలను వింటుంది హనీ. సామ్రాట్ అంకుల్ దగ్గరికి వెళ్లి అసలు నిజం చెబుతుంది హనీ.

intinti gruhalakshmi 16 july 2022 full episode

తనకు ఏం జరిగిందో మొత్తం చెప్పేస్తుంది హనీ. దీంతో సామ్రాట్ అంకుల్ షాక్ అవుతాడు. నువ్వు చేసింది చిన్న తప్పు కాదు.. చాలా పెద్ద తప్పు. సాయం చేసిన ఒక ఫ్యామిలీని చాలా ఇబ్బందులకు గురి చేశావు అని అంటాడు. తులసి ఆంటీకి ఏం కాకుండా చూసుకో తాతయ్య అంటుంది హనీ. దీంతో సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి పడుకో అంటాడు సామ్రాట్ అంకుల్. మరోవైపు బెయిల్ విషయం ఏమైంది అని ప్రేమ్ ను అడుగుతుంది తులసి. దీంతో సామ్రాట్ అంటే మామూలు వ్యక్తి కాదు. చాలా పెద్ద వ్యక్తి. కేసు టేకప్ చేయడానికి కూడా ఎవ్వరూ రావడం లేదు అంటాడు ప్రేమ్. ఇంతలో సామ్రాట్ అంకుల్ ఫోన్ ఎస్ఐకి ఫోన్ చేసి.. తులసి వాళ్లను వెంటనే వదిలేయ్ అంటాడు. దీంతో ఎస్ఐ షాక్ అవుతాడు. అదేంటి అంటాడు. నేను సామ్రాట్ తో మాట్లాడుతాను. వాళ్లను వదిలేయ్ అంటాడు సామ్రాట్ బాబాయి.

తులసికి ఫోన్ ఇస్తాడు ఎస్ఐ. హనీ నాకు అన్నీ చెప్పింది. మా తప్పును మేము సరిదిద్దుకుంటున్నాం అంటాడు. మా హనీని యాక్సిడెంట్ చేసి పారిపోయిన వాళ్ల గురించి తెలిస్తే మాకు కబురు పంపండి అని చెబుతాడు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

కట్ చేస్తే లాస్య ఇంటికి వస్తుంది తులసి. లాస్య.. తులసిని చూసి షాక్ అవుతుంది. ఎవరు లాస్య అని అడుగుతాడు నందు. తులసిని చూసి షాక్ అవుతాడు. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది లాస్య. దీంతో అయిన దానికి.. కాని దానికి మా ఇంటికి వచ్చి మిమ్మల్ని నిలదీయడం మీ ఆయనకు అలవాటే కదా. ఇప్పుడు నేను మీ ఆయన్ను నిలదీయడానికి వచ్చాను అంటుంది.

Intinti Gruhalakshmi 16 July Today Episode : నందుకు వార్నింగ్ ఇచ్చిన తులసి

యాక్సిడెంట్ చేయడం తప్పు కాదా అంటుంది తులసి. యాక్సిడెంట్ లేదు ఏం లేదు అంటుంది లాస్య. దీంతో ఏం చేస్తావు పోలీసులను పిలుస్తావా? అని అంటుంది తులసి. మేము తప్పు చేశామంటూ మిమ్మల్ని జైలులో పెట్టారు. మీ అమ్మానాన్నలను కూడా జైలులో పెట్టారు అంటుంది తులసి.

అయినా తప్పు నీది. నువ్వు ఎందుకు ఆ పాపను హాస్పిటల్ కు తీసుకెళ్లావు అని అడుగుతుంది లాస్య. దీంతో ఆ పాప స్థానంలో నీ కొడుకు లక్కీ ఉంటే అలాగే ప్రశ్నించేదానివా? నువ్వు అలాగే వెళ్లిపోయేదానివా అని అడుగుతుంది తులసి. పాప క్షేమంగా ఉంది కాబట్టి మిమ్మల్ని వదిలేశాను.. అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

ఇదంతా నీవల్లే అంటాడు నందు. నీ వల్లే తులసి నన్ను ఇలా తిట్టింది అంటాడు నందు. అవన్నీ వదిలేయ్. రేపు సామ్రాట్ గారికి సమర్పించే ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టు అని లాస్య చెబుతుంది. తర్వాత తులసి వాళ్లు అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లగానే ప్రేమ్.. తులసికి చెక్ ఇస్తాడు. మ్యూజిక్ స్కూల్ వెంటనే ప్రారంభించు అంటాడు.

