Intinti Gruhalakshmi 19 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 794 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వద్దు అనసూయ.. ఇక్కడి నుంచి వెళ్లిపో అని బతిమిలాడుతాడు పరందామయ్య. కానీ.. అనసూయ వినదు. నువ్వు భర్తగా, అప్పుడు చేతకానివాడివి అంటుంది అనసూయ. నెలకు వచ్చిన 400 జీతంతో మీరు చేసిందేంటి. నేను నానా సంకలు నాకి ఆ జీతం డబ్బులతో కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. మీకు చేతకాని వాళ్లు ఎందుకు పెళ్లి చేసుకున్నారు అంటూ ప్రశ్నిస్తుంది. నీ గురించి తెలిసే.. నీ త్యాగం తెలిసే కదా.. నేను సైలెంట్ గా ఉంది. నన్ను చాలామంది హేళన చూసినా కూడా ఎందుకు పట్టించుకోలేదు. దానికి కారణం నీ త్యాగమే అంటాడు పరందామయ్య.
నువ్వు ఇక ఒక్క మాట కూడా మాట్లాడుకుండా దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపో అంటాడు పరందామయ్య. కానీ.. అనసూయ మాత్రం వినదు. పిచ్చెక్కిన దానిలా ప్రవర్తిస్తుంది. ఎంత చెప్పినా వినదు. నీ భర్తగా చెబుతున్నాను వెళ్లిపో అంటే వినదు అనసూయ. ఎందుకు అత్తయ్య ఇలా చేస్తున్నారు.. అని తులసి అన్నా కూడా అనసూయ వినదు. మీరు సంపాదించిన దానితోనే కుటుంబం బతికిందా. నా కొడుకు అప్పుడు ఉద్యోగం చేసి సంపాదించాడు కాబట్టే మన కుటుంబం మంచిగా బతికింది. కానీ.. మీరు ఏనాడూ నందును ఒక కొడుకుగా చూశారా అంటుంది అనసూయ.
మీరు చెప్పింది నిజమే అత్తయ్య. మీరు, మీ అబ్బాయి ఇద్దరూ కలిసి కుటుంబ బాధ్యత తీసుకున్నారు కానీ.. మామయ్య కూడా కష్టపడ్డారు అంటుంది తులసి. కానీ.. తులసి మాట వినదు అనసూయ.
ఎవ్వరు మాట్లాడినా వాళ్ల మీద విరుచుకుపడుతుంది అనసూయ. ప్రేమ్ ఏదో అంటే ప్రేమ్ ను కొడుతుంది. ఇల్లు మొత్తం చిందరవందర చేస్తుంది. ఇక నుంచి మీరు నా మాట మాత్రమే వినాలి. ఇంట్లో ఒక మూలన కూర్చోండి అంటుంది అనసూయ.
దీంతో నేను రాను.. నేను ఆ ఇంటికి రాను. నేను ఒంటరిగా మిగిలాను. నాకంటూ ఏం లేదు. ఫుట్ పాత్ మీద ఉంటాను. గుడి మెట్ల మీద అడుక్కుంటాను. చెప్పులు పాలిస్ చేసి తింటాందుకు సంపాదించుకుంటాను.
నీ దగ్గర ఉండటం కంటే అదే ఎక్కువ గౌరవం ఉంటుంది. నీ కొడుకు ఇంటికి వెళ్లు.. నేను రాను. నేను ఆ ఇంటికి అస్సలు రాను. ఈ లోకంలో డబ్బుకే ఎక్కువ విలువ ఉంది అంటూ ఆవేశపడతాడు.
దీంతో పరందామయ్యకు కళ్లు తిరుగుతాయి. కుర్చీలో కూర్చోబెడతారు. మీ నాటకం చాలు ఇక ఇంటికి వెళ్దాం పదా అంటుంది అనసూయ. దీంతో అత్తయ్య షు.. ఆపండి. మీకు మాత్రమే కోపం ఉందా. మీరు ఇంకో మాట మాట్లాడితే అస్సలు బాగుండదు.
చూసుకుందాం పదా.. ఇక చూసుకుందాం. నీ కంటే ఎక్కువగా నేను అరవగలను.. అని అనసూయకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నాకు మా మామయ్య.. తండ్రి కంటే ఎక్కువ అంటుంది.
మీలాంటి మామయ్య ఎవరికి ఉంటారో.. వాళ్లు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతులు అంటుంది తులసి. మీ కూతురు ఇంకా బతికే ఉంది మామయ్య అంటుంది తులసి. తండ్రికి అండగా నిలబడటానికి.. కూతురు కొడుకుగా ఉండాల్సిన అవసరం లేదు. కూతురు కూతురుగానే ఉండొచ్చు అంటుంది.
నా మామయ్యకు నేను ఉంటే చాలు అంటుంది తులసి. ఇప్పుడు నా ఇల్లు నా మామయ్యకు ఇస్తాను అంటుంది తులసి. దీంతో నాకు మీ ఇంట్లో చోటిస్తావా తల్లి. మా ఇంటికి పంపవు కదా అంటాడు.
దీంతో అస్సలు పంపను. ఆ ఇంటికి మిమ్మల్ని చూసుకునే అదృష్టం లేదు. ఇక నుంచి ఇది మీ ఇల్లు.. మన ఇల్లు. ఇది చిన్న ఇల్లు అంటుంది తులసి. ఇది చిన్న ఇల్లు అంటుంది తులసి. నీ ఇల్లు సరేనా అంటుంది తులసి.
నన్ను ఆయన వద్దనుకున్నప్పుడు.. నేను ఆయనకు ఏం కానప్పుడు తులసి దగ్గరనే ఉండనివ్వు. అందరూ కలిసి గంగలో దూకనీ.. నాకు సంబంధమే లేదు అంటుంది అనసూయ. వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లు అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.