intinti gruhalakshmi 20 december 2022 full episode
Intinti Gruhalakshmi 20 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 820 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరస్వతి తన ఇంటికి రావడంతో వెంటనే సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది తులసి. థాంక్స్ చెబుతుంది. మరోవైపు వంట పూర్తయింది. స్నానం చేసి వస్తే భోం చేద్దాం అంటుంది సరస్వతి. కట్ చేస్తే సామ్రాట్ హుషారుగా ఇంటికి తిరిగి వస్తాయి. ఈలలు వేస్తూ ఇంటికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చొంటాడు. తను కూడా తులసి వాళ్ల ఊరిలో తిరిగిన మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంటాడు. తనలో తానే నవ్వుకుంటాడు. ఇంతలో బాబాయి అక్కడికి వస్తాడు. వీడికేమైంది అని అనుకుంటాడు. వాటర్ ఇస్తే చేతులు కడుక్కొని ఏదో ఆలోచిస్తూ భోజనం పెట్టుకుంటాడు. ఉత్త అన్నమే తింటుంటే.. వెర్రి నవ్వు నవ్వుతున్నావు. పిచ్చి ఎక్కి అయినా ఉండాలి లేదంటే ప్రేమలో అయినా పడాలి అంటాడు బాబాయి.
intinti gruhalakshmi 20 december 2022 full episode
దీంతో ఏంటి బాబాయి.. నవ్వు వస్తే దానికి అర్థం ఏం ఉండదు అంటాడు సామ్రాట్. దీంతో ప్రతి నవ్వు వెనుక ఒక భావం ఉంటుంది. తడబడకు. నీ మనసులోని మాటను బయటపెట్టు అంటాడు బాబాయి. ఇందాక తులసి, నేను అంటూ ఏదో చెప్పబోతుండగా.. ఆ నువ్వు తులసి అంటాడు. ముందు చెప్పనిస్తావా అంటాడు. సరే చెప్పు అంటాడు బాబాయి. నేను, తులసి ఆఫీసు పని మీద బయటికి వెళ్లాం. దాన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుతున్నా అంటాడు. ఉప్పు కారం తినాల్సిన వయసులో అన్నంలో ఏం వేసుకోకుండా ఉత్త అన్నం తింటున్నావు చూడు. దీన్ని ఏమనాలిరా అంటాడు బాబాయి. నాకు నిజాలు చెప్పకపోయినా పర్వాలేదు. నీ అంతరాత్మకు అయినా నిజం చెప్పుకో. భోం చేశావా బాబాయి అని అడగకుండా ఎప్పుడైనా నువ్వు భోం చేశావా.. లేదే. నేను నీకోసమే హాల్ లో వెయిట్ చేస్తున్నా అని తెలుసా? నీ లోకంలో నువ్వు ఉన్నావు అని అంటాడు బాబాయి.
పోన్లే.. మన ఊరు వెళ్లి మన ఇంటిని చూసే అదృష్టం నాకు లేకపోయినా నీకు అయినా దక్కింది అంటుంది సరస్వతి. ఆ ఇంటిని చూసి బాధపడాలో.. సంతోషపడాలో నాకు అర్థం కావడం లేదమ్మా అంటుంది తులసి.
ఏంటి అలా చూస్తున్నావు గీతోపదేశం చేస్తున్నానా అంటుంది. దీంతో అసలు నా చిన్నతనాన్ని నేనే వదులుకున్నాను. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ వయసుకు దూరం అయ్యాను అంటుంది. దీంతో మరి ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతుంది సరస్వతి.
దీంతో మళ్లీ అదే చిన్నతనానికి వెళ్తాను అంటుంది తులసి. దీంతో నువ్వు మళ్లీ చిన్నతనానికి వెళ్లినా అదే నిర్ణయం తీసుకుంటావు అంటుంది సరస్వతి. నీళ్లలో వేసిన కాగితపు పడవకు ఎటు వెళ్లాలో నిర్ణయించుకునే అవకాశం ఉండదు అంటుంది సరస్వతి.
