Home » Entertainment » Intinti Gruhalakshmi 24 August 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 24 Aug Today Episode : తులసి మీద అనుమానం పెంచుకున్న అనసూయ.. పరందామయ్యకు చెప్పడంతో ఇద్దరూ కలిసి షాకింగ్ నిర్ణయం

Authored By
Varun G
The Telugu News | Published on: August 24, 2022, 9:30 am
Advertisement

Intinti Gruhalakshmi 24 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 ఆగస్టు 2022, బుధవారం ఎపిసోడ్ 719 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్, అభి ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. మామ్ నాకు కూడా అమ్మే. నేను ఇప్పుడు ఆలోచించేది సొసైటీ గురించి. జనం అనుకునే నిందల గురించి అంటాడు అభి. మాట్లాడవేంటి నానమ్మ. నువ్వు కూడా మామ్ ను సపోర్ట్ చేస్తున్నావా? మామ్ చేసింది తప్పుగా అనిపించడం లేదా అని అంటాడు అభి. దీంతో అనసూయకు ఆ ఫోటోలే గుర్తొస్తాయి. మామ్ మీద, మన మీద జనం రాళ్లు వేస్తారా? వేయరా అంటాడు అభి. దీంతో ప్రేమ్.. అభి మాటలకు అడ్డు చెబుతాడు. ఎవరో ఫోటో తీసి ఆర్టికల్ రాశారని దాంట్లో ఆంటిని తప్పుపట్టడం ఎందుకు అని అంటుంది శృతి. అసలు నీ ఉద్దేశం ఏంటి.. ఆంటిని గడప దాటనీయొద్దా? అంటుంది శృతి.

Advertisement

intinti gruhalakshmi 24 august 2022 full episode

రోడ్డు మీదకు వెళ్లే ఏ ఆడది అయినా ఇలాంటి సమస్యలు ఫేస్ చేయాల్సిందే అన్నయ్య. ఆడవాళ్లు తమ కాళ్ల మీద నిలబడుతున్న ఈ రోజుల్లో ఇలాంటివి వస్తూనే ఉంటాయి అంటుంది దివ్య. ఇన్నాళ్లకు మీ అమ్మకు స్వేచ్ఛ దొరికింది. మీ అమ్మను సంతోషంగా ఉండనీయండి అంటాడు పరందామయ్య. దీంతో వాడి ఉద్దేశం ఏంటో కూడా అర్థం చేసుకోవాలి కదా అంటుంది అనసూయ. ఎవరి మీద అయినా విషం కక్కాలి అనుకుంటే సమాజం ముందు ఉంటుంది అంటుంది అనసూయ. కాలికి బురద అంటాక చెప్పులు వేసుకుంటే ఏంటి ఉపయోగం. ముందే అన్నీ చూసుకోవాలి కదా అని అభి అంటున్నాడు అంటుంది అనసూయ. నేను తులసిని నిందించడం లేదు.. కాళ్లకు సంకెళ్లు వేయాలని కాదు అంటుంది అనసూయ. నీ మాటల్లో క్లారిటీ లేదు నానమ్మ అంటుంది దివ్య.

Advertisement

తులసి మీద వచ్చిన ఆర్టికల్ తులసికి చూపించకండి అంటాడు పరందామయ్య. అలా ఎందుకు తాతయ్య. మమ్మీకి తెలియాలి కదా అంటాడు అభి. కానీ.. వద్దు తనకు చూపించవద్దు అని చెప్పి పరందామయ్య అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో తులసి వస్తుంది.

అందరూ అలా సీరియస్ గా ఉన్నారేంటి అని అడుగుతుంది తులసి. దీంతో మాట మార్చి చెబుతాడు పరందామయ్య. వైకుంఠపాళి ఆడుదాం అంటున్నాడు అభి అని చెబుతాడు పరందామయ్య. ఇంతలో సామ్రాట్ తులసి ఇంటికి వస్తాడు. తులసి గారు అంటాడు.

Advertisement

సామ్రాట్ ను చూసి అందరూ షాక్ అవుతారు. సామ్రాట్ గారు రండి అంటుంది తులసి. లోపలికి రండి అంటుంది తులసి. ఫోన్ పట్టుకొని వస్తాడు సామ్రాట్. మీదో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అంటాడు సామ్రాట్. మా ఇంట్లో ఏ విషయంలోనూ మా మధ్య దాపరికాలు, సీక్రెట్స్ ఉండవు సార్. ఏం మాట్లాడాలనుకున్నా మా ముందే మాట్లాడొచ్చు. మా మామ్ కూడా ఏం అనుకోదు అంటాడు అభి.

దీంతో సరే అని ఫోన్ తీసి ఒక్కసారి ఇది చదవండి అంటాడు సామ్రాట్. తన ప్రేయసితో వైజాగ్ బీచ్ లో సరసాలు అంటూ వచ్చిన ఆర్టికల్ అది. నా వల్లే ఇదంతా జరిగింది. నా వల్లే మీకు బ్యాడ్ నేమ్ అంటాడు సామ్రాట్. మీ మనసు ఎంతగా బాధపడి ఉంటుందో నేను తెలుసుకోగలను. ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను అంటాడు  సామ్రాట్.

దీంతో నిజంగా మీరు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారా అని అడుగుతుంది తులసి. నేనైతే అస్సలు పట్టించుకోను అంటుంది తులసి. దీంతో ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు. మంచి మనసుతో చూసేవాళ్లకు ఆకాశంలో చంద్రుడు అందంగా కనిపిస్తాడు.

ఏదో ఒకటి అని విమర్శించేవాళ్లకు చంద్రుడిలో మచ్చలు మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా చూసే చూపులో ఉంటుంది..అంటుంది తులసి. ఒకప్పుడు నేను ఇలాంటి వాటికి భయపడేదాన్ని. ఇప్పుడు కాదు అంటుంది తులసి. దీంతో అభి షాక్ అవుతాడు. నా వరకు నా జీవితం.. నా కుటుంబమే నాకు ముఖ్యం.

Advertisement

నా వాళ్లకు నా మీద నమ్మకం ఉన్నంత వరకు నేను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోను. మీరు కూడా పట్టించుకోవద్దు అంటుంది తులసి. దీంతో నా దృష్టిలో మీరు మరో నాలుగు మెట్లు ఎక్కారు తులసి గారు.. అని పొగుడుతాడు సామ్రాట్. మీరు ఇంత పాజిటివ్ గా ఉంటారని నేను అనుకోలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వస్తాను అని చెప్పి వెళ్తాడు సామ్రాట్.

ఇంతలో ఒక్క నిమిషం అని చెప్పి సామ్రాట్ తో పాటు వెళ్తుంది తులసి. ఇద్దరూ బయట నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకోవడం చూసి అనసూయకు భయం ఇంకా పెరుగుతుంది. మరోవైపు సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంటికి వెళ్లాక. ఏదో లోకంలో ఉన్న సామ్రాట్ ను చూసి బాబాయి షాక్ అవుతాడు.

Intinti Gruhalakshmi 24 Aug Today Episode : తులసిని పొగిడిన సామ్రాట్

వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నీలో చాలా తేడా వచ్చింది. నువ్వు చాలా మారిపోయావు అని అంటాడు బాబాయి. దీంతో అవును బాబాయి. నువ్వు అనుకుంటున్నది నిజమే అంటాడు సామ్రాట్. నీలో ఈ మార్పుకు కారణం ఏంటి అని అడుగుతాడు బాబాయి.

దీంతో తులసి గారు అంటాడు సామ్రాట్. స్త్రీని శక్తి స్వరూపిణి అంటారు. అలా ఎందుకు అంటారో నాకు ఇన్ని రోజులు తెలియలేదు. తులసి గారెతో ప్రయాణం చేశాక ఆ మాటకు అర్థం తెలిసింది. అందుకు కారణం.. జీవితంలో తనకు తగిలిన ఎదురు దెబ్బలు.. జీవితంలో తనకు వచ్చిన కష్టాలు అంటాడు సామ్రాట్.

Advertisement

మ్యూజిక్ స్కూల్ కోసం తను పడే తపన, హనీని లిఫ్ట్ లో కాపాడటం, ఇలా అన్ని విషయాల్లో తులసి గారు ఎంతో గొప్పగా కనిపించారు అంటాడు సామ్రాట్. తన పర్సనల్ లైఫ్ పోగొట్టుకొని కూడా తను జీవితంలో పోరాడటం చూస్తుంటే తనలో ఒక ఫైటర్ కనిపించింది.

డబ్బు, హోదా సంపాదించడమే జీవితం అనుకున్నాను. హ్యాపీగా ఉండటానికి అంతకుమించి ఇంకేం అవసరం లేదు అనుకున్నాను కానీ.. తులసి గారిని చూశాక తెలిసింది జీవితం అంటే ఏంటో అని అంటాడు సామ్రాట్. జీవితంలో తులసి గారు చాలా కోల్పోయారు కానీ.. ఆత్మాభిమానం మాత్రం కోల్పోలేదు.

డబ్బు కోసం ఎంతో కష్టపడుతున్నా ఎవరి ముందు చేయి చాపలేదు.. అంటాడు సామ్రాట్. మరోవైపు అనసూయ.. పరందామయ్యతో తులసి, సామ్రాట్ గురించి మాట్లాడుతుంది. తనేమీ చిన్నపిల్ల కాదు కదా అంటాడు పరందామయ్య. దీంతో చిన్నపిల్ల కాదు అదే నా భయం అంటుంది అనసూయ.

మన తులసి బంగారమే కానీ.. పంజరంలో ఉన్నంత వరకే పక్షి మనది. పంజరం తలుపులు తెరిస్తే ఆ పక్షి మీద ఆశ వదులుకోవాల్సిందే అంటుంది అనసూయ. ఒక బలహీనమైన క్షణం చాలు మనసు దారి తప్పడానికి అంటుంది అనసూయ. దీంతో పరందామయ్య షాక్ అవుతాడు.

వాడికి పాతికేళ్లు సేవ చేసి మోసపోయింది. చివరకు తనకు భర్త ఆదరణ కూడా లభించలేదు. ఎవడి వల్ల తులసి జీవితానికి నష్టం జరిగిందో మళ్లీ వాడి మాటే విని తులసికి అన్యాయం చేయాలనుకుంటున్నావా అని అంటాడు పరందామయ్య. దీంతో నేనేమీ నందు మాట వినడం లేదు అంటుంది అనసూయ.

తులసిని ఒక్కసారి చూడు. మనసులో ఎలాంటి కల్మషం లేని మనిషి. బయట అంత కష్టపడి కూడా ఇంటికి వచ్చి మన కోసం ఎంత చేస్తోంది. తనను ఎలా అనుమానించగలం అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి