Home » Entertainment » Senior Actor Annapoornamma Gets Emotional In Sridevi Drama Company
Entertainment

Sridevi Drama Company : ప్రేక్షకులకు సారీ చెప్పిన అన్నపూర్ణమ్మ.. శ్రీదేవీ డ్రామా కంపెనీలో సీనియర్ నటి కన్నీరు

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 21, 2022 12:48 am
Advertisement

Sridevi Drama Company : సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఇప్పుడు బుల్లితెరపై సందడి చేస్తోంది. ఒకప్పుడు వెండితెరపై అన్నపూర్ణమ్మ ఎన్నో పాత్రలో అందరినీ మెప్పించింది. సీరియస్, ఎమోషనల్, కామెడీ ఇలా ఎలాంటి పాత్రలు ఇచ్చినా కూడా అన్నపూర్ణమ్మ వాటికి న్యాయం చేసింది. ఇక ఇప్పుడు బుల్లితెపై కామెడీని పండిస్తూ అందరినీ నవ్విస్తోంది. ఒక రకంగా చూస్తే సీనియర్ నటీనటులకు ఇది సెకండ్ ఇన్నింగ్స్‌లా మారింది.

Advertisement

శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో సీనియర్ నటీనటులను తీసుకొచ్చి కామెడీ స్కిట్లు వేయిస్తున్నారు. వారికి ఉపాధిని కల్పిస్తున్నారు. అయితే తాజాగా అన్నపూర్ణమ్మ ఈ షోలో కన్నీరు పెట్టేసుకుంది. ఇలా అందరి ముందే కన్నీరు పెట్టుకోవడంతో.. ప్రేక్షకులను క్షమించమని అడిగేసింది. చనిపోయిన తన కూతురు గుర్తుకు వచ్చిందంటూ బోరున ఏడ్చేసింది. అసలు జరిగింది ఏంటంటే?.సీరియల్ నటి శ్రీవాణి తన ఫ్యామిలీతో కలిసి ఓ స్కిట్ వేసింది. అందమైన కుటుంబం, భర్త, పాపతో జీవితం కొనసాగుతుంటుంది.

Senior Actor Annapoornamma Gets EMotional In Sridevi Drama Company

Advertisement

అందులో భర్త ఓ ప్రమాదంలో చనిపోతాడు. దీంతో భార్య కూడా చనిపోతుంది. అయితే పాప మాత్రం అనాథలా మిగిలిపోతుంది. ఈ స్కిట్ చూసి అన్నపూర్ణ కంటతడి పెట్టేసుకుంది. ఈ స్కిట్లో పాపకు ఎవ్వరూ లేరు.. తల్లిదండ్రులు చనిపోతారు.కానీ నా జీవితంలో మాత్రం మా కూతురు చనిపోయింది.. బాధను అందరి ముందూ వ్యక్త పర్చలేం. ఏ తెల్లవారు ఝామునో.. పడుకునే ముందో.. తినే సమయంలోనే గుర్తుకు వస్తుంటుంది.. ఇలా ఏడుస్తున్నందుకు నన్ను క్షమించండి అని అన్నపూర్ణమ్మ కంటతడి పెట్టేసుకుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి