Intinti Gruhalakshmi 23 Jan Today Episode : దివ్య సేఫ్.. కార్తీక్, చేతన్ జైలుకు.. లాస్యకు తులసి స్ట్రాంగ్ వార్నింగ్.. దీంతో లాస్య షాకింగ్ నిర్ణయం

Intinti Gruhalakshmi 23 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 849 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్లీజ్ నన్ను వదిలేయ్ అని దివ్య ఎంత బతిమిలాడినా కూడా కార్తీక్ అస్సలు వినడు. వద్దురా.. దివ్యను వదిలేద్దాం అంటే.. చేతన్ ను బయటికి వెళ్లి అక్కడ వెయిట్ చేయ్ అంటాడు. మరోవైపు రామారావు.. నందు దగ్గరికి వస్తాడు. ఏమైంది అంటే.. దివ్య గురించి అసలు విషయం చెబుతాడు. దీంతో ఒకసారి దివ్య ఫోన్ నెంబర్ చెప్పు. కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ట్రేస్ చేయమని చెబుతా అంటాడు రామారావు. దీంతో సరే అని నెంబర్ పంపిస్తాడు. ఆ తర్వాత ఇద్దరూ దివ్యను వెతకడానికి వెళ్తారు. మరోవైపు ప్రేమ్, తులసి ఇద్దరూ కలిసి దివ్య లొకేషన్ ను చెక్ చేస్తూ వెళ్తుంటారు. ఆమె లొకేషన్ దగ్గరికి వెళ్లగానే బయట ఉన్న చేతన్ చూస్తాడు. చేతన్ వాళ్లను చూసి భయపడి పారిపోబోతుండగా ప్రేమ్ పట్టుకుంటాడు.

intinti gruhalakshmi 23 january 2023 monday full episode

తులసి లోపలికి వెళ్తుంది. అప్పుడే దివ్యపై కార్తీక్ అఘాయిత్యం చేయబోతుంటాడు. వెనుక నుంచి అక్కడే ఉన్న ఒక వస్తువును తీసుకొని తల మీద కొడుతుంది. దివ్యను కాపాడుతుంది. ప్రేమ్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ కొడతాడు. ఇంతలో నందు, రామారావు కూడా వస్తారు. నందు కూడా వాళ్లను కొడతాడు. రామారావు చూస్తున్నావు ఏంటి.. వాళ్లను ఏదైనా చేయ్.. ఇక్కడే ఎన్ కౌంటర్ చేయ్ అంటాడు నందు. తొందరపడకు నందు. వాళ్ల గురించి నేను చూసుకుంటానులే అంటాడు రామారావు. దీంతో వద్దు సార్. మమ్మల్ని ఏం చేయకండి. మా మీద కేసు పెడితే మా జీవితం నాశనం అవుతుంది అంటూ బతిమిలాడుతారు. ప్లీజ్ మేడమ్.. మీ కాళ్లు పట్టుకుంటాం అన్నా కూడా తులసి వినదు. వాళ్ల మీద కేసు పెట్టి చట్టప్రకారం లోపల వేస్తాం అంటాడు రామారావు. దీంతో నా కూతురు పేరు బయటికి రాకూడదు అని చెప్పి దివ్యను ఇంటికి తీసుకెళ్తుంది తులసి.

మరోవైపు దివ్య కోసం అందరూ ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడి దయ వల్ల దివ్య మనకు దక్కింది అని అంటుంది అనసూయ. కానీ.. దివ్య మళ్లీ నార్మల్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది అని అంటుంది అంకిత.

ఇంతలో దివ్యను తీసుకొని ఇంటికి వస్తుంది తులసి. అస్సలు తులసిని వదలదు దివ్య. చాలా భయపడుతూ ఉంటుంది దివ్య. మామ్.. నువ్వు నన్ను వదిలి వెళ్లకు. మనం లోపలికి వెళ్దాం మామ్ అంటుంది దివ్య.

ఒకసారి దిష్టి తీస్తాను అన్నా కూడా ఎవరితో మాట్లాడదు దివ్య. గదిలోకి వెళ్దాం అంటుంది దివ్య. దీంతో తనను గదిలోకి తీసుకెళ్తుంది. పడుకో అమ్మ.. ఏం కాలేదు. ఊరుకో అంటుంది తులసి. ఏడవకు. ఏం కాలేదు. ధైర్యంగా ఉండు అంటుంది తులసి.

కాసేపు ప్రశాంతంగా పడుకో అంటుంది తులసి. దీంతో తప్పు చేశాను మామ్. నేను అబద్ధం చెప్పి అందరినీ బాధపెట్టాను. నన్ను కొట్టు మామ్. నన్న చంపేయ్ అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది దివ్య.

Intinti Gruhalakshmi 23 Jan Today Episode : మానసిక స్థైర్యంగా ఉండు అని దివ్యకు భరోసా ఇచ్చిన తులసి

దీంతో జరిగిందంతా ఒక పీడకలగా మరిచిపో అంటుంది తులసి. నా బిడ్డ ఎంత మంచిదో నాకు తెలుసు. ఎంత గొప్ప మనిషికి అయినా కొన్న బలహీనమైన క్షణాలు ఉంటాయి. అవి తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎంతో మానసిక స్థైర్యం ఉండాలి అంటుంది తులసి.

ఎక్కువ ఆలోచించకు. చేసిన తప్పును గుర్తు పెట్టుకుంటే అది ఎప్పుడూ మనిషిని వెంటాడి బాధపెడుతూనే ఉంటుంది. బాగా అలసిపోయావు. తర్వాత మాట్లాడుకుందాం. డ్రెస్ మార్చుకొని రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

తులసి బయటికి వస్తుంది. ఏమంటోంది అని అడుగుతాడు నందు. దీంతో బాధపడుతోంది అంటుంది తులసి. మీ అందరినీ  నేను కోరుకునేది ఒకటే. దివ్యకు తగిలిన గాయం మానడానికి చాలా సమయం పడుతుంది.

జరిగిన విషయం గురించి దయచేసి ఎవ్వరూ దివ్యతో డిస్కస్ చేయొద్దు. తను కోలుకునే అవకాశం ఇద్దాం. బాగా పొద్దు పోయింది. వెళ్లి పడుకోండి అంటుంది. అందరూ వెళ్లిపోయాక లాస్యను ఆపి తనకు క్లాస్ పీకుతుంది తులసి.

నువ్వు చేసింది చిన్న తప్పే కావచ్చు కానీ.. ఫలితం ఎంత దారుణంగా ఉందో చూశావా? నీ జీవితం నీ ఇష్టం. నాశనం చేసుకో. నాకు సంబంధం లేదు. కానీ.. నా పిల్లల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను. తాచుపాములా పడగ విప్పుతాను. దేవుడి దయవల్ల నా కూతురు క్షేమంగా బయటపడింది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదంటే ఈ తులసిలో మరో రూపాన్ని చూసి ఉండేదానివి.

ఇది నా ఆఖరి వార్నింగ్. ఇంకోసారి వార్నింగ్ లు ఉండవు. గుర్తు పెట్టుకో అని చెప్పి లాస్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. మరోవైపు డ్రెస్ మార్చుకొని తన రూమ్ లో ఒంటరిగా కూర్చొంటుంది దివ్య.

తనకు అన్నం తీసుకొచ్చి తినిపిస్తూ ఉంటుంది తులసి. తల్లి మనసులో భయం అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నించాలి. ఆ భయం మీకు అర్థం కావాలంటే మీరు తల్లిగా మారినప్పుడే అర్థం అవుతుంది.

లేదా ఇలాంటి సంఘటన జరిగినప్పుడే అర్థం అవుతుంది అని చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Kaleshwaram Project : కేసీఆర్ కు భారీ ఊరట..సీబీఐ విచారణకు హైకోర్టు బ్రేక్

Huge Relief for KCR : తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ…

11 hours ago

BSNL | బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి భారీ డేటా ఆఫర్లు .. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ!

BSNL | ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరోసారి ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రైవేట్…

12 hours ago

Pawan- Bunny | పవన్ కళ్యాణ్ – అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్‌కు బ్రేక్ పడే సమయం వచ్చిందా?

Pawan- Bunny |  ఇండియన్ సినిమా అభిమానుల మధ్య హీరోల గురించి వాదనలు, గొడవలు, ట్రోలింగ్‌లు కొత్త విషయం కాదు.…

13 hours ago

KCR Suspends Kavitha from BRS : బిఆర్ఎస్ నుండి కవిత అవుట్..కేసీఆర్ కీలక నిర్ణయం

KCR suspends daughter K Kavitha from BRS : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ బీఆర్ఎస్ పార్టీ కీలక…

14 hours ago

KCR | కాళేశ్వరం కేసులో కేసీఆర్‌, హరీష్ రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట

KCR | తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుతో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ నేత హరీష్ రావులకు తాత్కాలిక ఊరట…

14 hours ago

OG | ఓజీ ఒక్క టిక్కెట్ ధ‌ర రూ.5ల‌క్ష‌లా.. ప‌వ‌న్ క్రేజ్ ఇలా ఉంట‌ది మ‌రి..!

OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా…

15 hours ago

Pawan Kalyan | ప‌వన్ క‌ళ్యాణ్‌కి శుభాకాంక్ష‌ల వెల్లువ‌.. చిరు, మోదీ, బ‌న్నీ స్పెష‌ల్ విషెస్

Pawan Kalyan | నేడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు కావ‌డంతో సినీ, రాజ‌కీయ,…

16 hours ago

Turmeric | పసుపు నీటిలో ఆరోగ్య రహస్యాలు .. ప్రతిరోజూ పరగడుపున‌ తాగితే కలిగే అద్భుతమైన ప్రయోజనాలు!

Turmeric | మన వంటింట్లో నిత్యం కనిపించే పసుపు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఔషధగుణాలతో నిండి ఉంటుంది. పసుపులో ఉండే…

17 hours ago