Intinti Gruhalakshmi 26 Aug Today Episode : మ్యూజిక్ స్కూల్ భూమి పూజ జరగకుండా లాస్య, అభి ప్లాన్.. పూజ ఆగిపోవడంతో తులసి షాక్.. తులసికి అవమానం

Intinti Gruhalakshmi 26 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 721 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కల నీది.. ఆశయం నీది. ఇందులో నాదేం లేదు అంటాడు సామ్రాట్. దీంతో డబ్బు ఇచ్చేది మీరే కదా అంటుంది తులసి. ఇక నీ ఆశయం తీరే సమయం వచ్చింది అని పరందామయ్య తులసితో చెబుతాడు. మామయ్య ఇప్పుడే నేను ఇంటికి వెళ్లి మన వాళ్లందరికీ ఈ గుడ్ న్యూస్ చెబుతా అంటుంది తులసి. దీంతో కాస్త గుర్రాన్ని కట్టేయమ్మా. ముందు నువ్వు స్వీట్ రెడీ చేసి మా నోరు తీపి చేశాక కానీ వెళ్లకూడదు అంటాడు బాబాయి. దీంతో నేనొప్పుకోను అంటాడు సామ్రాట్. స్వీట్ నేను కూడా తయారు చేస్తాను. ఇద్దరం కలిసి తయారు చేద్దాం అంటాడు సామ్రాట్. కట్ చేస్తే నందు, లాస్య ఇద్దరూ తులసి ఇంటికి వస్తారు. అక్కడ అనసూయ ఉంటుంది. అత్తయ్య బిజీగా ఉన్నట్టున్నారు. మనల్ని చూడటానికి కూడా టైమ్ లేదు అంటుంది లాస్య. దీంతో పాడైపోయిన ఆకులు.. ఎన్నిసార్లు తెంపినా సిగ్గులేకుండా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి అని అంటుంది.

intinti gruhalakshmi 26 august 2022 full episode

నువ్వేంటి నాన్న ఇంత పొద్దున్నే వచ్చావు. అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా? నన్ను చూడాలని వచ్చావా అంటుంది అనసూయ. దీంతో ఆఫీసు పని మీద తులసి కోసం వచ్చాను అంటాడు నందు. దీంతో తులసి ఇంట్లో లేదు అంటుంది అనసూయ. ఎక్కడికి వెళ్లింది అని అడుగుతాడు నందు. కట్టుకున్న మొగుడు అడగొచ్చు కానీ.. వదిలేసిన మొగుడు ఇవన్నీ అడగాల్సిన అవసరం లేదు అంటుంది అనసూయ. ఇంతలో అభి వచ్చి… ఏదో ఫోన్ వస్తే కంగారుగా వెళ్లింది డాడ్ అంటాడు అభి. లోపలికి రా డాడ్.. కూర్చోండి అంటాడు. దీంతో లాస్య, నందు ఇంట్లోకి వెళ్లి కూర్చొంటారు. ఇంత ఉదయమే తులసి ఎక్కడికి వెళ్లింది. సామ్రాట్ తో లాంగ్ డ్రైవ్ కు వెళ్లిందేమో అంటుంది లాస్య. ఇప్పుడు మనకు ఆ విషయాలు ఎందుకు. వచ్చిన పని చూసుకొని వెళ్దాం అంటాడు నందు. మరోవైపు తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి స్వీట్ తయారు చేయడం ప్రారంభిస్తారు.

స్వీట్ చేయడం పూర్తయ్యాక తులసి ఇంటికి వెళ్తుంది. ఇంట్లో నందు, లాస్యను చూసి షాక్ అవుతుంది తులసి. ఇంత ఉదయమే ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది లాస్య. దీంతో ఆమె వెళ్లలేదు. నేను అక్కడికి వెళ్లి తులసికి ఫోన్ చేసి రమ్మన్నాను. అందుకే తను వచ్చింది అంటాడు పరందామయ్య.

దీంతో నువ్వు సామ్రాట్ గారి ఇంటికి ఎందుకు వెళ్లారు నాన్న అంటాడు నందు. దీంతో నీకు అనవసరం. నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. మేము మంచి మూడ్ లో ఉన్నాం. దాన్ని చెడగొట్టకు అని ఒక ప్లేట్ తీసుకొని ఇంట్లో వాళ్లు ఎక్కడున్నా హాల్ లోకి రావాలి అని డప్పు కొడతాడు పరందామయ్య.

ఇంతలో అందరూ వస్తారు. ఏంటి తాతయ్య అంటారు. ఒక శుభవార్త చెప్పాలని అందరినీ పిలిచాను అంటాడు. నీ నోటితో నువ్వే చెప్పమ్మా అంటాడు పరందామయ్య. దీంతో అత్తయ్య నేను కలలు కన్న మ్యూజిక్ స్కూల్ కు రేపే శ్రీకారం చుట్టబోతున్నాం. రేపే భూమి పూజ జరగబోతోంది అని కార్డును అనసూయకు చూపిస్తుంది తులసి.

Intinti Gruhalakshmi 26 Aug Today Episode : సామ్రాట్ పేరు, నీ పేరు చూస్తే శుభలేఖగానే ఉంది అన్న లాస్య

అత్తయ్య కార్డులో నా పేరు కూడా వేశారు చూడండి అని చూపిస్తుంది తులసి. లాస్య, నందు ఆ పేరు చూసి షాక్ అవుతుంది. నీ పేరు, సామ్రాట్ పేరు పక్కపక్కన చూస్తుంటే నిజంగా ఇది శుభలేఖ లాగానే ఉంది అంటుంది లాస్య. అభి ఆ కార్డును చూసి షాక్ అవుతాడు.

ఏంటమ్మా ఇది నీ పేరు ఉందని మురిసిపోతున్నావు కానీ.. ఇలా ఆయన పేరును వేయించడం ఏంటి అంటాడు అభి. సంస్కారం ఉన్న మనిషేనా అంటాడు అభి. సమస్యలు లేని చోట సమస్యలు క్రియేట్ చేయకు అని ప్రేమ్ అభితో అంటాడు. దీంతో అభి అన్నదాంట్లో తప్పేముంది అంటుంది లాస్య.

తులసికి అనసూయ సపోర్ట్ ఇస్తుంది. నాకైతే ఇందులో ఎలాంటి తప్పు కనిపించడం లేదు అంటుంది. ఆ భూమి పూజ ఏదో ఆయన్నే చేసుకోనివ్వు. మనకు సంబంధం లేదు. మనం ఎవ్వరం వెళ్లడం లేదు అంటాడు అభి. దీంతో నాకు నచ్చినట్టు, నాకు న్యాయం అని అనిపించినట్టు నడుచుకుంటాను అంటుంది తులసి.

అభి ఎంత చెప్పినా తులసి వినదు. పరువు గురించి నీకు నాకంటే ఎక్కువ తెలుసా? మామయ్య ఇటు రండి అని చెప్పి.. పరందామయ్య, అనసూయకు కార్డు ఇస్తుంది. మనం అందరం రేపు భూమి పూజకు వెళ్తున్నాం అని చెబుతుంది. నందు, లాస్యకు కోపం వస్తుంది.

అభికి కోపం వచ్చి ఆ కార్డును చింపేస్తాడు. చింపి కిందపడేస్తాడు. దీంతో పరందామయ్యకు కోపం వస్తుంది. ఒరేయ్ అభి అంటాడు. మామయ్య వాడిని ఏం అనకండి. తప్పు వాడిది కాదు.. వాడి మనసు విరిచిన వాళ్లది. ఈ అమ్మేంటో వాడే నెమ్మదిగా తెలుసుకుంటాడు అంటుంది తులసి.

కట్ చేస్తే సామ్రాట్, తన బాబాయి స్వీట్ తింటూ ఉంటారు. సూపర్ గా ఉంది బాబాయి అంటాడు. ఇదే స్వీట్ మనం షాపు నుంచి కూడా తెచ్చుకుంటాం కదా. మరి ఆ స్వీట్ ఎందుకు ఇంత టేస్ట్ ఉండదు అంటాడు సామ్రాట్. దీంతో అది తులసి చేసిన స్వీట్ కాదు కదా అంటాడు బాబాయి.

ఇంకోసారి తులసిని పిలిచి స్వీట్ చేయిద్దాం అంటాడు సామ్రాట్. దీంతో పెళ్లి చేసుకొని ఒక ఇల్లాలును ఈ ఇంటికి తీసుకొస్తా అని మాత్రం చెప్పవా అంటాడు బాబాయి. తులసి లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటావా.. చెప్పరా అంటాడు బాబాయి.

దీంతో అది అనుకున్నంత ఈజీ కాదు బాబాయి అంటాడు. బాధ్యత నాది అంటాడు బాబాయి. దీంతో సరే అంటాడు సామ్రాట్. మరోవైపు తులసి తనకు తానే ధైర్యం చెప్పుకుంటుంది. నీ కళ్లలో కనిపించాల్సింది కన్నీళ్లు కాదు ఆత్మస్థైర్యం. అర్థమయిందా అని అనుకుంటుంది. తనను చూసి దివ్య భయపడుతుంది.

భూమి పూజ మంచిగా జరగాలని తులసి కోటకు తెల్లవారగానే పూజ చేస్తుంది తులసి. ఇంతలో అభికి లాస్య ఫోన్ చేసి భూమి పూజ జరగకూడదు.. నువ్వు ఇలా చేయ్ అని చెప్పి అభికి ఏదో ప్లాన్ చెబుతుంది లాస్య. దీంతో భూమి పూజ ఆగిపోతుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

9 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

10 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

11 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

13 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

13 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

14 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

15 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

16 hours ago