intinti gruhalakshmi 25 february 2022 full episode
Intinti Gruhalakshmi 25 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 565 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సీఐకి కాల్ చేశాను.. ఆయన కాల్ గురించే ఆలోచిస్తున్నాను అని అంటాడు నందు. మరొకసారి నువ్వైన ఫోన్ చేయిరా అంటాడు. మనమే చేయడం మంచిది కాదేమో అంటాడు నందు. ఇంతలో సీఐ ఫోన్ చేస్తాడు. సారీ నందు.. నేను నీకు ఈ పని చేయలేకపోతున్నాను అంటాడు సీఐ. మీరు ఈ కేసు విషయంలో పట్టించుకోవద్దంటూ నాకు మెత్తగా వార్నింగ్ ఇచ్చాడు ఆ ఎస్ఐ అంటాడు సీఐ. దీంతో ఏం చేయాలో అర్థం కాదు నందుకు. ఇంట్లో వాళ్లు కూడా టెన్షన్ పడతారు. నిజంగా అభి తప్పు చేస్తే కోర్టులో ప్రవేశపెట్టాలి కానీ.. ఇలా చేయడం ఏంటి అంటుంది అంకిత.
intinti gruhalakshmi 25 february 2022 full episode
అభిని విడిపించడంలో మన ప్రయత్నం ఫలించలేదని తులసి ఆంటికి చెప్పాలి కదా అంటుంది శృతి. ఇప్పుడు చెప్పి కూడా ఏంటి లాభం.. అంటుంది లాస్య. నేను తప్పు చేశాను.. తులసి ఆంటితో పాటు అభిని వెతకడానికి నేను కూడా వెళ్లాల్సింది అంటుంది అంకిత. మరోవైపు తులసి దీక్ష దగ్గరికి మీడియా వాళ్లు వస్తారు. మీ అబ్బాయి.. మర్డర్ కేసులో తప్పించుకొని తిరుగుతున్నాడు కదా.. అని అడుగుతారు. లేదు.. ఎస్ఐ అరెస్ట్ చేసి నా కొడుకును కళ్లకు చూపించడం లేదు. నా కొడుకును కళ్లకు చూపించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.. అంటుంది తులసి. బయట టెంట్ దగ్గర మీడియా హడావుడి ఎక్కువ ఉంది సార్ అని కానిస్టేబుల్ వచ్చి చెబుతాడు ఎస్ఐకు. అయితే ఏం చేయమంటావు.. అంటాడు. నాకు ఏం ప్రాబ్లమ్ అవుతుందిరా. మనం అసలు అభిని అరెస్ట్ చేయలేదు కదా అంటాడు ఎస్ఐ.
ఈ రవీందర్ ఎప్పటికీ వెనకడుగు వేయడు.. ఆ అభి గాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకుంటాడు ఎస్ఐ. మరోవైపు నందు.. తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అనసూయ వస్తుంది. నందు నీతో ఒక విషయం మాట్లాడొచ్చా అని అడుగుతుంది.
అభి కనబడకుండా పోయాడని ఇంట్లో అందరం కంగారు పడుతున్నాం. తండ్రివి అయి ఉండి కూడా ఇంత తాపీగా ఎలా ఉండగలుగుతున్నావురా అంటుంది అనసూయ. ఇంట్లో కూర్చోవడం కాదు.. బయటికి వెళ్లు ఏదో ఒకటి చేయి అని చెబుతుంది అనసూయ.
అభి ఎక్కడున్నా… నిన్నే తలుచుకుంటూ ఉంటాడు. వెళ్లరా వెళ్లి వాడిని కాపాడు అంటుంది అనసూయ. తప్పు చేసిన వాడు ఎస్ఐ కాళ్లు పట్టుకోవాలి కానీ.. కాలర్ పట్టుకోవడం ఏంటి.. అందుకే ఆ ఎస్ఐ వాడిని కనిపించకుండా చేశాడు అంటాడు నందు.
మరోవైపు ఎస్ఐ.. తులసి దగ్గరికి వచ్చి అలసిపోయావా మదర్ ఇండియా అని అడుగుతాడు ఎస్ఐ. ఆడదానికి ఓపిక ఎక్కువ సార్ అంటుంది. మగాడికి పొగరు ఎక్కువ. అందులోనూ నాలాంటి మగాడికి అది ఇంకాస్త ఎక్కువ అంటాడు ఎస్ఐ.
మీడియా వాళ్లు నీ మొహం మీద మైకులు పెట్టేసరికి అది నీ గొప్పదనం అనుకోకు అంటాడు ఎస్ఐ. నా కొడుకు కోసం నేను ఇదంతా చేస్తున్నాను అంటుంది తులసి. శవం కనిపించినా చాలా అంటాడు. దీంతో షాక్ అవుతుంది తులసి. అంటే.. క్యాజువల్ గా చెబుతున్నాను అంటాడు ఎస్ఐ.
మీకొక ఆఫర్ ఇద్దామని అనుకుంటున్నాను సార్ అంటుంది తులసి. ఏంటి ఆ ఆఫర్ అంటుంది. ఇప్పుడు అభిని పట్టుకున్నానని చెప్పి తీసుకొని అరెస్ట్ చేయండి. నేను ఇక మీ జోలికి రాను అంటుంది తులసి. దీంతో నాకే ఆఫర్ ఇస్తున్నావా అంటాడు ఎస్ఐ.
చూడు మదర్ ఇండియా.. పెద్ద మనసుతో నువ్వు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చావు. నేను కూడా నీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. అందుకే.. అరగంటలో నువ్వు టెంట్ తీసేసి వెళ్లిపో. రెండు రోజుల్లో నీ అభిని మీడియా ముందు నిలబెడతా.. అంటాడు ఎస్ఐ.
దీంతో ఎస్ఐని నమ్మదు తులసి. దానికి రెండు రోజులు ఎందుకు.. ఇప్పుడే తీసుకురండి అంటుంది. నీకు భయపడి నేను ఈ ఆఫర్ ఇవ్వడం లేదు. నమ్మకం నీది.. ఆఫర్ నాది.. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అంటాడు ఎస్ఐ. దీంతో నేను మిమ్మల్ని నమ్మడం కన్నా.. నన్ను నేను నమ్ముకోవడమే బెస్ట్ అని అంటుంది తులసి.
మరోవైపు తులసికి అంకిత ఫోన్ చేస్తుంది. అంకిత.. నాకు ఈ రాత్రికి రావడం కుదరదు. ఇంట్లో వాళ్లకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అంటుంది. అభి గురించి దిగులు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకో అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
BC Reservation Bill : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ లకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అమోధించిన అనంతరం ఆ…
Komati Reddy Venkat Reddy : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా కృష్ణా, గోదావరి జలాల అంశంపై…
Ys Jagan : తాడేపల్లిలో Tadepalli జరిగిన విలేకరుల సమావేశంలో YCP వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్…
Wife Husband : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లా వైరా బాద్షాపూర్ గ్రామంలో జరిగిన దారుణ సంఘటన తల్లడిల్లేలా చేసింది. ఆసిఫ్ అనే…
Nani : వెండితెరపై తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని, వరుస విజయాలతో…
Post Offices : తెలంగాణ Telangana Congress Govt కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన "మహాలక్ష్మి పథకం" maha laxmi scheme…
Smartphone : ప్రీమియం ఫీచర్లతో ఆకట్టుకున్న మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు farmers ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన Pradhan…
This website uses cookies.