Intinti Gruhalakshmi 24 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 588 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దివ్య ఆన్ లైన్ క్లాసెస్ కు అటెండ్ అవడం లేదని లెక్చరర్ అడగడంతో కొన్ని కారణాల వల్ల దివ్య ఆన్ లైన్ క్లాసెస్ వినడం లేదని చెబుతుంది. తప్పు దివ్య మీద పడకుండా చేస్తుంది తులసి. ఇంతలో పరందామయ్య వచ్చి.. దివ్య నీ మాట వింటుందా? దివ్య గురించి ఎందుకు బాధపడుతున్నావు. తనను రెండు రోజుల్లో ఆన్ లైన్ క్లాసుల కోసం ఎలా ఒప్పిస్తావు అని అంటాడు పరందామయ్య. ఇంతలో దివ్య అక్కడికి వచ్చి వాళ్ల మాటలను వింటుంది. వాడికి మంచి చేయబోయి చెడు చేస్తున్నాను. వాడి జీవితాన్ని దారిన పెట్టాలని దారి తప్పేలా చేస్తున్నానా అని అనిపిస్తోంది అంటుంది తులసి.
నా గురించి నా కష్టాల గురించి ఆలోచిస్తూ తన గురించి పట్టించుకోవడం లేదు. తన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. నేను వాడి బలహీనతగా మారాననే కదా.. వాడిని ఇంట్లో నుంచి తరిమేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్తే అయినా జీవితంలో ఎదుగుతాడు అనుకున్నా. ఎవరు ఏమన్నా.. గుండెను రాయిని చేసుకొని వాడిని బయటికి పంపించా అంటుంది తులసి. కానీ.. ఆటో నడుపుకొని జీవించడం ఏంటి అని బాధపడుతుంది. అవన్నీ విని.. మామ్ ను తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకుంటుంది దివ్య. నేను ఇప్పుడు వాడి మీద జాలి చూపిస్తే.. వాడి మనసులో లక్ష్యం చచ్చిపోతుంది. నా కొడుకు చేతగాని వాడు.. జీవితంలో ఓడిపోయాడు అని నేనే అందరికీ చెప్పినట్టు అవుతుంది. అదే జరిగితే తల్లిగా నేను.. కొడుకుగా వాడు ఓడిపోయినట్టే. ఇద్దరం తలదించుకునే పరిస్థితి వస్తుంది అంటుంది తులసి.
తీసుకురాను అంటావు.. అలా అని వదిలేయను అంటావు.. మరి ఏం చేస్తావమ్మా అంటాడు పరందామయ్య. నేనే చెడ్డదాన్ని. మా మామ్ ను తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకుంటుంది దివ్య. నా కొడుకును గెలిపించుకుంటాను. వాడు కోరుకున్న జీవితం వైపు అడుగులు పడేలా చేస్తాను అంటుంది.
అంతలోనే ఏడ్చుకుంటూ వచ్చి తన కాళ్లు పట్టుకుంటుంది దివ్య. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు అమ్మ అంటుంది. నువ్వేంటో తెలిసి కూడా కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాను. అనకూడని మాటలు మాట్లాడాను. దయ్యం పట్టినట్టు మాట్లాడాను. నా చెంపలు పగులగొట్టు అమ్మ అంటుంది దివ్య.
ప్రేమ్ అన్నయ్య మంచికోసమే చేస్తున్నానని నాకు ఒక్క మాట చెబితే చాలు కదా మామ్.. నేను ఇలా చేసే దాన్ని కాదు అంటుంది దివ్య. నా లక్ష్యాన్ని నెరవేరే వరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకు అంటుంది తులసి. దీంతో అలాగే మామ్.. ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను. నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను అంటుంది దివ్య.
కట్ చేస్తే మాధవికి ఫోన్ చేస్తుంది తులసి. ప్రేమ్ గురించి నేను అనుకున్నది వేరు.. జరిగేది వేరు.. అని మాధవితో చెబుతుంది. వాడిప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా.. బతుకు తెరువు కోసం ఆటో నడుపుతున్నాడు అంటుంది తులసి. నా కళ్లతో నేను చూశాను.. అంటుంది తులసి.
ప్రేమ్ అలా చేయడం నాకు నచ్చలేదు. వాడు తన లక్ష్యాన్ని మరిచిపోయాడు. వెళ్లి వాడికి నచ్చజెప్పు. తనకు ఇష్టమైన సంగీతంలో దారి వెతుక్కోమను. ఆలస్యం అయినా సరే.. దానికే కట్టుబడి ఉండమను. అప్పటి వరకు కావాల్సిన డబ్బు సాయం నువ్వు చేస్తా అని చెప్పు అంటుంది తులసి.
ఇంతలో మాధవి.. ప్రేమ్, శృతి దగ్గరికి వస్తుంది. మమ్మల్ని ఎవ్వరూ చూసి జాలి పడకూడదు అంటాడు ప్రేమ్. లైఫ్ లో నీ గోల్ ఏంటో మరిచిపోయావా అంటుంది మాధవి. ఒక్కసారి లక్ష్యం మనసులో నుంచి పక్కకు జరిగితే నువ్వు ఆ లక్ష్యాన్ని మరిచిపోతావు అంటుంది మాధవి.
మా అమ్మ కోరిక నేను కాళ్ల మీద నిలబడటం.. నాకు నేనుగా ఏదైనా సాధించడం.. అంటాడు ప్రేమ్. నేను నీ దగ్గర హెల్ప్ తీసుకోవాలనుకుంటే.. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టగానే నీ ఇంటికే వచ్చేవాడిని అంటాడు ప్రేమ్. దీంతో మాధవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత అసలు విషయం మాధవి.. తులసికి ఫోన్ చేసి చెబుతుంది. ఇలా అయితే వేస్ట్. నేనే డైరెక్ట్ గా మాట్లాడుతాను. వాడు దారి మార్చుకునేలా చేస్తాను అనుకుంటుంది తులసి. మరోవైపు లాస్య.. ప్రేమ్ గురించి ఆలోచిస్తుంది.
ఈ ఇంట్లో నీ మాటకు విలువ లేనప్పుడు.. నీకు విలువ లేనప్పుడు ఎందుకు ఈ ఇంట్లో ఉండటం. ఈ అవమానాలు నేను చూడలేను. నేను తట్టుకోలేను. అందుకే నేను వెళ్లిపోతున్నాను అంటూ నందుకు షాకిస్తుంది లాస్య. దీంతో వద్దు లాస్య.. ఆగు అంటాడు.
దీంతో కొన్ని రోజులు ఓపిక పట్టు అంటాడు. రేపు ఉదయం వరకు ఓపిక పడతాను. ఆ తర్వాత నువ్వు నా దారికి రాలేదంటే.. నేను నా దారి చూసుకుంటాను అని చెబుతుంది లాస్య. మరోవైపు తులసి ఇంట్లో హోలీ పండుగ వేడుకలు జరుగుతుంటాయి.
ఇంతలో దివ్యతో పాటు అభి, అంకిత, మాధవి అందరూ ప్రేమ్ ఇంటికి వెళ్లి అక్కడ ఘనంగా హోలీ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. ఈ విషయం తెలిసి అక్కడికి వెళ్లి తులసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.