
intinti gruhalakshmi 18 november 2022 full episode
Intinti Gruhalakshmi 18 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 18 నవంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 793 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నింటికీ తెగించి నేను ఇక నా మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. అందుకే నా వాళ్ల మధ్య పుట్టిన రోజు జరుపుకోవాలని వచ్చాను అంటాడు పరందామయ్య. ఇంతలో నేను కూడా అందుకే వచ్చాను అని సామ్రాట్ బాబాయి చెబుతాడు. ఖాళీ చేతులతో వచ్చావు ఏంటి బాబాయి అంటాడు సామ్రాట్. దీంతో చేతులు ఖాళీగానే ఉన్నాయి కానీ.. మనసు మాత్రం నిండుగా ఉంది అంటాడు. ఆ తర్వాత పరందామయ్య కోసం చేస్తున్న పూజలో పరందామయ్యను కూర్చోబెడతారు. తర్వాత పూజను నిర్వహిస్తారు. మరోవైపు అనసూయకు చాలా కోపంగా ఉంటుంది. తులసిపై సీరియస్ అవుతుంది.
రాక్షసి నన్ను కన్నీళ్లు పెట్టిస్తోంది. మా మొగుడు పెళ్లాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది అని అంటుంది. నా ఊసురు ఖచ్చితంగా తగులుతుంది. ఇంతకు ఇంత అనుభవిస్తావు అని కోపంగా అనసూయ పిచ్చిపిచ్చిగా చేస్తుంది. దీంతో నానమ్మ వద్దు అని అభి ఆపుతాడు. ఏంటి అత్తయ్య ఇది అంటూ ఇంకా తులసి మీద అనసూయను రెచ్చగొడుతుంది. మీరు కోపం చూపించాల్సింది ఆ తులసి మీద. మనింట్లో నిప్పు పెట్టి తనింట్లో పండుగ చేసుకొంటోంది అంటుంది లాస్య. దీంతో లాస్య ఆంటి చెప్పింది నిజం అంటాడు అభి. నానమ్మ మామ్ కు మనం అర్జెంట్ గా అడ్డు పడకపోతే చాలా కష్టం అంటాడు అభి. మామయ్య ఎలాగూ తులసిని ఏం చేయరు. మీరు రంగంలోకి దిగితేనే తులసికి అడ్డుకట్ట పడుతుంది. మీరే ఆలోచించండి అత్తయ్య అంటుంది లాస్య.
దీంతో సామ్రాట్ అండ చూసుకొని తులసి రెచ్చిపోతోంది. నాకు తిక్క రేగితే ఆ సామ్రాట్ నే కాదు.. తనను పుట్టించిన దేవుడిని కూడా వదలను. పదరా అభి అని చెప్పి అభి, లాస్యను తీసుకొని అనసూయ వాళ్లింటికి బయలుదేరుతుంది. మరోవైపు పరందామయ్య పూజలో పాల్గొంటాడు. పూజ దివ్యంగా జరిగింది. మీరు స్వామి వారి కరుణ, కటాక్షాలతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తారు అంటాడు పూజారి. దీంతో ఆయురారోగ్యాల కన్నా నేను ప్రశాంతంగా జీవిస్తే చాలు అంటాడు పరందామయ్య. ఆ తర్వాత అందరూ తన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. పూజారి వెళ్లిపోతాడు. మీకు ఆయుస్సు పెరగాలి కానీ.. ఒకటి తగ్గాలి పొట్ట అంటాడు బాబాయి. తాతయ్య అలాంటివి పట్టించుకోరు. పాపం నానమ్మ మాత్రం ఏం చేస్తుంది. తాతయ్య పొట్ట గురించి పట్టించుకోవడం మానేసింది అంటుంది దివ్య.
intinti gruhalakshmi 18 november 2022 full episode
Intinti Gruhalakshmi 18 Nov Today Episode : అనసూయపై సీరియస్ అయిన పరందామయ్య
పూజ పూర్తయ్యాక అందరూ ఎంటర్ టైన్ మెంట్ కావాలంటారు. అందరూ కలిసి ఫ్యామిలీ పార్టీ అంటూ డ్యాన్స్ చేస్తుంటారు. సరదాగా అందరూ సంతోషంగా ఉండగా.. ఇంతలో అనసూయ.. అక్కడికి వస్తుంది. అనసూయను చూసి పరందామయ్య షాక్ అవుతాడు. అనసూయ.. ఈరోజు నా పుట్టిన రోజు. నేనే కావాలని ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకుండా వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు పరందామయ్య. కానీ.. అనసూయ మాత్రం వినదు. పోనీలే పోనీలే అంటూ ఇప్పటి వరకు నేను భరించాను అంటుంది అనసూయ. దీంతో నువ్వు భరించడం కాదు..
తులసి నిన్ను ఇప్పటి వరకు భరించింది అంటాడు పరందామయ్య. తులసి నీ కోడలుగా అడుగు పెట్టాకే నీ ఇల్లు ఇల్లుగా కనిపించడం మొదలైంది అంటాడు. దీంతో ఆవిడ గారు వచ్చి అందమైన బృందావనంలా మార్చింది. సిగ్గులేకపోతే సరి అంటూ పరందామయ్యపై విరుచుకుపడుతుంది అనసూయ. మీరు నన్ను ఎనాడు బాగా చూసుకున్నారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పిల్లలను పెంచి నేను కడుపు మాడ్చుకొని మీకు భోజనం పెట్టాను. పేదరికంలో పిల్లలను పెంచి పెద్ద చేశాను.. అంటూ తన బాధనంతా వెళ్లగక్కుతుంది అనసూయ. నాకు చేతినిండా ఏనాడైనా మీరు డబ్బులు ఇచ్చారా? కనీసం బంగారం కొనిచ్చారా? అంటూ ప్రశ్నిస్తుంది అనసూయ. మీకోసం నేను నా సంతోషాన్ని, జీవితాన్ని త్యాగం చేస్తే దానికి బదులుగా మీరు ఇచ్చింది ఏంటి.
నోర్మూయ్ అంటూ నన్ను బయటికి వెళ్లమంటారా అంటుంది అనసూయ. దీంతో దానికి బదులుగా నేను ఏం ఇచ్చానో తెలుసా? మౌనంగా ఉండటం. నువ్వు చెప్పినట్టు చేయడం అంటాడు పరందామయ్య. మీరంతా కలిసి నా కుటుంబాన్ని నాశనం చేస్తారా.. నేను ఈ ఇంటిని నాశనం చేస్తాను అంటుంది అనసూయ. అక్కడున్న వస్తువులు అన్నింటినీ పడేస్తుంది. ఈరోజు నుంచి ఈ తులసి మొహం చూడటానికి కానీ.. మాట్లాడటానికి కానీ వీలు లేదు రండి అంటుంది అనసూయ. దీంతో నేను ఎక్కడికి రాను.. అంటూ అక్కడే కూలబడిపోతాడు పరందామయ్య. మీ నాటకాలు ఆపండి అని అనసూయ అనగానే అత్తయ్య అంటూ సీరియస్ అవుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.