
intinti gruhalakshmi 23 march 2022 full episode
Intinti Gruhalakshmi 23 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 587 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆటోను నడిపేందుకు బయలేదేరే ముందు పూజ చేస్తాడు ప్రేమ్. సొంత మనిషిలా చూసుకుంటూ నాకు ఇంత సాయం చేసినందుకు మీకు రుణపడి ఉంటాను అంటాడు ప్రేమ్. బాబురావు భార్య మాట్లాడుతుంటే తనకు తులసి మాట్లాడుతుంది. ప్రేమ్ బాబు.. ఇక ఆటో ఎక్కండి.. శృతమ్మ మీరు ఎదురు రండి అని చెబుతుంది అనసూయ. శృతి ఎదురు రాగానే ఆటో నడుపుతూ వెళ్తాడు ప్రేమ్.
intinti gruhalakshmi 23 march 2022 full episode
ఓ చోట ఆటో పెట్టుకొని కూర్చుంటాడు. మొదటి రోజు ఎలాగైనా మంచి బేరం వచ్చేలా చూడు స్వామీ అనుకుంటాడు. ఇంతలో రోడ్డు మీద తులసి, అనసూయ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఆటోను చూసి ఆటో అంటారు. ఏం చేయాలి అని అనుకొని తన కర్చీఫ్ ను ముఖానికి కట్టుకుంటాడు. ఎక్కడికి వెళ్లాలి అని అడుగుతాడు. మణికొండకు అని చెబుతారు. దీంతో సరే.. కూర్చోండి అంటాడు. ఆటో వెళ్తుండగా.. ప్రేమ్ గురించి మాట్లాడుకుంటారు అనసూయ, తులసి. మణికొండ రాగానే ఆటో దిగుతారు. ఎంతైంది అంటే 300 అని చెబుతాడు. దీంతో 300 ఇస్తుంది. అందులో ఓ నోటును కింద పడేసినట్టు చూసి దాన్ని తీసుకుంటూ తన కాళ్లకు నమస్కరిస్తాడు ప్రేమ్.
ఆ తర్వాత తన ముఖానికి ఉన్న మాస్క్ తీసి వెళ్లిపోతుండగా.. తులసి, అనసూయ ప్రేమ్ ను చూసి షాక్ అవుతారు. మరోవైపు అంకిత.. శృతికి కాల్ చేస్తుంది. నేను అభి.. రోజూ నీ గురించే మాట్లాడుకుంటున్నాం అంటుంది అంకిత. కాసేపు మాట్లాడుకొని ఫోన్ కట్ చేస్తుంది.
ఇంతలో ప్రేమ్ వస్తాడు. ఈరోజు సంపాదన.. పండగ చేసుకుందాం అంటాడు ప్రేమ్. దీంతో ఆ డబ్బును తీసుకొని నువ్వయితే మళ్లీ చీరలు కొంటావు అంటుంది. ఈరోజు అమ్మ కనిపించింది. నా మొదటి బోణీ తనే అంటాడు ప్రేమ్. అవునా.. ఏమన్నది.. అని అడుగుతుంది శృతి.
దీంతో ఏదేదో చెబుతాడు. తను నాతో మాట్లాడిందని అబద్ధం చెబుతాడు. అంటే.. ఇలా జరిగితే ఎంత బాగుండో కదా అనిపించింది అంటాడు ప్రేమ్. కానీ జరగలేదు అంటాడు. అమ్మ ఆటో అయితే ఎక్కింది కానీ.. నా ముఖం చూపించలేకపోయాను.. అంటాడు.
గుర్తు పట్టకుండా నా ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాను అంటాడు. ఇలాంటి పరిస్థితి ఏ కొడుకుకు రాకూడదు అంటాడు ప్రేమ్. మరోవైపు ప్రేమ్ ఆటో నడపడం చూసి నిన్ను ఇలా కాదురా చూడాలనుకుంది అని అనుకుంటుంది తులసి. నిన్ను ఇంట్లో నుంచి తరిమింది జీవితం విలువ తెలుసుకుంటావని అని అనుకుంటుంది.
