Intinti Gruhalakshmi 19 Nov Today Episode : లాస్యను పెళ్లి చేసుకుంటానంటూ అందరి ముందు చెప్పిన నందు.. లాస్య, నందు పెళ్లి ఏర్పాట్లు ప్రారంభం.. తులసి పరిస్థితి ఏంటి?

Intinti Gruhalakshmi 19 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బెంగళూరు నుంచి నందు, తులసి ఇంటికి తిరిగి వస్తారు. రాగానే.. లాస్య ఆగదు. అసలు ఈ ఇంట్లో నా స్థానం ఏంటి ఇప్పుడే చెప్పు అంటూ నందును నిలదీస్తుంది. ఈ ఇంటికి, నాకు ఏంటి సంబంధం అని అందరూ కలిసి నన్ను నిలదీశారు.. అంటూ నందూను అడుగుతుంది. ఇప్పుడే కదా వచ్చింది. తర్వాత మాట్లాడుకుందాం లాస్య అంటాడు నందు. కానీ.. లాస్య వినదు.

intinti gruhalakshmi 19 november 2021 full episode

అందరి ముందు ఈ విషయాన్ని ఇప్పుడే తేల్చేయాల్సిందే అని అంటుంది లాస్య. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు లాస్య. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అంటాడు నందు. కానీ.. లాస్య వినదు. ఏంటి ఆలోచిస్తున్నావు. ఎందుకు మొహమాట పడుతున్నావు. నన్ను ప్రేమించా అన్నావు. నేను లేకుంటే జీవితమే లేదన్నావు. అందుకే కదా.. తులసికి విడాకులు ఇచ్చింది.. అని అడుగుతుంది లాస్య. కానీ.. నందు మాత్రం ఒక్క మాట మాట్లాడడు.

ఎందుకు నాన్నను ప్రెజర్ చేస్తున్నావు. ఎందుకు ఒత్తిడి చేస్తున్నావు. కాస్త ఆలోచించుకోవడానికి కూడా సమయం ఇవ్వవా? ఎందుకు ఇలా చేస్తున్నావు.. అంటూ ప్రేమ్.. లాస్యను కొప్పడతాడు. నువ్వు అంత ఆవేశపడితే ఏ పని కాదు.. అని లాస్యకు బుద్ధి పెడతాడు ప్రేమ్.

చూశావా.. అందరూ నన్ను నిలదీస్తున్నారు.. నేను బతకను. నన్ను నీ చేతులతో చంపేయ్ అని అంటుంది. దీంతో లాస్య ఇఫ్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు నందు. నన్ను వెంటనే పెళ్లి చేసుకో అంటుంది లాస్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

తులసి తనకు అవసరం లేదు అనుకొని వెళ్లిపోబోతుండగా ఆగమ్మా.. ఎక్కడికి వెళ్తున్నావు అంటుంది. ఇది నాకు సంబంధం లేని విషయం అంటుంది. నీకెందుకు సంబంధం అంటూ ఆపుతుంది అనసూయ. నీకు అవసరం లేదనుకుంటే ఇంకా వాడు కట్టిన తాళిని ఎందుకు ఉంచుకున్నావు అంటుంది అనసూయ.

Intinti Gruhalakshmi 19 Nov Today Episode : లాస్యను ఉతికి ఆరేసిన అనసూయ

ఇంతలో లాస్య అడ్డం రాబోగా.. నోర్మూయ్.. అంటూ లాస్యను తిడుతుంది. నా కోడలు గురించి ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఊరుకోను. నాలుక చీరేస్తా అంటుంది. ఇంతకు ముందు మీరు చూసిన అనసూయ వేరు.. ఇప్పుడు మీరు చూడబోయే అనసూయ వేరు.. అంటుంది. దీంతో అందరూ చప్పట్లు కొడతారు.

అమ్మా తులసి. నన్ను క్షమించమ్మా అంటుంది.. అనసూయ. దీంతో ఊరుకోండి అత్తయ్య అంటుంది. తులసిని కౌగిలించుకుంటుంది. అందరూ సంతోషపడతారు. అంటే అందరూ ఒక్కటయ్యారన్నమాట అంటుంది లాస్య. ఏయ్ ఆగు.. అమ్మా తులసి.. ఆడదాన్ని మౌనాన్ని చేతగానితనం అనుకుంటారమ్మా. నాకొడుకు నిన్ను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సిందే అంటుంది.. అనసూయ.

ఇప్పుడు అది జరగదు అత్తయ్య. మా దారులు ఎప్పుడో దూరం అయిపోయాయి. మేము ఎప్పటికీ కలవము అని తులసి చెప్పేసరికి.. విన్నావు కదా.. నందు. మీరు ఎప్పటికీ కలవరు అని తులసినే చెబుతోంది కదా.. ఇంకేం ఆలోచిస్తున్నావు.. నన్ను పెళ్లి చేసుకుంటా అని అందరి ముందు ఒప్పుకో అంటుంది లాస్య.

కానీ.. నందు మాత్రం ఒక్క మాట మాట్లాడడు. దీంతో అర్థం అయింది నందు.. అంటుంది. నా భర్తతో విడాకులు ఇప్పించి.. నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇప్పుడు మోసం చేస్తాడా? అంటుంది. నన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోవాల్సిందే.. అంటుంది లాస్య.

మనం పెళ్లి చేసుకుందాం లాస్య.. అంటాడు నందు. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. నిజమా అంటుంది. అవును లాస్య.. మనం పెళ్లి చేసుకుందాం. పంతులు గారిని పిలిపించు… ముహూర్తం పెట్టించు అంటుంది. దీంతో థ్యాంక్యూ నందు అంటుంది లాస్య.

అందరూ వినండి. లాస్య నాకాబోయే భార్య. ఈ ఇంటికి కాబోయే కోడలు. ఈరోజు నుంచి ఈ ఇంట్లో అందరూ నాకెంత విలువ ఇస్తారో లాస్యకు కూడా అంతే విలువ ఇవ్వాలి.. అంటాడు నందు. దీంతో తులసి ముందుకు వచ్చి చాలా సంతోషం అండి. ఆల్ ది బెస్ట్ లాస్య అంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

15 minutes ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

4 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

5 hours ago

Health : పురుషులకు ఆ విషయంలో… భారత్ లో 28 మందిని వేధిస్తున్న ఒకే ఒక సమస్య… కారణం ఇదేనట…?

Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…

6 hours ago

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…

7 hours ago

Healthy Street Food : ఇది రుచితో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది… అదేనండి…స్ట్రీట్ ఫుడ్ వీటి రూటే సపరేట్…?

Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…

8 hours ago

Lucky Bhaskar Sequel : ల‌క్కీ భాస్క‌ర్ సీక్వెల్ క‌న్‌ఫాం చేసిన ద‌ర్శ‌కుడు.. ఎలా ఉంటుందంటే..!

Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…

9 hours ago

Jaggery Tea : వర్షాకాలంలో ఈ టీ తాగారంటే… రోజు ఇదే కావాలంటారు… దీని లాభాలు మిరాకిలే…?

Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…

10 hours ago