
intinti gruhalakshmi 20 august 2022 full episode
Intinti Gruhalakshmi 20 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 ఆగస్టు 2022, శనివారం ఎపిసోడ్ 716 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులోకి అబ్బాయి లోపలికి వెళ్తే అమ్మాయిగా మారి బయటికి వస్తున్నారు అని అంటాడు సామ్రాట్. దీంతో ఏం కాదు మీరు రండి అంటుంది తులసి. దీంతో సామ్రాట్, నందు ఇద్దరినీ లిఫ్ట్ ఎక్కిస్తారు. ఆ తర్వాత లిఫ్ట్ దించుతారు. అన్నయ్య నేను మారలేదు అంటాడు సామ్రాట్. దీంతో నేనూ మారలేదు తమ్ముడు పదా స్టెప్పేద్దాం అంటాడు నందు. ఇద్దరూ నాటు నాటు అంటూ డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఇద్దరూ లిఫ్ట్ దగ్గరే కూర్చొంటారు. తులసి నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్లి కీ తీసుకొస్తా అంటుంది లాస్య. దీంతో నా కీ నా దగ్గరే ఉంది అంటుంది తులసి. అయితే నువ్వు వెళ్లి పెరుగు పట్టుకురా. అలా అయితేనే వీళ్ల మత్తు దిగుతుంది అంటుంది లాస్య. ఇద్దరూ వెళ్లిపోగానే.. ఏరా తులసి నచ్చిందా అని అడుగుతాడు సామ్రాట్ ను. దీంతో తప్పు అంటాడు సామ్రాట్. నచ్చిందా చెప్పరా.. నేను దగ్గరుండి మీ ఇద్దరి పెళ్లి చేస్తాను అంటాడు. దీంతో నిజమా.. అంటాడు సామ్రాట్. అవును అంటాడు. దీంతో నాకు తులసి అంటే చచ్చేంత ఇష్టం అంటాడు. దీంతో వద్దు తమ్ముడు. తులసిని మరిచిపో. దూరంగా ఉండు అంటాడు.
intinti gruhalakshmi 20 august 2022 full episode
ఎందుకు అన్నయ్య.. ఇప్పటి దాకా నాకు పెళ్లి చేస్తా అన్నావు. ఇప్పుడేమో దూరంగా ఉండమంటున్నావా అంటాడు సామ్రాట్. దీంతో అది కాదురా తమ్ముడు.. ఆ తులసి నా భార్య అంటాడు. పెళ్లయ్యాక తులసి మీద నాకు ప్రేమ పుట్టలేదు తమ్ముడు అంటాడు నందు. మరోవైపు పెరుగు తీసుకురావడానికి వెళ్తుంది తులసి. నేను నీ తమ్ముడినే కదా. నీకు నేనంటే ప్రాణం కదా అంటాడు సామ్రాట్. దీంతో అవును అంటాడు. అయితే నేను అడిగిన దాని గురించి చెప్పు అంటాడు. గాలిపటం ఎగురు వేస్తున్నాం. అది తెగిపోయింది. ఇప్పుడు అది ఎవరిది అవుతుంది అంటాడు. దీంతో ఎవరికి దొరికితే వారికే అంటాడు నందు. దీంతో తులసి గారు కూడా నాదే అంటాడు సామ్రాట్. ఇంతలో తులసి పెరుగు తీసుకొని వస్తుంది. తెగిన గాలిపటం అదేనా అంటాడు సామ్రాట్. దీంతో నీదే అంటాడు నందు. ఇంతలో లాస్య కూడా వస్తుంది. తులసి నువ్వు సామ్రాట్ గారిని గదిలోకి తీసుకెళ్లు. నేను నందును తీసుకెళ్తాను అంటుంది లాస్య. నందును తీసుకెళ్తుంది. వెళ్దాం పదండి అని తులసి అంటుంది కానీ.. సామ్రాట్ రాడు. నేను ఇక్కడే కూర్చొంటాను. నాకు ఇక్కడే బాగుంది అంటాడు సామ్రాట్. కావాలంటే రూమ్ నే ఇక్కడికి తీసుకురండి అంటాడు.
మరోవైపు పరందామయ్య రాత్రి పడుకుంటాడు. అతడికి చాతిలో నొప్పి వస్తూ ఉంటుంది. లేచి కూర్చొంటాడు. ఇంతలో అనసూయ లేస్తుంది. ఏమైంది అని అడుగుతుంది. భయపడుతుంది. అతడు చాతిలో నొప్పిగా ఉందంటాడు. అన్ ఈజీగా ఉంది. గుండెల్లో మంట, నిద్ర పట్టడం లేదు. ఎడమ చేయి కూడా బాగా నొప్పిగా ఉంది అంటాడు. దీంతో అభిని పిలవమంటారా అంటుంది తులసి.
