Intinti Gruhalakshmi 19 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జనవరి 2022, బుధవారం ఎపిసోడ్ 533 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నందు కేఫ్ లో పని చేస్తుంటాడు. కస్టమర్లకు అట్రాక్ట్ చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తాడు. బేరర్ ఓ కస్టమర్ తో గొడవ పెట్టేసుకోబోతే అడ్డుకుంటాడు. మొత్తానికి కేఫ్ ను భలేగా మేనేజ్ చేస్తాడు నందు. మరోవైపు అనసూయ కూరగాయలు తరుగుతూ ఉంటుంది. ఇంతలో లాస్య వస్తుంది. ఈ ముసలిది ఏంటి కూరగాయలు తరుగుతోంది. అంటే తులసి ఇంకా రాలేదన్నమాట. దీన్ని కాకా పట్టాలంటే ఇదే సరైన సమయం అనుకుంటుంది. తనదగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. అత్తయ్య ఏం చేస్తునన్నారు అంటూ తెగ ప్రేమ ఒలకబోస్తుంది. ఇదేంటి.. తెగ ప్రేమ ఒలకబోస్తుంది అని అనుకుంటుంది.
అత్తయ్య టీ తాగుతారా అంటుంది. అదా నీ ప్లాన్. నేను ఆరోజు నుంచి టీ పెట్టడం లేదు కదా అంటుంది అనసూయ. మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెడతాను అని చెప్పి వెళ్లి చాయ్ చేసుకొని తీసుకొని వస్తుంది. చాయ్ తాగాక.. అసలు విషయం చెబుతుంది లాస్య. సంక్రాంతి పండుగ వస్తుంది కదా.. ఆనవాయితీ ప్రకారం కోడలు నేనే పూజ చేయాలి కదా. ఆ పూజలు ఏంటో ఎలా చేయాలో నాతో చేయించండి అంటుంది లాస్య. నీకు తెలియకపోతే తులసి చేస్తుందిలే అంటుంది అనసూయ. తను ఎందుకు చేస్తుంది. ఈ ఇంటి కోడలును నేను కదా అంటుంది లాస్య. పండుగ పూట నా చేతుల మీదుగా పూజ జరగాలి అంటుంది లాస్య. సరే.. నేను తులసికి చెబుతానులే అంటుంది అనసూయ.
కట్ చేస్తే నందు.. కొత్త జాబ్ మొదటి రోజు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. తులసి కూడా ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంది. తనకు క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాదు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు టీ పెట్టు అంటూ అడుగుతాడు పరందామయ్య.
ఇంట్లో టీ పౌడర్ లేదు అంటుంది అనసూయ. టీ పౌడర్ లేకపోతే చూసుకోవద్దా అంటాడు. నాకేం తెలుసు. ఇంట్లో పనులన్నీ తులసే కదా చూసుకునేది అంటుంది అనసూయ. తులసి అది విని ఇంట్లోకి వస్తుంది. చూస్తే అంకిత, అభి ఇద్దరూ పోట్లాడుకుంటారు.
వాళ్లిద్దరూ విడిపోయి ఎవరిని బాగు చేశారు. ఎవరు బాగుపడ్డారు అంటాడు అభి. ఇద్దరూ గొడవ పెట్టుకోవడం చూసి తులసికి ఇంకా బాధేస్తుంది. నువ్వు ఎన్నైనా చెప్పు శృతి ఈ ఇల్లు దాటి ఈ ఊరు దాటి జాబ్ వెతుక్కునే పనే లేదు అంటూ శృతితో ప్రేమ్ అంటుండటం కూడా తులసి వింటుంది.
అందరూ ఆంటి మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ ఏంటో.. తను మాత్రం ఎన్నాళ్లని మోస్తుంది అని అంటుంది శృతి. మరోవైపు దివ్య.. పాటకు డ్యాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేస్తుండగా దివ్య దగ్గరికి వస్తుంది తులసి. పాటను ఆపేస్తుంది తులసి.
చదువుకోవడం అయిందా అంటుంది తులసి. నీ రూమ్ సర్దుకొమ్మని ఉదయమే చెప్పాను కదా నువ్వు సర్దుకున్నావా అంటుంది. నువ్వు సర్దుతావు కదా అంటుంది దివ్య. అన్ని నువ్వు చూసుకుంటావు కదా మామ్ అంటుంది దివ్య. ఇప్పుడు నేను ఉన్నాను.. తర్వాత నేను లేకపోతే అంటుంది తులసి.
ఏంటి మామ్ అంటుంది. అదే రేపు అత్తారింటికి వెళ్లినప్పుడు మీ అమ్మ ఏం పనులు నేర్పించలేదా అంటే ఏం చేయాలి అంటుంది తులసి. అవన్నీ తర్వాత చూసుకుందాంలే అని చెప్పి మళ్లీ మ్యూజిక్ వింటూ డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది దివ్య.
వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి తన గోడు మొత్తం వెళ్లబోసుకుంటుంది. నేను పోతే నా వాళ్లు ఏమైపోతారో అని తెగ బాధపడిపోతుంది. నా బాధ్యతలు ఇంకా తీరలేదు. నేను ఏం చేయాలి.. అని అనుకుంటుంది. ఈ తులసి బతికి ఉన్నా బతికి లేకున్నా వాళ్ల బతుకు వాళ్లు బతికేలా చేస్తాను అంటుంది తులసి.
మరోవైపు అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. అంకిత ఏదో ఆలోచిస్తోందని చూసి తులసి అక్కడికి వస్తుంది. ఏమైంది అంకిత అంటుంది. ఏం లేదు ఆంటి అంటుంది అంకిత. పర్లేదమ్మా నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు అంటుంది తులసి.
అభి మారిపోయాడు ఆంటి.. చేసింది చెప్పడం లేదు.. చెప్పింది చేయడం లేదు. ఊరికే ఊరికే కోపం తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్య అప్పులు చేస్తున్నాడు. అర్జెంట్ గా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలని నా నగలు కూడా తాకట్టు పెట్టుకున్నాడు అని చెబుతుంది అంకిత.
ఎందుకు ఇచ్చావమ్మా అని అడుగుతుంది తులసి. పీకల మీద కూర్చుంటే చెప్పలేకపోయా. రెండు రోజుల్లో తెచ్చి ఇస్తా అన్నాడు కానీ ఇప్పటి వరకు విడిపించలేదు అంటుంది. ఈ విషయం మీ అమ్మ గారికి తెలిస్తే ఊరుకోదు అంటుంది తులసి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.