Intinti Gruhalakshmi 21 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 ఏప్రిల్ 2022, గురువారం ఎపిసోడ్ 612 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీరామనవమి సందర్భంగా పూలు, పండ్లు తీసుకొచ్చి పంచె కట్టుకొని కళ్యాణం కోసం రెడీ అవుతాడు నందు. కానీ.. లాస్య మాత్రం రెడీ కాదు. నేను ఆఫీసుకు వెళ్లాలి అంటుంది. దీంతో నందుకు కోపం వస్తుంది. మా వంశాచారం ప్రకారం.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి శ్రీరాముల వారి కళ్యాణంలో పాల్గొనాలి అంటాడు. కానీ.. లాస్య మాత్రం వినదు. దీంతో కోపం వచ్చి తీసుకొచ్చిన వస్తువులు అన్నింటినీ విసిరేసి అక్కడి నుంచి వెళ్లిపోతారు.
కట్ చేస్తే.. నిద్రపోతున్న అభిని ఒకసారి కళ్లారా చూస్తుంది తులసి. బిడ్డల విషయంలో ఏ తల్లికైనా స్వార్థం ఎక్కువగా ఉంటుంది. బిడ్డలు ఎప్పుడూ తన దగ్గరే ఉండాలనుకుంటుంది. తన నీడలోనే బతకాలనుకుంటుంది. బిడ్డలకు రెక్కలు వచ్చినా ఆ విషయం పట్టించుకోదు. వాళ్లకు కూడా ఒక మనసు ఉంటుంది అనే విషయం మరిచిపోతుంది. చిన్నప్పుడు ఎలా చేతులు పట్టుకొని నడక నేర్పిందో.. పెద్దయ్యాక కూడా అలాగే ప్రవర్తిస్తుంది. తన ఎదురుగా ఉన్న బిడ్డను ప్రాణంగా ఉన్న మనిషిగా కాకుండా.. ప్రాణం లేని బొమ్మగా అనుకుంటుంది. ప్రతి తల్లి చేసే ఈ తప్పే నేను చేశాను. నా భర్త దూరం అయ్యేసరికి.. పిల్లలతో అనుబంధాన్ని పెంచుకున్నాను. మీరే నా జీవితం అనుకున్నాను కానీ.. మీకంటూ ఒక జీవితం ఉంటుందని మీకంటూ కొన్ని కోరికలు, ఆశలు ఉంటాయని.
నువ్వు ఈ నిజాన్ని నాకు గుర్తు చేసి చాలా మంచి పని చేశావు. నాకు తప్పు దిద్దుకునే అవకాశం ఇచ్చావు. స్వార్థాన్ని పక్కన పెట్టి.. నా గురించి ఆలోచించడం మానేసి.. నీ గురించి ఆలోచిస్తాను..అని మనసులో అనుకొని.. ఆ తర్వాత వచ్చి అభిని లేపుతుంది.
దీంతో మామ్ ఏంటి.. నువ్వు వచ్చి నన్ను లేపుతున్నావు అంటాడు. దీంతో ఈరోజు శ్రీరామనవమి కదా.. నువ్వు రెడీ అయితే.. పూజ చేద్దాం అంటుంది తులసి. దీంతో సరే.. రెడీ అవుతా అంటాడు. నువ్వు రెడీ అవ్వడం కాదు.. నేనే ఈరోజు నిన్ను రెడీ చేస్తా అంటుంది.
నలుగు పెట్టి తలంటు స్నానం చేపిస్తుంది తులసి. ఆ తర్వాత అభిని రెడీ చేస్తుంది. ఇంతలో పరందామయ్య వస్తాడు. ఒరేయ్ మనవడా.. మీ అమ్మ నిన్ను శ్రీరామచంద్రుడిని చేసింది. వనమాసానికి వెళ్లాల్సి వస్తుందేమో చూసుకో అంటాడు పరందామయ్య. దీంతో అభి, తులసి షాక్ అవుతారు.
ఏం అనుకోకు అమ్మా.. ఏదో సరదాకు ఆటపట్టించడానికి అన్నాను అంతే. నా మనసులో వేరే ఉద్దేశం ఏం లేదు అంటాడు పరందామయ్య. మీరు ఏ ఉద్దేశంతో అన్నా జరగాల్సింది జరగక మానదు మామయ్య.. మన చేతుల్లో ఏముంది అంటుంది తులసి.
దీంతో వాడికి నువ్వంటే ప్రాణం.. నీకు వాడంటే ప్రాణం.. ఒకరికి మరొకరు ఎలా దూరం అవుతారు అంటాడు పరందామయ్య. ఆ తర్వాత అందరూ కలిసి శ్రీరామనవమి పూజలో పాల్గొంటారు. అభి, అంకితలతో పూజ చేయిస్తుంది తులసి.
మరోవైపు శృతి, ప్రేమ్.. ఇద్దరూ శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు. కష్టాలు రాకుండా కాపాడు దేవుడా అంటూ మనం ఎప్పుడూ దేవుడిని కోరుకోకూడదు. మనం పాప ఫలం అనుభవించాల్సిందే.. అంటూ ప్రేమ్ కు శ్రీరామనవమి విశిష్టతను చెబుతుంది శృతి.
కట్ చేస్తే.. గాయత్రి.. తులసి ఇంటికి వస్తుంది. నా కూతురును నా ఇంటికి తీసుకెళ్లడానికి తులసి ఒప్పుకుంది అని చెబుతుంది. మా మామ్ తో వెళ్లడం నాకు ఇష్టమే అంటుంది అంకిత. దివ్య, అభికి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.