దీంతో వద్దులే.. వాడు అలసిపోయి నిద్రపోయి ఉంటాడు. టెన్షన్ పడకు. నాకేం కాదు. ఉదయం చూసుకుందాం అంటాడు పరందామయ్య. కానీ.. అతడికి చెమటలు పడుతూ ఉంటాయి. దీంతో అయ్యో.. చెమటలు ఏంటి ఇలా పడుతున్నాయి అంటుంది. పక్కన టాబ్లెట్ ఉంది. తీసి ఇవ్వు అంటాడు పరందామయ్య. దీంతో అలాగే అని టాబ్లెట్ తీసి ఇస్తుంది. దాన్ని వేసుకొని నీళ్లు తాగుతాడు.
అన్నీ నెత్తి మీదికి వచ్చే వరకు తెచ్చుకుంటారు. చెప్పిన మాట వినరు అంటుంది అనసూయ. మనం టెన్షన్ పడకూడదు. ఇంట్లో వాళ్లను టెన్షన్ పెట్టొద్దు. కాసేపు పక్కన కూర్చొని తల మీద నిమురు చాలు అంటాడు పరందామయ్య. దీంతో అలాగే అంటుంది అనసూయ.
మరోవైపు సామ్రాట్ చెప్పినట్టు వినకపోవడంతో స్ట్రెచర్ మీద అతడిని రూమ్ లోకి తీసుకెళ్తుంది తులసి. నాకు అన్నయ్య కావాలి అంటాడు. దీంతో రేపు ఉదయం తీసుకెళ్తాను ఓకేనా అంటుంది తులసి. సరే అంటాడు. మరోవైపు లాస్య.. నందును రూమ్ లోకి తీసుకెళ్లి పెరుగు తినిపిస్తూ ఉంటుంది.
సామ్రాట్ ను కూడా బెడ్ మీద పడుకోబెడుతుంది తులసి. తెగిన గాలిపటం నాకు దొరికింది అంటాడు. ఆ తర్వాత నిద్రపోతాడు. కట్ చేస్తే తెల్లవారుతుంది. సామ్రాట్ టైమ్ చూస్తే 11.30 అవుతుంది. 10 గంటలకే మీటింగ్ కదా. తులసి గారు నన్ను ఎందుకు లేపలేదు అని అనుకొని తన తలుపు తడుతాడు.
కానీ… తన డోర్ లాక్ వేసి ఉంటుంది. తను ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటాడు. అవును.. నందు ఏం చేస్తున్నాడు అని అనుకుంటాడు. వెళ్లి నందు డోర్ కొడతాడు. లాస్య వెళ్లి డోర్ తీస్తుంది. ఏదైనా ప్రాబ్లమా సార్ అంటుంది లాస్య. టైమ్ ఎంతైందో తెలుసా? 11.30 అంటాడు.
క్లయింట్ తో మన మీటింగ్ 10 కి అంటాడు. మీరు మీటింగ్ కు వెళ్లి వచ్చారా అని అడుగుతాడు నందు. దీంతో ఏంటి వెళ్లేది.. నేను ఇప్పుడే లేచాను అంటాడు సామ్రాట్. మరి తులసి అయినా నిద్రలేపాలి కదా అంటుంది లాస్య. ఇంతలో తులసి అక్కడికి వస్తుంది.
ఏమైపోయారు తులసి గారు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో మీటింగ్ కు వెళ్లి వచ్చాను అంటుంది. మిమ్మల్ని నిద్రలేపడానికి చాలా ప్రయత్నించాను కానీ.. మీరు ఎవ్వరూ నిద్రలేవలేదు. అందుకే నేను వెళ్లి మన ప్రపోజల్ ను చెప్పి వచ్చాను అంటుంది.
దీంతో నందు, లాస్య తనపై సీరియస్ అవుతారు. నేను నిద్రలేపితే మీరు లేవకపోతే నేను ఏం చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. ఇంతలో క్లయింట్ నుంచి సామ్రాట్ కు కాల్ వస్తుంది. మరోవైపు పరందామయ్యకు చాతిలో నొప్పి ఎక్కువవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : తెలంగాణ Telangana రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం బహిరంగ…
Viral Video : మాతృత్వం ఒకవైపు, సమాజ బాధ్యత మరోవైపు… ఈ రెండింటినీ సమర్థంగా నిర్వర్తిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మహిళా…
Renu Desai : ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్ రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదని స్పష్టంగా చెప్పారు.…
Virat Kohli : ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మూడో వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ఏంటో…
ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తన విచారణను వేగవంతం…
Youth Kidnap : రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత…
This website uses cookies.