నాన్న చనిపోయే సమయానికి కన్నీళ్లు పెట్టుకోవడం తప్పితే నాకు ఇంకేం తెలియలేదు. అమ్మానాన్నలా నువ్వే అయి మాకు జీవితాన్ని ఇచ్చావు. చిన్నపిల్లలమైనా నాన్న మీద దిగులుతో చాలా సార్లు ఏడ్చాం. నీకెందుకు కన్నీళ్లు రాలేదు. నాన్న అంటే నీకు కోపమా అని అంటుంది.
దీంతో ఇది నేను అడగాల్సిన ప్రశ్న కాదు కానీ.. అడిగా అంటుంది తులసి. దీంతో అనుకోకుండా జీవితంలో అవిటితనం ఎదురైతే దాన్నే తలుచుకుంటూ బాధపడితే జీవితం అక్కడే ఆగిపోతుంది. దిగులుతో కన్నీళ్లు పెట్టుకొని కూర్చొంటే నా కారణంగా పిల్లల జీవితం నాశనం అవుతుంది.
నా కన్నీళ్లు నా కనురెప్పలు దాటి బయటికి రాలేదు అంటుంది. లోలోపల నా గుండెలు పగిలేలా ఏడ్చాను. కన్నీళ్లు వస్తున్న ప్రతిసారీ నా కన్నీళ్లతో ముఖాన్ని తూడ్చుకొని కన్నీళ్లను దాచుకున్నాను తప్పితే నాన్న అంటే ఇష్టం లేక కాదు. ఆయన కనిపించని దేవుడు. నాతోనే ఉండే దేవుడు అంటుంది సరస్వతి.
మరోవైపు దివ్య దీనంగా కూర్చొని ఉండటం చూస్తుంది శృతి. ఏమైందో అని వెళ్లి తనను అడుగుతుంది. దివ్య ఏం ఆలోచిస్తున్నావు అంటుంది. కాఫీ చల్లారిపోయిందా అని చూస్తున్నావా అంటుంది. దీంతో మరిచిపోయాను వదిన. మరిచిపోతే నేను వేడి చేయలేను అంటుంది.
దీంతో నేను వేడి చేసుకుంటాలే అంటుంది దివ్య. నువ్వు కూడా వేడి చేసుకోలేవు. గ్యాస్ రెండు నెలలు రావాలి.. అంటుంది. ఇంతలో అంకిత కూడా వచ్చి ఇంట్లో వాళ్లు కనీసం రోజుకు 20 సార్లు మాత్రమే ఊపిరి పీల్చుకోవాలి అంటుంది.
దీంతో వీళ్ల మాటలు తట్టుకోలేక చల్లారిన కాఫీనే అలాగే తాగేస్తుంది దివ్య. ఇప్పుడు చెప్పు అసలు విషయం ఏంటి అంటే.. మా కాలేజీ యానివర్సరీకి మా ఫ్రెండ్స్ తో కలిసి డ్యాన్స్ వేయాలి అంటుంది.
ఇన్ని రోజులు అమ్మ నేర్పించేది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటుంది. దీంతో మేము ఉన్నాం కదా. మేము నేర్పిస్తాం అంటారు శృతి, అంకిత. దీంతో సరే అంటుంది దివ్య. మా ఫ్రెండ్స్ ను కూడా తీసుకొస్తా అంటుంది.
మరోవైపు తులసి ముగ్గు వేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ముగ్గు దారి తిప్పుతోంది చూసుకో అంటుంది సరస్వతి. ఇంతలో ఒక పాట వినొస్తుంది తులసికి. ఏదో ఒక రాగం అంటూ పాట వినిపిస్తుంది. దాన్ని విని చాలా సంతోషిస్తుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.