
intinti gruhalakshmi 24 september 2022 full episode
Intinti Gruhalakshmi 24 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 సెప్టెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 746 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు ఇప్పుడు బయటికెళ్లి వేరే జాబ్ చేస్తే స్థితి ఉందా? అని లాస్య అడుగుతుంది నందును. మనం బయట గడ్డిపోచ కిందికి కూడా పనికిరాం. వాళ్లకు గులాంగిరీ కొట్టాల్సిందే. అందుకే మనకు తులసి చదువే ప్లస్ పాయింట్. తను ఏమాత్రం చదువుకోలేదు కాబట్టి తన వెంటే ఉండి తనకు సపోర్ట్ ఇచ్చినట్టుగా నటించి తను తప్పు చేసేలా చేద్దాం. అప్పుడు సామ్రాట్ తనను ఇంటికి పంపించేస్తాడు అని నందుతో చెబుతుంది లాస్య. మరోవైపు అభితో తులసి గురించి మాట్లాడుతారు ప్రేమ్, అంకిత, శృతి. జరిగిందేదో జరిగింది. అమ్మను తన పని చేసుకునిద్దాం అంటాడు ప్రేమ్. దీంతో నాకూ అమ్మే.. నాకూ అమ్మ మీద ప్రేమ ఉంది. కానీ.. మీరు అమ్మ గురించే ఆలోచిస్తున్నారు కానీ.. నాన్న గురించి ఎందుకు ఆలోచించడం లేదు అంటాడు అభి.
intinti gruhalakshmi 24 september 2022 full episode
కట్ చేస్తే తులసి లక్కీ, హనీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అందరూ వచ్చి మాకు కూడా తినిపించు అమ్మ అని అంటారు ప్రేమ్, అభి. దీంతో మీరేమైనా చిన్నపిల్లలా అని అడుగుతుంది హనీ. దీంతో అవును.. చిన్నపిల్లలమే అని అంటాడు ప్రేమ్. తర్వాత అందరికీ ఫుడ్ తినిపిస్తుంది తులసి. ఆ తర్వాత సామ్రాట్ చూసి సంబరపడతాడు. అందరూ ఇలా కలిసి ఉండటం చూసి సామ్రాట్ కు చాలా సంతోషం వేస్తుంది. తర్వాత డాక్టర్ వచ్చి హనీ చేయి కట్టు విప్పేస్తుంది. తనకు పూర్తిగా నయం అవుతుంది. దీంతో ఇక నేను ఏ ఆట ఆడటానికి అయినా రెడీ అంటుంది హనీ. ఇంకేంటి నువ్వు ఇక ఏ గేమ్ అయినా ఆడొచ్చు అంటుంది తులసి. కానీ.. నేను ఎవరితో ఆడాలి అని అంటుంది హనీ. ఎందుకు అని అంటుంది తులసి. దీంతో నేను బాగు అయితే మీరు అందరూ వెళ్లిపోతారు కదా అంటుంది హనీ. దీంతో తులసి షాక్ అవుతుంది.
దీంతో సామ్రాట్ ఆలోచించి మిస్టర్ నందు.. వెంటనే ప్రెస్ మీట్ అరేంజ్ చేయండి అని అంటాడు సామ్రాట్. దీంతో మళ్లీ మ్యూజిక్ స్కూల్ పనులు ప్రారంభిస్తే అయిపోతుంది కదా. దానికి మళ్లీ ప్రెస్ మీట్ ఎందుకు అంటుంది తులసి. నందు కూడా అదే అంటాడు. కానీ.. లాస్య మాత్రం ఎందుకు నందు.. సామ్రాట్ గారు ఇమేజ్ ఉన్న వ్యక్తి. పబ్లిక్ క్లారిటీ కోరుకుంటోంది కదా అని అంటుంది లాస్య.
దాని కంటే ముందు తులసి మెసేజ్ ను లీక్ చేసింది ఎవరు.. తులసి పేపర్ కు ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా చేసిందెవరో ముందు కనుక్కోండి అంటాడు పరందామయ్య. కానీ.. తులసి ఒప్పుకోదు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకొని ఏం చేస్తారు. దారిలో ముళ్లు గుచ్చకుంటే నా దారిన నేను వెళ్తాను తప్పితే ముళ్లును కాల్చి బూడిద చేయాలని అనుకోను. దాని వల్ల నా సమయమే వేస్ట్ అవుతుంది. కాకపోతే మరింత జాగ్రత్త పడతాను. మరోసారి ముల్లు గుచ్చుకోకుండా ఉంటాను అంటుంది తులసి.
దీంతో శెభాష్.. మీ థియరీ నాకు బాగా నచ్చింది అంటాడు సామ్రాట్. నా వరకు ప్రెస్ మీట్ అవసరమే అనిపిస్తోంది అంటాడు సామ్రాట్. ప్రెస్ మీట్ లో ఇక వాళ్లు రెచ్చిపోతారు చూడు అంటూ లాస్య నందుతో అంటుంది. ఇంతలో మరేదో ప్లాన్ చేస్తుంది లాస్య. ఇంటర్వ్యూ కోసం వచ్చిన మీడియా వాళ్లకు ఏదో ప్లాన్ చెబుతుంది. నేను చెప్పిన ప్రశ్నలు అడగాలని చెబుతుంది. దీంతో వాళ్లు ఓకే అంటారు.
అభితో సామ్రాట్ భార్య గురించి అతడిని అడిగేలా చేస్తుంది. తన భార్య గురించి చెబితేనే మా మామ్ మీతో పని చేస్తుంది. అసలు తన భార్య ఏమైంది. లేచిపోయిందా.. చనిపోయిందా… లేదా చంపేశారా అని చాలా దారుణంగా అడుగుతాడు అభి. దీంతో ఒక్కసారిగా సామ్రాట్ కూలబడిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.