కానీ.. నువ్వు చేస్తున్నది ఇదా.. ఇలా మొదటి మెట్టుకు జారుకుంటావా. ఇంట్లో నుంచి గెంటేసి తప్పు చేశానా అని అనుకుంటుంది తులసి. నిజంగా కష్టాల్లో ఉన్నావా అని అనుకుంటుంది. ఇంతలో తనకు ఫోన్ రావడంతో ఫోన్ తీసుకొని వస్తాడు పరందామయ్య.
దివ్య లెక్చరర్ కాల్ చేసి తను ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవడం లేదని చెబుతుంది. దీంతో దివ్యను పిలుస్తుంది తులసి. ఆన్ లైన్ క్లాసులు ఎందుకు అటెండ్ అవడం లేదు అని అడుగుతుంది తులసి. నాకు ఇష్టం లేదు అంటుంది దివ్య.
నా మీద కోపంగా ఉంటే నాతో మాట్లాడటం మానేయి.. కానీ క్లాసులకు అటెండ్ కాకపోవడం ఏంటి అని అడుగుతుంది. దీంతో క్లాస్ లకు అటెండ్ కాకపోవడం కాదు.. చివరకు చదువే మానేస్తా. నీ డబ్బులతో నేను క్లాసులకు వెళ్లను.. మా డాడీకి ఇప్పుడు డబ్బులు కట్టే పరిస్థితి లేదు అంటుంది.
మరోవైపు నందు కారు ఆగిపోతుంది. దీంతో క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తుంది లాస్య. ఈ టైమ్ లో క్యాబ్ దొరకడం కష్టమే అంటుంది. ఇంతలో ఆటో వస్తుంది. ఆటో అంటూ ఆపుతాడు నందు. అందులో నుంచి ప్రేమ్ దిగడాన్ని చూసి షాక్ అవుతాడు నందు.
వావ్.. క్యా సీన్ హై. కాబోయే రాక్ స్టార్ ఆటో నడుపుతూ కనిపించాడు. తనను కలుసుకోవాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలని గొప్పలు చెప్పారు. ఊహల్లో ఎగురుతుండేవాడివి.. చివరకు నేల మీదికి వచ్చావా ప్రేమ్ అంటుంది లాస్య. దీంతో నేను నా టార్గెట్ రీచ్ అవుతా.. కానీ దానికి కొంచెం సమయం పడుతుంది.
ఎప్పుడూ ఎదుటి వాళ్లను ఎగతాళి చేయడం కాదు.. జీవితంలో ఎదగడం నేర్చుకో అంటాడు నందు. నేను ఆటో నడుపుకోవడం మీకు అవమానంగా ఉంటే.. నేను మీ కొడుకును అని చెప్పుకోకండి.. మొహమాటానికి పోకుండా ఆటో ఎక్కండి.. అంటాడు ప్రేమ్.
దీంతో అక్కర్లేదు.. నీ పని నువ్వు చూసుకో అంటుంది లాస్య. దీంతో ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నేను వాడిని ఎందుకు ఇంట్లో నుంచి పంపించానో మీకు తెలుసు కదా మామయ్య అంటుంది తులసి. వాడు బాగుపడటం కోసం.. వాడికి నేను బలహీనం కాకూడదనే కదా నేను ఈ పని చేసింది అని పరందామయ్యతో అంటుంది.
ఆ మాటలు విన్న దివ్య.. మామ్ నన్ను క్షమించు అని వెళ్లి తన కాళ్ల మీద పడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Union Budget 2026 ": దేశ అభివృద్ధికి వెన్నెముక లాంటి వారు రైతులు. “జై జవాన్.. జై కిసాన్” అనే…
Redmi Note 15 Pro 5G : భారత India స్మార్ట్‌ఫోన్ Smart Phone మార్కెట్లో మరో హాట్ అప్డేట్కు…
pakistan : టీ20 వరల్డ్ కప్ india vs pakistan t20 world cup 2026 ప్రారంభానికి ఇంకా రెండు…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
This website uses cookies.