Intinti Gruhalakshmi 21 May Today Episode : శృతి ఎక్కడ పనిచేస్తోందో తెలుసుకొని ప్రేమ్ షాక్.. తులసికి అదృష్టం వరించిందా? సంగీతం టీచర్ గా సక్సెస్ అవుతుందా?

Intinti Gruhalakshmi 21 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 21 మే 2022, శనివారం ఎపిసోడ్ 638 హైలైట్స్ ఏంటో  ఇప్పుడు చూద్దాం. ఉదయమే తులసి ఇంటికి ఇద్దరు పిల్లలు వస్తారు. తనకు సంగీతం నేర్పించాలంటూ కోరుతారు. నేను సంగీతం నేర్పిస్తానని ఎవరు చెప్పారు అని అడుగుతుంది తులసి. దీంతో మీరు సంగీతం నేర్పిస్తామని సోషల్ మీడియాలో యాడ్ ఇచ్చారు కదా అని అడుగుతారు పిల్లలు. దీంతో తులసి షాక్ అవుతుంది. ఈ పని చేసింది దివ్య అని తెలిసి దివ్యపై కోప్పడబోతుంది. తర్వాత మంచిదే కదా.. అని అనసూయ అంటుంది. చివరకు సోషల్ మీడియాలో ఆ యాడ్ పాపులర్ అవుతుంది. ఇంటి ఓనర్ పర్మిషన్ తీసుకొని చాలామంది పిల్లలు వస్తే ఇంటి బయట షెడ్డు వేయిద్దాం అని అంటుంది దివ్య.

intinti gruhalakshmi 21 may 2022 full episode

మరోవైపు ప్రేమ్.. ఏ పని లేక ఖాళీ ఉండటం ఇష్టం లేక చాలా బాధపడుతూ ఉంటాడు. శృతి పనికి వెళ్లే సమయంలో ప్రేమ్ కు అన్ని విషయాలు చెప్పి వెళ్లబోతుంది. దీంతో నీ పని ఇంట్లో కూర్చొని తినడమే అని వెటకారం చేస్తున్నట్టుగా అనపిస్తోంది అంటాడు ప్రేమ్. దీంతో నేను మాట్లాడితే నీకు అలా అనిపిస్తోందా అని అంటుంది శృతి. త్వరగా లక్ష్యాన్ని చేరుకొని అమ్మతో శెభాష్ అనిపించుకోవాలని అనిపిస్తుంది అంటాడు ప్రేమ్. పదా నేను కూడా నీతో వస్తా.. ఏదైనా పని చూసుకుంటా అంటాడు. దీంతో శృతికి టెన్షన్ పట్టుకుంటుంది. వద్దు అన్నా కూడా వినడు ప్రేమ్. తనతో పాటు వస్తుంటాడు. నాకు ఆఫీసుకు లేట్ అవుతోంది. నేను ఇటు నుంచి ఆఫీసుకు వెళ్తా అంటుంది శృతి. దీంతో ప్రేమ్ వెళ్లిపోతాడు.

కట్ చేస్తే.. లాస్య నందును తనకు తెలిసిన ఓ కంపెనీకి తీసుకెళ్తుంది. జాబ్ కోసం ఇద్దరూ ఇంటర్వ్యూకు వెళ్తారు. మీరు ఇదివరకు కేప్ లో పని చేశారు కదా అని అడుగుతాడు. దీంతో నందుకు కోపం వస్తుంది. ఏం చేయకూడదా అంటాడు నందు. తర్వాత లాస్య.. సతీశ్ ను సముదాయిస్తుంది.

Intinti Gruhalakshmi 21 May Today Episode : సతీశ్ పై నందు సీరియస్

కావాలంటే ఎవడి కంపెనీలో అయినా పని చేస్తాను కానీ.. నీ కంపెనీలో పని చేయను నేను అంటాడు నందు. నువ్వు ఒకప్పుడు పని కోసం నా ముందు చేయి చాచిన విషయం మరిచిపోయావా అని అంటాడు నందు. దీంతో సతీశ్ కు కోపం వస్తుంది. ఆ తర్వాత నందు బయటికి వెళ్లిపోతాడు. లాస్య కూడా తనతో పాటు బయటికి వెళ్తుంది. నందుకు కోపం వచ్చి బయటికి రావడంతో ఏం చేయాలో లాస్యకు అర్థం కాదు.

మరోవైపు శృతి పని చేసేది ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లోనే. మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్లో పని చేస్తుందని ప్రేమ్ కు తెలియదు. తనను మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కువ పని చేయించుకుంటాడు. మరోవైపు నందు, లాస్య ఇద్దరూ కారులో వెళ్తుంటారు. కొంచెం సేపు నీ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావా అని అడుగుతుంది లాస్య.

కొంచెం సేపు కూల్ గా ఉండి ఉంటే ఎలాగోలా మేనేజ్ చేసి నీకు జాబ్ ఇప్పించేవాడిని కదా అంటుంది లాస్య. దాని కోసం నేను ఆత్మాభిమానాన్ని చంపుకోలేను అంటాడు నందు. అందుకే కదా.. తులసి ఇంటి నుంచి మనం బయటికి వచ్చింది అంటాడు నందు. నువ్వు చాలా ఇగోయిస్టువి నందు అంటుంది లాస్య.

నాకు ఆత్మాభిమానం ఉంది. నీకే కాదు అంటుంది లాస్య. సతీశ్ తో పాటు అక్కడ పని చేసేవాళ్లంతా నాకన్నా జూనియర్స్. వాళ్ల ముందు నేను పని చేయడమా. వాళ్లు నన్ను భవిష్యత్తులో అవమానించరని గ్యారెంటీ ఏంటి అని అడుగుతాడు నందు.

మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి వస్తాడు ప్రేమ్. నువ్వు ఇంటికి కూడా వచ్చావా.. నీకు ఎన్నిసార్లు చెప్పాలి. నిన్ను పనిలో నుంచి తీసేశాను కదా. అనవసరంగా నా టైమ్ వేస్ట్ చేయకు వెళ్లు.. అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. అమ్మాయి కాఫీ తీసుకురా అని అంటాడు.

కాఫీ చెప్పారు కదా… తాగకుండా వెళ్తే బాగుండదు అని అంటాడు ప్రేమ్. దీంతో కాఫీ చెప్పింది నీకు కాదు.. నాకు అంటాడు మ్యూజిక్ డైరెక్టర్. మరోవైపు ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లబోతుండగా.. లోపలి నుంచి అన్నీ వింటుంది శృతి. ఇంతలో కాఫీ తీసుకొచ్చి కాఫీ అంటూ అరుస్తుంది.

సంగీత సాధన చేస్తుండగా డిస్టర్బ్ చేస్తావా.. నీకు సంగీతం అంటే తెలుసా అని అడుగుతాడు. తెలియదు అంటే.. నేను పాడుతాను చూడు అంటూ ఏదేదో పాడబోతుంటాడు మ్యూజిక్ డైరెక్టర్. దీంతో అతడి మీద కాఫీ పారబోస్తుంది శృతి. దీంతో బావురుమంటాడు మ్యూజిక్ డైరెక్టర్.

Recent Posts

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

45 minutes ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు..!

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

2 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

3 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

4 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

5 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

6 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

7 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

8 hours ago