Intinti Gruhalakshmi 26 March Today Episode : నువ్వు దేనికీ పనికిరావని ప్రేమ్ తో అన్న తులసి.. ఇంట్లో నుంచి నందు, లాస్య బయటకు.. నందుతో పరందామయ్య, అనసూయ వెళ్లిపోతారా?

Intinti Gruhalakshmi 26 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 590 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రేమ్ ఇంట్లో సంబురంగా హోలీ వేడుకలు జరుగుతూ ఉంటాయి. అభి, అంకిత, దివ్య.. ముగ్గురూ ప్రేమ్ ఇంటికి వెళ్లి హోలి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. అందరూ సంతోషంగా హోలీ ఆడుతున్న సమయంలో మాధవిని తీసుకొని తులసి అక్కడికి వస్తుంది. దీంతో తులసిని చూసి అందరూ షాక్ అవుతారు. ప్రేమ్ మాత్రం సంతోషిస్తాడు. అమ్మా.. నువ్వు వస్తావని అస్సలు ఊహించలేదు అంటాడు.

intinti gruhalakshmi 26 march 2022 full episode

తనకు రంగు పూయబోతాడు ప్రేమ్. దీంతో ఆ రంగును కిందికి తోసేస్తుంది తులసి. దీంతో అందరూ షాక్ అవుతారు. వాళ్లు మోసం చేసింది నిన్ను కాదురా నన్ను. ఫ్రెండ్స్ తో హోలీ ఆడటానికి వెళ్తున్నామన్నారు. ఆ ఫ్రెండ్ వి నువ్వేనని.. నాకు ఇక్కడికి వచ్చేదాకా తెలియలేదు అంటుంది తులసి. మామ్.. అంటూ దివ్య ఏదో చెప్పబోగా నోర్మూయ్ అంటుంది తులసి. పాపం.. నిజంగానే ప్రేమ్ మీద అందరూ బాధతో ఉన్నారు అని అనుకొని.. ఈ ఒక్క రోజు అయినా వాడిని తీసుకెళ్దామని వచ్చాను కానీ.. ఇక్కడికి వచ్చాక తెలిసింది మీరు నా కళ్లు కప్పి ఎలా మాయ చేస్తున్నారో అంటుంది తులసి.

అందరూ కలిసి నా మనసును చంపేశారు అంటుంది తులసి. అలా అనకు అంటుంది మాధవి. అమ్మకిచ్చిన మాటను గాలికి వదిలేసి.. దారి తప్పి బతుకుతూ వీడు నా మనసును చంపేశాడు. అసలు నీకు చెప్పిందేంటి.. నువ్వు చేస్తుందేంటి. జీవితం అంటే అమ్మ కొంగు పట్టుకొని తిరగడం కాదు.. నలుగురు చెప్పుకునేలా ఎదగాలి అంటుంది తులసి.

పెద్ద హీరోలా ఇంట్లో నాన్నను ఎదిరిస్తావు. గడప దాటితే బతకడం చేతకాదు. తండ్రిని ఎదిరించిన వాడివి.. తండ్రి కంటే గొప్ప స్థాయిలో ఎదిగి చూపించాలి. అప్పుడు నేను నమ్ముతా అంటుంది తులసి. ఒక విధంగా నీ జీవితం ముగిసిపోయినట్టే అంటుంది తులసి.

ఇంట్లో నుంచి తరిమేశాను కాబట్టి.. నీకు ఆ ఇంటికి సంబంధం లేదు అనుకుంటున్నావా? నీకు అలాంటి అనుమానమే వస్తే.. ఇంకోసారి నీ జోలికి రాను.. నా జోలికి రావద్దని చెప్పు. నాకు ఒక్కడే కొడుకు అని అనుకుంటాను అంటూ చెప్పుకొస్తుంది తులసి.

Intinti Gruhalakshmi 26 March Today Episode : తల్లిగానే నేను ఓడిపోవడం కాదు.. చచ్చిపోయాను అని ప్రేమ్ తో అన్న తులసి

అమ్మ.. అలా అనకమ్మా. నాకు నువ్వు కావాలమ్మా అంటాడు ప్రేమ్. కానీ.. నాకు ఇలాంటి కొడుకు అక్కర్లేదు అంటుంది తులసి. సిగ్గుండాలి అంటుంది. అమ్మ వద్దనుకున్నందుకు కన్నీళ్లు పెట్టుకోవడం కాదు.. అనుకున్నది సాధించనందుకు కన్నీళ్లు పెట్టుకోవాలి అంటుంది.

నువ్వు మాత్రమే ఓడిపోలేదు.. తల్లిగా నేను కూడా ఓడిపోయాను. ఓడిపోవడం కాదు.. చచ్చిపోయాను అంటుంది తులసి. అక్కడి నుంచి ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది తులసి. దీంతో ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. అక్కడే కుప్పకూలిపోతాడు.

