Intinti Gruhalakshmi 20 June Today Episode : అంకితను తులసి ఇంట్లోకి రానిస్తుందా? ఈ విషయం తెలిసి నందు, లాస్య ఏం చేస్తారు?

Intinti Gruhalakshmi 20 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 663 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అంకిత.. తులసి ఇంటికి రావడంతో పరందామయ్య, దివ్య, అనసూయ షాక్ అవుతారు. అప్పుడే కిచెన్ లో నుంచి వచ్చిన తులసి అంకితను చూసి షాక్ అవుతుంది. తను బ్యాగ్ పట్టుకొని రావడం ఏంటి అని అనుకుంటుంది. తనకు ఇంటికి రావద్దని ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది తులసి. మీ పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకోలేదు. అటువంటి అవసరం ఒకటి వస్తుందని కూడా అనుకోలేదు. కానీ.. తప్పలేదు. ఆ ఇల్లు వదిలి ఈ ఇంటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఆదరిస్తారన్న ఆశతో ధైర్యంగా మరోదారి లేక వచ్చాను. ఏం చేయమంటారు ఆంటి అంటుంది తులసి. ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆరోజే చాలా స్పష్టంగా చెప్పాను. పైగా అందరి ముందు చెప్పాను. నేను నా మాటకు కట్టుబడి ఉంటాను అంటుంది తులసి.

intinti gruhalakshmi 20 june 2022 full episode

దీంతో ఆరోజు పరిస్థితి వేరు.. ఈరోజు పరిస్థితి వేరు.. దయచేసి మీ మనసును మార్చుకోండి ఆంటి అంటుంది అంకిత. దీంతో నేను నా మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు అంటుంది తులసి. మీ కొడుకే మీ పొజిషన్ లో ఉంటే ఏం చేస్తారు ఆంటి అంటుంది అంకిత. హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది అని అంటుంది అనసూయ. దీంతో కొడుకుకో న్యాయం.. కోడలుకో న్యాయమా ఆంటి అంటుంది అంకిత. తులసి మాత్రం ఏం మాట్లాడలేకపోతుంది. ఆరోజు నీ కొడుకును అత్తవారింటికి పంపించడానికి నీ సాయం అడిగారు. నీ మాటకు తలవంచి వెళ్లిపోయాను. ఆరోజు నీ మాట కాదని ఉంటే.. ఈరోజు ఇక్కడ నిలిచి ఉండేదాన్ని కాదు.. కాదంటారా ఆంటి అంటుంది అంకిత. మీరు తీసుకున్న నిర్ణయానికి శిక్ష నన్ను అనుభవించమంటారా ఆంటి అంటుంది అంకిత.

అసలు ఏం జరిగింది.. అభి ఏడి.. ఒక్కదానివే ఎందుకు వచ్చావు అని అడుగుతాడు పరందామయ్య. దీంతో ఆ ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు. నన్ను అసలు మనిషిగా కూడా చూడటం లేదు. బెదిరిస్తున్నారు. నా నోట్లో గుడ్డలు కుక్కి మాట్లాడమంటున్నారు. చేతులు నావే అయినా చేతలు వాళ్లవే కావాలంటున్నారు. కోట్ల ఆస్తి నా పేరు మీద పెట్టారు. పైసా కూడా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టుకునే వీలు లేదంటున్నారు అంటుంది అంకిత.

మీకొడుకు కూడా వాళ్ల వైపు చేరాడు. ఇక నేను అక్కడ ఎలా బతకాలి. అందుకే.. అన్నీ వదిలేసి నాకు ఇష్టమైన మనుషుల దగ్గరికి వచ్చాను అంటుంది అంకిత. నేనూ ఆడదాన్నే. అంకిత కష్టం నాకు తెలుసు. ఆ ఇంట్లో అంకిత ఎంత ఇబ్బంది పడుతోందో నేను ఊహించగలను. తను తన వాళ్లను మాత్రమే కాదనుకొని రాలేదు.. తన భర్తను కూడా వదిలేసి వచ్చింది అంటుంది తులసి.

దీంతో నేను అభిని వదిలేసి రాలేదు. తనే నాతో రావడానికి సిద్ధంగా లేడు. అభి స్వార్థంతో నన్ను ఆ ఇంట్లో ముళ్ల కంప మీద బతకమంటారా? ఆడదానికి ఒక రూలు.. మగాడికి ఒక రూలు ఉంటుందా ఆంటి. మీరు కూడా ఒక మగాడి వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా అంటుంది అంకిత.

ఇప్పుడు నువ్వు గడప దాటి ఇక్కడి రావడం వల్ల సమస్య తీరిపోదు. దానికి ఇంకా వంద సమస్యలు వస్తాయి.. అంటుంది తులసి. ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండానే ఇన్నాళ్లు నీ జీవితం గడిచిందా అని అడుగుతాడు పరందామయ్య. దీంతో తులసి ఏం సమాధానం చెప్పలేకపోతుంది.

Intinti Gruhalakshmi 20 June Today Episode : రెంట్ కట్టలేదని నందుకు క్లాస్ పీకిన ఇంటి ఓనర్

నీ జీవితం నా జీవితంలా అవ్వకూడదు.. అర్థం అవుతోందా అని అడుగుతుంది తులసి. అర్థం అయింది ఆంటి.. మీరు ఈ ఇంట్లోకి నన్ను రానివ్వకపోతే.. ఎక్కడైనా ఆశ్రయం పొందుతా కానీ.. మా మామ్ ఇంటికి మాత్రం వెళ్లను.. నిర్ణయం మాత్రం నీదే అంటుంది అంకిత.

అందరూ బతిమిలాడినా కూడా తులసి ఒక్కమాట కూడా అనదు. దీంతో అంకిత ఇంట్లో నుంచి వెళ్లిపోయే సమయానికి ఆగు అని చెబుతుంది తులసి. అంకితకు ఇంట్లో ఉండటానికి అవకాశం ఇస్తుంది తులసి. మరోవైపు ఇంటి అద్దె ఇవ్వలేదని ఓనర్ వచ్చి నందును ప్రశ్నిస్తాడు.

రెండు రోజుల్లో నేనే రెంట్ తీసుకొచ్చి ఇస్తాను అంటాడు నందు. ఈసారికి ఊరుకుంటున్నాను. త్వరగా నా అద్దె డబ్బులు అరేంజ్ చేయండి అంటాడు ఓనర్. మరోవైపు లాస్య వచ్చి నందు కొద్దిగా వాటర్ తెచ్చి ఇవ్వవా ప్లీజ్ అంటుంది. ఆఫీసులో అలసిపోయి వచ్చాను అంటుంది.

దీంతో వెళ్లి తెచ్చుకో అంటాడు నందు. ఏమైంది నందు అలా ఉన్నావు అంటుంది. దీంతో చేయడానికి జాబ్ లేదు. హౌస్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేవు.. అంటాడు నందు. అప్పు  చేసి మరీ బర్త్ డేలు అంటూ తగలెట్టావు. ఇప్పుడు ఏమైంది అని అంటాడు నందు.

దీంతో అవన్నీ నీ బిజినెస్ కోసమే కదా అంటుంది లాస్య. ఇంతలో కోపంతో అభికి ఫోన్ చేస్తాడు నందు. దీంతో అంకిత ఇంట్లో లేదు.. సూట్ కేసు సర్దుకొని అత్తవారింటికి వెళ్లిపోయింది అని అంటాడు అభి. ఇంతలో గాయత్రి ఫోన్ తీసుకొని మనం అనుకున్నదే జరిగింది అంటుంది.

అంకితను అలాగే వదిలేస్తే తులసి కోసం ఆస్తి మొత్తం హారతికర్పూరంలా కరిగించేస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్దాం పదా అంటుంది. అభిని రమ్మంటే రాడు. దీంతో నేనే వెళ్తాను అని అంటుంది గాయత్రి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago