intinti gruhalakshmi 22 october 2021 friday episode
Intinti Gruhalakshmi 22 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి ఈరోజు సీరియల్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 అక్టోబర్, 2021 శుక్రవారం ఎపిసోడ్ 457 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఉన్నపళంగా కిందపడిపోవడంతో తనను చూసిన నందు.. వెంటనే ఎత్తుకెళ్లి తన బెడ్ రూమ్ లో పడుకోబెడతాడు. మరోవైపు అభి రెడీ అవుతుంటాడు. నా ఫోన్ ఎక్కడ అంటూ అంకిత అక్కడికి వస్తుంది. అంకిత మనమిద్దరం బయటికి వెళ్లాలి బయలుదేరు అంటాడు. ఎందుకు అంటే.. ఈరోజు ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ అంటాడు. దీంతో అంకిత షాక్ అవుతుంది. ఇంకోసారి నా ముందు శృతి మ్యాటర్ తీసుకురావద్దు.. తనకు సంబంధించిన విషయాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అంటుంది అంకిత. నేను రానంటే రాను అని చెబుతుంది. నువ్వు ఒక్కడివి కూడా వెళ్లడానికి వీలులేదు అంటుంది అంకిత.
intinti gruhalakshmi 22 october 2021 friday episode
ప్రేమ్ ఏం చేస్తున్నాడు.. ప్రేమ్ ను వెళ్లి తెచ్చుకొమ్మని చెప్పు అంటుంది అంకిత. దీంతో అభి తనపై సీరియస్ అవుతాడు. తన మాట లెక్కచేయకుండా ఒక్కడే వెళ్లిపోతాడు.ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. నువ్వు కూడా మారాలి అంకిత.. అని అంటుంది లాస్య. నాకు శృతి అంటే ఇష్టం లేదు అంటే. శృతి అంటే ఇష్టం ఉన్నట్టు నటించు అని చెబుతుంది. ముందు నీ భర్తను నీ అదుపులోకి తెచ్చుకో. ఆ తర్వాత అభికి శృతి అంటే కోపం వచ్చేలా చేసుకో. ఆ తర్వాత నువ్వు వద్దన్నా కూడా శృతి మీద అభి కోపం చూపిస్తాడు. అప్పుడు నీ ప్లాన్ కూడా వర్కవుట్ అవుతుంది అని చెబుతుంది లాస్య.
కట్ చేస్తే తులసికి మెళకువ వస్తుంది. అక్కడే నందు ఉంటాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటుంది తులసి. దీంతో నందు వచ్చి అసలు నువ్వు ఏమనుకుంటున్నావు. నీకు నువ్వు పెద్ద సూపర్ ఉమెన్ అనుకుంటున్నావా? నువ్వు గార్డెన్ లో తిరుగుతూ నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నా రెండు కోట్ల అప్పు ఎలా తీర్చాలని నువ్వు టెన్షన్ తో ఆలోచిస్తున్నావు కదా. ఒక గంట నువ్వు ఆలోచిస్తేనే నీకు అంత టెన్షన్ వచ్చింది. మరి నేను రోజూ నా బిజినెస్ గురించి ఎంత ఆలోచిస్తున్నానో అర్థం అయిందో తెలిసిందా? అని నందు అనేసరికి.. నేను కళ్లు తిరిగి పడిపోయింది నీ 2 కోట్ల వల్ల కాదు.. నేను పొద్దున్నుంచి ఏం తినలేదు. అందుకని కళ్లు తిరిగి కిందపడిపోయాను.. అని అంటుంది తులసి.
కట్ చేస్తే.. ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారు. అభి, అంకిత ఇద్దరూ కలిసి వాళ్ల ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంటారు. లాస్య చెప్పినట్టుగా శృతి మీద కోపం లేనట్టుగా నటిస్తుంది అంకిత. ఆ విషయాన్ని పసిగట్టలేకపోతాడు అభి. ఇంతలో తులసి వస్తుంది. అంతా సిద్ధమా అని అడుగుతుంది. అన్నీ సిద్ధం చేశాం ఆంటీ అంటుంది అంకిత.
intinti gruhalakshmi 22 october 2021 friday episode
నందు ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉండగా.. లాస్య వచ్చి ఏమైంది నందు అని అడుగుతుంది. నీ మనసులో ఏముందో చెప్పు అని అడుగుతుంది. నందు ఏం లేదు అంటాడు. దీంతో చిరాకుగా ఉంది అంటాడు నందు. ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల కాస్త చిరాకుగా ఉంది అని లాస్యకు చెబుతాడు. నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే అన్నీ వదులుకొని నీతో ఉంటున్నాను. ఎప్పటికీ నీతోనే ఉండాలని అనుకుంటున్నాను.. అని నందుతో చనువుగా ఉంటుంది లాస్య. ఇంతలో అక్కడికి తులసి వస్తుంది. వాళ్లను అలా చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.