ఆ తర్వాత ప్రేమ్ ను అన్ని మాటలు అన్నందుకు మాధవి.. తులసిపై కోప్పడుతుంది. ఆటో నడపకపోతే.. ఎలా బతుకుతారు అంటుంది మాధవి. నా మాట విను.. ఇప్పటికైనా మళ్లీ వాడి దగ్గరికి వెళ్లి మాట్లాడుదాం అంటుంది మాధవి.. కానీ.. మాధవి మాట వినదు తులసి.

కట్ చేస్తే.. ప్రేమ్ దగ్గరికి వెళ్లి వచ్చాను అని పరందామయ్యకు చెబుతుంది తులసి. వాడి బతుకేదో వాడు బతుకుతున్నాడు కదా అంటాడు పరందామయ్య. దీంతో వాడి బతుకు వాడు బతకడం కాదు నాకు కావాల్సింది.. నేను కోరుకున్నది బతకడం.. నేను గర్వపడేలా బతకడం అంటుంది.

వాడు బాధపడేలా చెప్పాను.. ఇంకోసారి ఈ అమ్మ ముఖం చూడకూడదు అని చెప్పేలా ద్వేషించేలా చెప్పాను.. అంటుంది తులసి. ఒక రాక్షసిలా నేను ప్రవర్తించాను.. అంటుంది తులసి. వాడి మనసు బాధపెట్టావు.. రేపు ఎదిగి గొప్ప వాడు అయ్యాక అన్నీ మరిచిపోతాడు.. అమ్మ విలువ తెలుసుకుంటాడమ్మా అంటాడు పరందామయ్య.

అనవసరంగా మనసు పాడు చేసుకోకు అంటాడు. మరోవైపు నందు వచ్చి ఇక్కడ మా మనసు కూడా బాగోలేదు.. ఎవరికి చెప్పుకోవాలి అంటాడు నందు. కనీసం మా బాధ చెప్పుకోవాలన్నా ఇంట్లో వాళ్లకు చెప్పుకుందామన్నా.. టైమ్ తీసుకోవాల్సి వస్తోంది అంటాడు.

మేము ఈ ఇల్లు వదిలి వెళ్లిపోదాం అనుకుంటున్నాం అంటాడు నందు. ఏంటి అని అంటాడు పరందామయ్య. మీకు అంత కష్టం ఏం వచ్చింది అంటాడు. దీంతో కష్టం కాదు.. బాధ్యత తెలవాల్సిన సమయం వచ్చింది అంటాడు. ఈ ఇంటి పెద్దగా ఉండే అధికారం మాత్రమే కాదు.. తన పిల్లల మీద కూడా అధికారం లేకుండా నందును చేశారు అంటుంది లాస్య.

ఎవరు చెప్పినా మేము ఆగం.. ఇది మా ఫైనల్ నిర్ణయం. అంతే కాదు.. అమ్మానాన్నలను కూడా మాతో పాటే తీసుకెళ్తున్నాం అంటాడు నందు. దీంతో ఆ విషయం అడగాల్సింది తులసిని కాదు.. నన్ను అంటాడు పరందామయ్య.

ఈ విషయంలో తులసి నిర్ణయంతో పనిలేదు. మా మనసుకు నచ్చినట్టు మేము నిర్ణయాలు తీసుకుంటాం. మీతో రావడం మాకు ఇష్టం లేదు అంటాడు పరందామయ్య. దీంతో మేము తీసుకెళ్తాం.. అంటుంది లాస్య. మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు అంటాడు నందు.

నాన్నను నువ్వైనా ఒప్పించు అని తులసితో అంటాడు నందు. కానీ.. నేను ఒప్పించను అంటుంది. దీంతో కన్నవాళ్లను వదిలేసి తన స్వార్థం తాను చూసుకున్నాడు అని  సమాజంలో ముద్ర వేయించుకోనా అంటాడు నందు. దీంతో తానే ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధం అవుతుంది తులసి.

అదే విషయాన్ని పరందామయ్యకు చెబుతుంది. దీంతో నందుతో మేము వెళ్లిపోవాలి అంతే కదా.. మేమే వెళ్లిపోతాం. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు అంటాడు పరందామయ్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

43 seconds ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

1 hour ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

2 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

3 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

12 hours ago

Special Song | పవన్ కళ్యాణ్ ‘OG’ స్పెషల్ సాంగ్ మిస్సింగ్.. నేహా శెట్టి సాంగ్ ఎడిటింగ్ లో తీసేశారా?

Special Song | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చిత్రం ‘OG (They Call Him…

13 hours ago

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఏర్పాట్లు .. త్వరలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం

Revanth Reddy | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. హైకోర్టు తాజా తీర్పు…

15 hours ago

Pawan Kalyan | ‘ఓజీ’ ప్రీమియర్ షోలో హంగామా.. థియేటర్ స్క్రీన్ చింపివేత, షో రద్దు

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ (They Call Him OG)’…

17 hours ago