intinti gruhalakshmi 20 october 2022 full episode
Intinti Gruhalakshmi 20 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 అక్టోబర్ 2022, గురువారం ఎపిసోడ్ 768 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసికి గిఫ్ట్ ప్యాక్ ఇస్తాడు పరందామయ్య. ఆ గిఫ్ట్ ప్యాక్ ను ఇక్కడే తెరవొద్దని, దాన్ని ఒక చోట తెరుద్దామని అంటాడు పరందామయ్య. దీంతో ఎక్కడ ఆ చోటు అని షాక్ అవుతారు అందరూ. చివరకు క్యాబ్స్ బుక్ చేసుకొని వాళ్లు ఇదివరకు ఉన్న తులసి నిలయానికి వెళ్తారు. మళ్లీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మామయ్య అంటుంది తులసి. నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లండి మామయ్య అంటుంది తులసి. దీంతో ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ నిలబడి ముందు నువ్వు ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయి అంటాడు పరందామయ్య. దీంతో తులసికి ఏం అర్థం కాదు. ఈ ఒక్కసారి నేను చెప్పింది చేయి. నిన్ను ఇక ఏం అడగను. ఆ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయి అంటాడు పరందామయ్య.
intinti gruhalakshmi 20 october 2022 full episode
దీంతో ఆ గిఫ్ట్ ప్యాక్ ను ఓపెన్ చేసి షాక్ అవుతుంది తులసి. అందులో ఆ ఇంటి తాళాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి. ఏంటిది.. ఇది నిజమేనా అని అంటుంది తులసి. అవును.. నీ కల మళ్లీ నెరవేరింది. పోగొట్టుకున్నది మళ్లీ నీకే దక్కింది అంటాడు. దీంతో ఆశ్చర్యపోతుంది తులసి. నా జీవితంలో ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్నది ఏదీ నాకు దొరకలేదు. కానీ.. చివరకు ఈ ఇల్లు దొరికింది అంటుంది. ఆ ఇల్లును పరందామయ్య.. తులసి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాడు. ఆ తర్వాత మామయ్య మీరు నాకు ఒక పని చేయండి. ఈ ఇంటిని నా పేరు మీద వద్దు.. మీ పేరు మీద రిజిస్టర్ చేయించండి. నాకు వద్దు. నాది అసలు మంచి జాతకం కాదు. నా దగ్గర ఏదీ ఉండదు అంటుంది. దీంతో లేదమ్మా అది నీది. ఆ ఇల్లు నీదే. అప్పుడు ఆ ఇల్లు అమ్మేలా రావడానికి కారణం నేను, నా కొడుకు. ఈ ఇల్లు నీ పేరు మీద ఉండాలి. కాదనకు అమ్మ అంటాడు.
కానీ.. అనసూయకు మాత్రం ఎందుకో డౌట్ వస్తుంది. అసలు ఈ ఇల్లు నీ చేతికి ఎలా వచ్చింది. అంత డబ్బు పెట్టి కొనేంత స్థోమత లేదు కదా అని సవాలక్ష ప్రశ్నలు అడుగుతుంది అనసూయ. దీంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనసూయ అంటాడు పరందామయ్య.
ఆ తర్వాత తులసి నిలయం అనే బోర్డును అక్కడ ముందు తగిలించు అంటాడు పరందామయ్య. దీంతో ఆ ఇంటికి బోర్డు తగిలించి లోపల అడుగుపెడుతుంది తులసి. ఆ తర్వాత ఇంటి డోర్ ఓపెన్ చేసి భావోద్వేగానికి గురవుతుంది తులసి. అందరూ సంతోషిస్తారు.
లోపల అడుగుపెట్టబోతుండగా.. మామ్ ఒక్క నిమిషం అంటారు. అందరూ తను ఇంట్లో అడుగుపెడుతుండగా పూలు జల్లుతారు. ఆ తర్వాత తులసికి స్వీటు తినిపిస్తాడు పరందామయ్య. ఇదంతా అనసూయకు నచ్చదు. తాను మాత్రం చాలా ఇబ్బందిగానే ఉంటుంది.
కానీ.. పరందామయ్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా ఉంటారు. తులసి ఇల్లు అంతా తిరుగుతుంది. అన్ని రూములను చూసి తన పాత మెమోరీస్ ను గుర్తు తెచ్చుకుంటుంది. కిచెన్ కు వెళ్తుంది. డైనింగ్ టేబుల్ ను చేస్తుంది.
తనకు అన్నీ గుర్తొస్తాయి. తను అప్పట్లో చేసిన పనులన్నీ గుర్తొస్తాయి. ఆ తర్వాత దేవుడి గుడికి వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. తనకు ఇంకా అదంతా ఒక కలలా అనిపిస్తుంది. ఆ ఇంటిని చూసి ఎంతో మురిసిపోతుంది తులసి. ఇప్పటి వరకు లేని సంతోషం తన ముఖంలో కనిపిస్తుంది.
గతం కళ్ల ముందు తిరుగుతుంది మామయ్య అంటుంది పరందామయ్యతో. దీంతో కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తోంది కదా అంటాడు పరందామయ్య. దీంతో ఎంత వెనక్కి వెళ్లినా మళ్లీ ఇక్కడికే వచ్చి ఆగుతుంది కదా అంటుంది తులసి. కాలం వెనక్కి వెళ్లినా నా వరకు ఏం మార్పు ఉండదు అంటుంది తులసి.
ఒక్క ప్రశ్న అడుగుతాను మామయ్య. ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి నాకు ఈ ఇల్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది మామయ్య అంటుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ ఇంటికి వస్తాడు. లాస్య, నందు కూడా వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.