కానీ.. తులసి మాత్రం ఆ చెక్ తీసుకోదు. నా స్కూల్ సంగతి తర్వాత. ముందు నువ్వు ఈ డబ్బుతో ఆల్బమ్ చేయి అంటుంది. కట్ చేస్తే లాస్య, నందు ఇద్దరూ సామ్రాట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే సామ్రాట్ కు ఎస్ఐ ఫోన్ చేస్తాడు. తులసి ఏమైనా చెప్పిందా అంటాడు.

దీంతో నందు షాక్ అవుతాడు. అంటే నేను యాక్సిడెంట్ చేసింది సామ్రాట్ కూతురునా అని అనుకుంటాడు. భయపడతాడు. యాక్సిడెంట్ చేసిన వాళ్లను అస్సలు వదలకు అంటాడు. తులసిని మీ బాబాయి రిలీజ్ చేయమన్నాడు అంటాడు. దీంతో షాక్ అవుతాడు సామ్రాట్. సరే మర్చిపోయా అంటాడు.

నందు ప్రపోజల్ ఓకే అంటాడు కానీ.. కొన్ని రోజులు నా దగ్గర ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేయండి అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Coolie vs War 2 | రజనీకాంత్ ‘కూలీ’ vs ఎన్టీఆర్-హృతిక్ ‘వార్ 2.. బెంగళూరులో వార్ 2 షోలు క్యాన్సిల్!

Coolie vs War 2 | భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు భారీ సినిమాలు రజనీకాంత్‌…

13 minutes ago

Rashmika mandanna | పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్నాపై ట్రోలింగ్‌.. ఎమోష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్

Rashmika mandanna | వరుస విజయాలతో టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ సినిమాల్లో దూసుకుపోతున్న రష్మిక మందన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా…

1 hour ago

War 2 vs Coolie | వార్ 2 vs కూలీ: హైప్ పెరుగుతున్న వార్ 2 …ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్!

War 2 vs Coolie | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెడుతున్న చిత్రం వార్ 2. ఇది…

2 hours ago

Court Heroine Sridevi : మెడలో తాళి బొట్టుతో కోర్టు హీరోయిన్.. సీక్రెట్ పెళ్లి చేసుకుందా..?

Court Heroine Sridevi : ఇన్‌స్టాగ్రామ్‌లో తరచూ యాక్టివ్‌గా ఉండే శ్రీదేవి, ఇటీవల రక్షా బంధన్ సందర్భంగా ఓ వీడియోని…

3 hours ago

Good News : ఏపీ ప్ర‌జ‌ల‌కు గుడ్‌న్యూస్‌… ఒక్కొక్క‌రికి ల‌క్ష‌..!

Good News : ఆంధ్రప్రదేశ్‌లో హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు శుభవార్త. హజ్ యాత్ర 2026 కోసం దరఖాస్తు చేసుకున్న…

4 hours ago

Kavitha : కవిత కు కొత్త చిక్కులు..!

Kavitha : తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి…

5 hours ago

Rajagopal Reddy : ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పుడు , నల్గొండకు ముగ్గురు ఉండకూడదా..? – రాజగోపాల్

Rajagopal Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కని సీనియర్ నాయకులలో కోమటిరెడ్డి…

6 hours ago

Pulivendula Zptc : పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పుణ్యం ఉంటుంది.. ఓటు వెయ్యనివ్వండి!

Pulivendula Zptc : పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు భారీ ఉద్రిక్తతల మధ్య కొనసాగుతున్నాయి. ఉదయం…

7 hours ago