Home » Entertainment » Intinti Gruhalakshmi 17 September 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 17 Sep Today Episode : సామ్రాట్ కారు బ్రేకులు తీసేసిన నందు.. యాక్సిడెంట్ అవడంతో సామ్రాట్, హనీకి తీవ్రగాయాలు.. నందును పోలీసులు అరెస్ట్ చేస్తారా?

Authored By
Varun G
The Telugu News | Updated on: September 17, 2022, 9:03 am
Advertisement

Intinti Gruhalakshmi 17 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 740 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి గారిని నువ్వు మిస్ చేసుకున్నావు. విలువైన వస్తువులను చేజారిపోకుండా కాపాడుకోకపోతే అది వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. నువ్వు నష్టపోయావు. నీ వల్ల ఇంకొకరు లాభపడతారు అంటాడు సామ్రాట్. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు అంటాడు నందు. దీంతో అవును నీకు నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను.. అంటాడు సామ్రాట్. ఇంతలో తులసి, లాస్య వస్తారు. ఇక మనం బయలుదేరుదామా అని తులసిని అడుగుతాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది. రేపు నేను మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా. మనం ఓ ఫైల్ వెరిఫికేషన్ కోసం వెళ్లాలి అని చెబుతాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి. మేము కూడా రావాలా సార్ అని అడుగుతుంది లాస్య. దీంతో మీరు ఆఫీసుకు వెళ్లి వర్క్ చేసుకోండి అంటాడు సామ్రాట్.

Advertisement

intinti gruhalakshmi 17 september 2022 full episode

కట్ చేస్తే నందు ఫుల్లుగా మందు తాగి కారు నడుపుకుంటూ వస్తాడు. కారు ఒకచోట ఆపి మద్యం తాగుతాడు. సామ్రాట్ తనతో మాట్లాడిన మాటలే తనకు గుర్తుకువస్తాయి. వాడి బతుకేంటి.. నా జీవితం మీద కామెంట్ చేస్తాడా? బాస్ అయిపోయాడు. లేకపోతే అక్కడే వాడి కాళ్లు చేతులు విరిచేవాడిని. ఆవిడ గారు సాధ్వి మరి. ఆవిడను దూరం చేసుకున్న దురదృష్ణవంతుడిని. సిగ్గుండాలి అలా మాట్లాడటానికి.. అని అనుకుంటాడు నందు. నేను హ్యాపీగానే ఉన్నా. బాధపడాల్సింది నేను కాదు. తులసి అని అంటాడు. ఆ రోజు వైజాగ్ లో మందు తాగినప్పుడు తులసి గురించి ఏదో కూశాడు. ఏదో అన్నాడు కానీ.. అస్సలు గుర్తుకు రావడం లేదు అని అనుకుంటాడు నందు. ఇంతలో తన దగ్గరికి సామ్రాట్, తులసి ఇద్దరూ వచ్చినట్టుగా కలగంటాడు నందు. నాగురించి ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? ఆరోజు తులసి గురించి నేను ఏం మాట్లాడానో గుర్తుకురావడం లేదా?

Advertisement

నీ కళ్ల ముందే తులసికి నా మనసులో మాట చెబుతాను. విని తట్టుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ముందు బీరు తాగు అంటాడు సామ్రాట్. తులసి గారు మీరంటే ఏంటో తెలుసుకున్న మరుక్షణం.. మీరంటే అభిమానం పెంచుకున్నాను. మీవాళ్ల మీద మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతను చూసి వాళ్లలో నేను కూడా ఒకడిని అవ్వాలని అనుకుంటున్నా. మనిషిగా మీ స్థాయి అందుకోవడానికి నా స్థాయి సరిపోదు. అందుకే మీ నీడలో మనిషిగా అవ్వాలనుకుంటున్నా.

మీ జీవితంలో సగ భాగం అవ్వాలనుకుంటున్నా. మీకు ఇష్టమేనా అని అడుగుతాడు సామ్రాట్. దీంతో ఓకే అంటుంది తులసి. దీంతో చాలా.. నీ డౌట్ క్లారిఫై అయిందా అంటాడు సామ్రాట్. ఇక మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అంటాడు. దీంతో కోపంతో తన చేతుల్లో ఉన్న బీరు బాటిల్ ను సామ్రాట్ మీద విసిరి కొడతాడు. ఇంతలో వాళ్లు మాయం అయిపోతారు. అదంతా నందు కన్న కల.

Advertisement

Intinti Gruhalakshmi 17 Sep Today Episode : కారు ఆగిపోవడంతో మెకానిక్ సురేశ్ కు ఫోన్ చేసిన నందు

కోపంతో వస్తున్నానురా అని కారులో కొంతదూరం వెళ్లగానే కారు ఆగిపోతుంది. దీంతో కారుకు ఏమైంది అని వెంటనే మెకానిక్ కు కాల్ చేస్తాడు. ఒరేయ్ సురేశ్.. నా బండి ఇక్కడ ఆగిపోయింది. నువ్వు వెంటనే వచ్చేయ్ అంటాడు నందు. దీంతో సురేశ్ వెంటనే బైక్ మీద వస్తాడు. కారును చెక్ చేస్తాడు.

కారు బాగు అవుతుంది. తాగి ఉన్నారు కదా.. కారు ఎలా నడుపుతారు. యాక్సిడెంట్ అయితే కాళ్లు చేతులు విరుగుతాయి.. అంటాడు. ఇంతలో సామ్రాట్ కు ఓ ఆలోచన వస్తుంది. వెంటనే సురేశ్ ను పిలిచి నువ్వు ఒక పని చేయాలి… సామ్రాట్ గారి కారుకు బ్రేకులు తీసేయాలి అంటాడు. దీంతో వామ్మో.. సామ్రాట్ గారి కారా.. నేను చేయను బాబోయ్ అంటూ అక్కడి నుంచి పరిగెత్తుకు వెళ్తాడు సురేశ్.

దీంతో నువ్వు చేయకపోతే నేను చేయనా.. నేను ఆ పని పూర్తి చేస్తా అని సామ్రాట్ ఇంటికి వెళ్తాడు నందు. ఆయన కారు కింద వంగబడి… బ్రేకుల వైర్లను తీసేస్తాడు నందు. రేపు నువ్వు తులసితో వెళ్లేది షికారుకు కాదురా.. డైరెక్ట్ గా హాస్పిటల్ కు అని చెప్పి ఇంటికి వెళ్తాడు నందు.

కట్ చేస్తే తెల్లవారుతుంది. సామ్రాట్ రెడీ అయి కారు దగ్గరికి వెళ్తాడు. అప్పుడే తులసి కూడా ఆటోలో సామ్రాట్ ఇంటికి వస్తుంది. ఇంటికి వస్తా అని చెప్పా కదా.. మీరెందుకు వచ్చారు అని అంటాడు సామ్రాట్. దీంతో మనం వెళ్లేది ఇటువైపే కదా.. మళ్లీ మీరు నన్ను పికప్ చేసుకోవడానికి అటువైపు రావడం ఎందుకు అని అంటుంది. తర్వాత కారులో కూర్చొంటుంది తులసి.

Advertisement

తర్వాత ఇద్దరూ కారులో వెళ్తుంటారు. ఇంతలో బ్రేక్ వేయబోగా.. బ్రేక్ పడదు. దీంతో సామ్రాట్ టెన్షన్ పడతాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఏమైంది అని అడుగుతుంది తులసి. దీంతో బ్రేక్ పడటం లేదు అంటాడు. ఇంతలో వాళ్ల కారు వెళ్లి ఓ స్తంభానికి ఢీకొడుతుంది. వెంటనే తులసి అంటూ ఉదుటున లేస్తాడు నందు. ఇదంతా కల. వెంటనే లాస్య వచ్చి ఏమైంది అని అడుగుతుంది.

తులసి అంటూ అరిచావు ఏంటి అంటుంది లాస్య. లేదు.. నేను లాస్య అని పిలిచాను. తులసి అని పిలవలేదు అంటాడు నందు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. ఆ తర్వాత రాత్రి పూట తాను ఏం చేశాడో గుర్తొస్తుంది నందుకు. ఇప్పటికే సామ్రాట్, తులసి వెళ్లపోయి ఉంటారని అనుకుంటాడు.

కానీ.. సామ్రాట్.. హనీని స్కూల్ లో దింపేందుకు కారులో బయలుదేరుతాడు. కానీ.. బ్రేకులు పడకపోవడంతో కారు వెళ్లి చెట్టుకు ఢీకొంటుంది. దీంతో సామ్రాట్, హనీ ఇద్దరికీ తీవ్రగాయాలు అవుతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి