Intinti Gruhalakshmi 20 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జనవరి 2022, గురువారం ఎపిసోడ్ 534 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పండక్కి నగలు లేకపోతే అందరూ అడుగుతారు కదా ఆంటి అని తులసితో అంటుంది అంకిత. దీంతో నా నగలు ఇస్తానులే.. ఏం కాదు. వాడిని కొన్ని రోజులు అలా వదిలేయ్. వాడే తప్పు తెలుసుకుంటాడు అని చెబుతుంది తులసి. సరే ఆంటి అంటుంది అంకిత. మరోవైపు లాస్య.. శృతిని పిలిచి ఏయ్ ఇటు చూటు అంటుంది. నా పేరు ఏయ్ కాదు శృతి అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. నేను మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఎందుకు వెళ్తున్నావు అంటుంది లాస్య. దీంతో నాకు కోపం కంట్రోల్ చేసుకోవడం రాదు.. అందుకే నేను వెళ్లిపోతున్నాను అంటుంది శృతి. సరే గానీ.. బయటి నా చీరలు ఆరేసి ఉన్నాయి వెళ్లి తీసుకురా అంటుంది లాస్య. దీంతో నువ్వు ఆర్డర్ వేస్తే తెచ్చి ఇచ్చేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు అంటుంది శృతి.
మా వరకు మాకు అత్తయ్య తులసి గారే. నువ్వు ఎప్పుడూ అత్తయ్య కాలేవు అంటుంది శృతి. నీకు ఎందుకు తలపొగరు. తులసిని చూసుకొనా. త్వరలోనే తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే అంటుంది లాస్య. నువ్వు అనుకున్నది జరుగుతుందనుకోవడం నీ అవివేకం.. అంటుంది శృతి. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలువు కాలేవు.. మాకు అత్తయ్య కాలేవు అంటుంది శృతి. అంతే కాదు.. మళ్లీ తులసి ఆంటి ఈ ఇంటి కోడలు కాదనే గ్యారెంటీ కూడా లేదంటుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది. అలా ఎలా అవతుంది అంటుంది. ఏమో.. మిమ్మల్ని అంకుల్ ఎలా పెళ్లి చేసుకున్నాడో.. మళ్లీ తులసి ఆంటిని కూడా చేసుకుంటారేమో అంటూ లాస్యకు ఒక డౌట్ క్రియేట్ చేసి వెళ్తుంది శృతి.
కట్ చేస్తే తులసి.. తన పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ నాకు ఏదైనా అయితే.. నా పిల్లల సంగతి ఏంటి. వాళ్లను ఎవరు చూసుకుంటారు అని అనుకుంటుంది తులసి. ఇంతలో శృతి వస్తుంది. ఇంకా పడుకోలేదా ఆంటి అని అడుగుతుంది. లేదమ్మా అంటుంది. ఏమైంది ఆంటి అంటుంది శృతి.
ఉన్న తలనొప్పులు సరిపోవా.. లేనితలనొప్పి ఎందుకు తీసుకొస్తున్నావు అంటుంది తులసి. మళ్లీ నాకు ఈ ఇంటి కోడలు అవ్వాలని నేను అన్నానా.. నేను మళ్లీ ప్రయత్నిస్తున్నానని నీకు ఎలా అనిపిస్తోంది. నువ్వు లాస్యతో అన్న మాటలను నేను విన్నాను శృతి. లాస్యతో గొడవలు వద్దని నేను అనుకుంటున్నాను అంటుంది తులసి.
మీ మంచితనాన్ని లాస్య అలుసుగా తీసుకుంటోంది అంటుంది శృతి. మీ గురించి దురుసుగా మాట్లాడుతోంది అంటే.. మాట్లాడనీ అంటుంది తులసి. మీకు మీ అత్తగారంటే మీకు ఎంత అభిమానమో.. ఎంత గౌరవమో.. మాకు కూడా మా అత్తగారంటే అంత ప్రేమ అంటుంది శృతి.
మరోవైపు లాస్య.. యాక్షన్ స్టార్ట్ చేస్తుంది. నందు ముందు ఏడుస్తున్నట్టు నటిస్తుంది. ఏమైంది అని అడుగుతాడు నందు. నువ్వు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు అని అంటుంది లాస్య. ఈ ఇంట్లో నేను తప్ప అందరూ నీ వాళ్లే. నీ దృష్టిలో అందరూ మంచివాళ్లే అంటుంది తులసి.
నిన్ను కూడా దారుణంగా శృతి కామెంట్ చేసింది అంటూ ఎక్కించి చెబుతుంది లాస్య. నా గురించి ఏం కామెంట్ చేసింది అని అడుగుతాడు నందు. వద్దులే నందు.. అంటూ నాటకాలు చేస్తుంది. దీంతో చెప్పు లాస్య అంటుంది. మరేమో నీది చాపల బుద్ధి అట. ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో.. ఎప్పుడు ఏం చేస్తావో తెలియదు అట.
మళ్లీ తులసి దగ్గరికి వెళ్లిపోతావట.. తులసినే మళ్లీ పెళ్లి చేసుకుంటావట.. నువ్వు నిజంగానే తులసి దగ్గరికి వెళ్లిపోతే నాకు చావు తప్పితే ఇంకో మార్గం లేదు నందు.. అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది లాస్య. ఏదో ఒక ఇష్యూలో తులసి వైపు మాట్లాడినంత మాత్రాన తులసి వైపు ఉన్నట్టా. ఊరుకో లాస్య నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను.. అంటాడు నందు.
ఇక నుంచి అలా జరగదు లాస్య. ఇంట్లో వాళ్లంతా నీ మాట వినేలా చేస్తాను. ఒకవేళ ఎవరైనా అలా చేయకపోయినా ఏం జరుగుతుందో చూస్తాను అంటాడు నందు. వెంటనే వెళ్లి లాస్య ఈ ఇంటి మనిషి కదా.. ఎందుకు అంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది అంటూ శృతిపై సీరియస్ అవుతాడు నందు.
రాను రాను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నోరు లేస్తోంది. పోనీలే అని అనుకుంటే దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు అంటాడు నందు. దీంతో ఈ ఇంట్లో వాళ్లు నాకు మొదటి నుంచి అండగా నిలబడ్డారు. అది నాకు జీవితాంతం ఉంటుంది. బతికిచ్చిన వాళ్లను మరిచిపోయేంత సంస్కారం నాకు లేదు. నన్ను పద్ధతిగా అడగమని లాస్య ఆంటితో చెప్పాను అంటుంది శృతి.
కావాలని లాస్య ఇంట్లో వాళ్లను రెచ్చగొడుతోంది. ఇంట్లో వాళ్లను కంట్రోల్ లో పెట్టుకోవాలని లాస్య చూస్తోంది అంటాడు ప్రేమ్. దీంతో నీ పెళ్లం నీకు ట్రెయినింగ్ ఇస్తోందా? లేక.. నువ్వు నీ పెళ్లానికి ట్రెయినింగ్ ఇస్తున్నావా? అంటాడు నందు. దీంతో ప్రేమ్.. సీరియస్ అవుతాడు. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.