intinti gruhalakshmi 25 october 2021 full episode
Intinti Gruhalakshmi 25 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 అక్టోబర్ 2021, సోమవారం ఎపిసోడ్ 459 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాములమ్మ మాత్రం అసలు ప్రేమ్, శృతికి ఫస్ట్ నైట్ జరిగిందో లేదో అని టెన్షన్ పడుతుంది. రాములమ్మ కాస్త అనుమానంగా చూస్తుంది కానీ.. ఎలాగోలా ప్రేమ్, శృతి ఆ విషయాన్ని కప్పి పుచ్చుతారు. తమకు ఫస్ట్ నైట్ జరిగిందని ఎలాగోలా తులసి, రాములమ్మ నమ్మేలా చేస్తారు. దీంతో తులసి కూడా నిజంగానే వాళ్ల మధ్య ఫస్ట్ నైట్ జరిగి ఉంటుందని సంతోష పడుతుంది.
intinti gruhalakshmi 25 october 2021 full episode
కట్ చేస్తే.. నందు తెగ ఆలోచిస్తుంటాడు. తులసిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక తలపట్టకొని కూర్చుంటాడు. ఇంతలో తులసి అతడి దగ్గరికి వస్తుంది. తులసి.. నువ్వు వచ్చే టైమ్ కు నేను, లాస్య దగ్గరగా ఉన్నాం కదా.. అని అనేసరికి.. అవన్నీ నాకెందుకు చెబుతున్నారు. నువ్వు, నేను విడాకులు తీసుకున్నాం. నీ జీవితం నీది. నా జీవితం నాది.. ముందు అవన్నీ మరిచిపోయి ఉద్యోగులకు కబురుపంపండి అంటుంది తులసి.
ఏంటి.. ప్రాజెక్ట్ నిజంగానే స్టార్ట్ చేస్తున్నావా? అని అడుగుతాడు నందు. అవును.. చేస్తున్నాం అంటుంది తులసి. అది సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్.. అంత ఈజీగా ఎలా చేసేస్తావు.. అంటాడు నందు. నేను చేస్తాను. చేసి చూపిస్తాను. ఏదైనా పని పూర్తి చేయడానికి కావాల్సింది అనుభవం కాదు క్రమశిక్షణ అంటూ నందుకు క్లాస్ పీకుతుంది తులసి. అయినా మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకున్నారు. మీమీద మీకే నమ్మకం లేదు. లాస్య చెప్పిన మాటలను గుడ్డిగా నమ్ముతారు అంటూ నందుతో అంటుంది తులసి.
మరోవైపు.. బల్లిని చూసి శృతి ప్రేమ్ మీద పడుతుంది. బల్లి పోయిందా? అని అంటుంది. బల్లి లేదు ఏది లేదు.. అంటాడు. వామ్మో.. ప్రేమ్ నువ్వు మామూలోడివి కాదు అంటుంది. అదంతా ఓకే కానీ.. ఇందాక రాములమ్మ బెడ్ షీట్ గురించి అడిగేసరికి నాకు చాలా భయం వేసింది తెలుసా? అంటుంది శృతి.
స్నానం చేశాక శృతి వెంటనే దేవుడికి పూజ చేసి దూపం వేస్తుంది. దూపం వేసి ఇల్లంతా పొగ అలుముకునేసరికి అంకిత చూసి ఎవరు ఈ పొగ పెట్టింది అంటూ సీరియస్ అవుతుంది. వెంటనే పరమానందయ్య అక్కడికి వచ్చి నువ్వు ఏనాడైనా ఉదయం లేచి పూజ చేస్తే కదా అని అంకితపై సీరియస్ అవుతాడు పరమానందయ్య.
మరోవైపు ఉద్యోగులకు ఫోన్ చేసి రేపటి నుంచి ఆఫీసుకు రమ్మని నందుకు తులసి చెప్పడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తాడు నందు. వెంటనే ఉద్యోగులకు ఫోన్ చేసి ఆఫీసుకు రావాలని చెబుతాడు. మేనేజర్ కు ఫోన్ చేస్తాడు. దీంతో ఇప్పటికే మూడు నెలల జీతాలు ఇవ్వలేదు.. ఎలా వస్తారు సార్ అంటూ మేనేజర్ చెబుతాడు. ఎలాగైనా ఒప్పించు.. ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మన కష్టాలు తీరుతాయని చెబుతాడు.
intinti gruhalakshmi 25 october 2021 full episode
ఇంతలో లాస్య వచ్చి… పెండింగ్ శాలరీలు ఎలా ఇస్తావు.. కంపెనీ మెయిన్ టెనెన్స్ ఎలా? అంటూ నందును ప్రశ్నిస్తుంది లాస్య. దీంతో అదంతా నా తలనొప్పి కాదు.. అవన్నీ తులసి చూసుకుంటుంది అని చెబుతాడు నందు.
దేవికి పూజ చేశాక.. తులసి చేపట్టిన పని పూర్తవ్వాలని కోరుకుంటుంది శృతి. ఆ విషయం అందరి ముందు తులసికి చెబుతుంది. ఆ తర్వాత ఉద్యోగులు రేపటి నుంచి వస్తున్నారా? అని నందును అడుగుతుంది తులసి. నువ్వు చాలా తొందరపడుతున్నావు. నువ్వు బావిలో కప్పలాంటి దానివి అందులోనే ఉండు.. సముద్రంలోకి రావాలని చూడకు. సుడిగుండాలు ఉంటాయంటూ లాస్య.. తులసికి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.