tdp office receptionist informed to police about attack
TDP : ఆంధప్రదేశ్‌లో రాజకీయం ప్రస్తుతం బాగా వేడెక్కింది. టీడీపీ కార్యాలయాలపై, వైసీపీ కార్యకర్తల దాడి నేపథ్యంలో దాడిని ఖండిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్షకు కూర్చున్నారు. ఈ దీక్షకు కౌంటర్‌గా వైసీపీ ‘జనాగ్రహ దీక్ష’లు చేస్తున్నది. మొత్తంగా ఏపీ రాజకీయం అట్టుడుకుతున్నది. కాగా, టీడీపీ ఆఫీసుపై దాడి జరగబోతున్నది ముందే ఆ పార్టీ కార్యాలయ సిబ్బంది గ్రహించి, ఆ విషయం పోలీసులకు చెప్పింది కూడా. అయితే, టీడీపీ సిబ్బంది ఫిర్యాదుకు పోలీసులు ఏ విధంగా స్పందించారంటే..
tdp office receptionist informed to police about attack
ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరగబోతున్నదని ఆ పార్టీ సిబ్బంది ముందే గ్రహించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ ఎదుట ఉన్న ప్రాంతంలో కొంత మంది బైకులపై ఉన్నట్లు గుర్తించారు. పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు కూడా. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రజెంట్ నెట్టింట వైరలవుతోంది. సదరు ఫోన్ కాల్ సంభాషణలో టీడీపీ రిసెప్షన్ ఆఫీసులో పని చేసే కుమారస్వామి అనే వ్యక్తి తమ కార్యాలయం బయట చాలా మంది ఉన్నారని చెప్పాడు. పోలీస్ స్టేషన్‌లో ఉన్నటువంటి రవి అనే కానిస్టేబుల్ కుమారస్వామికి సంబంధించిన వివరాలు నమోదు చేసుకన్నాడు. కానీ, బయట హైవే రోడ్‌కు ఆనుకుని ఉండటం వల్ల ఎక్కువ మంది ఉండొచ్చని, బయట ఎంత మంది ఉన్నారనేది తమకు మళ్లీ ఇన్ఫామ్ చేయాలని చెప్పాడు.
tdp
ఈ లోపు తాను ఎస్‌ఐకి విషయం చెప్తానని అన్నాడు. అయితే, పక్కనే డీజీపీ కార్యాలయం ఉందని, తమ కార్యాలయంపై దాడి జరిగే సంకేతాలు కనబడుతున్నాయని టీడీపీ కార్యాలయ సిబ్బంది చెప్పకనే చెప్పాడు. అయితే, ఈ ఆడియో కాల్ సంభాషణను బట్టి పోలీసులు ఇంకా తగు విధంగా స్పందించాలేకపోయారే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కనుక ఫిర్యాదు అందిన వెంటనే టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లి ఉంటే వైసీపీ కార్యకర్తల దాడి జరగకుండా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
This website uses cookies.