intinti gruhalakshmi 3 may 2022 full episode
Intinti Gruhalakshmi 3 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మే 2022, మంగళవారం ఎపిసోడ్ 622 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి వస్తుంది తులసి. ఇంటికి వచ్చి.. తను, తన ఫ్రెండ్ ప్రవళిక ఇద్దరూ కలిసి చేసిన హంగామాను పరందామయ్య, అనసూయ, దివ్యకు చెబుతుంది తులసి. తను సంతోషంగా ఉండటం చూసి అందరూ షాక్ అవుతారు. మీ ఫ్రెండ్ కు మా అందరి తరుపున థాంక్స్ చెప్పమ్మా? మేము చేయలేని పనులను తను చేసింది అంటూ పరందామయ్య చెబుతాడు. మరోవైపు వాళ్లు ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను దివ్యకు చూపిస్తుంది. ఆ ఫోటోలను వెంటనే ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది దివ్య.
intinti gruhalakshmi 3 may 2022 full episode
ఫోన్ చెక్ చేస్తూ ఆ ఫోటోలను లాస్య తన ఫోన్ లో చూస్తుంది. వాటిని చూసి షాక్ అవుతుంది. ఇంతలో నందు వస్తాడు. అబ్బబ్బ.. హీరోయిన్ గారు స్టెప్పులు కూడా అంటుంది. ఒకసారి ఇలా రండి.. మీకు ఒకటి చూపిస్తా అంటుంది. నీ మాజీ భార్య బరితెగింపు ఏ లేవల్ లో ఉందో చూపిద్దామని పిలిచాను.. చూడు అంటుంది లాస్య. ఆ ఫోటోలను చూసి నందుకు తెగ కోపం వస్తుంది. పార్కుల్లో వాకింగ్స్, కుర్రవాళ్లతో డ్యాన్సులు, పానీపూరీలు.. అంటుంది. ఫ్యాక్టరీ వదులుకుంది. తను ఎలా బతుకుతుందో అని అన్నావు కదా. అన్నీ వదిలేసిన దేశదిమ్మరిలా ఎలా బరితెగించి తిరుగుతోందో చూడు అంటుంది లాస్య.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని అడుగుతాడు నందు. దీంతో మీ అమ్మానాన్నకు ఫోన్ చేసి తనను కంట్రోల్ లో పెట్టుకోమను అంటుంది. లేదంటే పబ్బుకు వెళ్దాం పదా అని అడుగుతుంది. మరోవైపు నందు ఫ్రెండ్ ఫోన్ చేసి.. నిన్ను వదిలేశాక మీ ఆవిడ చాలా ఇంప్రూవ్ అయిందిరా. ఇంతలోనే అంత మార్పు ఎలా వచ్చింది అని అడుగుతాడు. చిరాకు వచ్చి ఫోన్ పెట్టేస్తాడు నందు.
మరోవైపు తులసి తను ఎంజాయ్ చేసిన విషయాలను మరోసారి గుర్తు తెచ్చుకొని తెగ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడే ఉన్న గులాబీ చెట్టు దగ్గరికి వెళ్లి ఆ గులాబీ చెట్టుకు తన ఆనందాలను అన్నింటినీ పంచుకుంటుంది. నాకోసం నేను బతకడంలో ఉన్న ఆనందం నాకు తెలిసేలా ప్రవళిక చేసింది. ఇక నుంచి నేను ఇలాగే ఉంటాను. ఇలాగే నవ్వుతూ కనిపిస్తాను. నీతో నవ్వుతూ మాట్లాడుతాను అంటుంది.
మరోవైపు శృతికి ఇంకా జ్వరం తగ్గకపోవడంతో తనే దగ్గరుండి సపర్యలు చేస్తాడు ప్రేమ్. తనే వండి అన్నం తినిపిస్తాడు. తనను బయటికి తీసుకొచ్చి వరండాలో కూర్చోబెడతాడు ప్రేమ్. తర్వాత తనకు ట్యాబ్లెట్లు వేస్తాడు. తనను దగ్గరుండి ప్రేమ్ ఎంతో ప్రేమతో సపర్యలు చేయడంతో శృతి చాలా సంతోషిస్తుంది.
నా కోసం నువ్వు ఇంతలా సపర్యలు చేయడం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. నేను ఎంత అదృష్టవంతురాలినో అర్థం అవుతోంది అంటుంది శృతి. నువ్వు లేకపోతే నేను లేను శృతి అంటాడు ప్రేమ్. ఆడదాని మనసు.. సముద్రం లోతు తెలుసుకోవడం ఎవ్వరి వల్ల అయ్యే పని కాదు అంటారు. కానీ.. ఆ అదృష్టం నాకు ఇచ్చావు. ఆడదాని మనసు ఇంత గొప్పగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నిన్ను భర్తగా పొందినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అంటుంది శృతి.
ఈ మెచ్యూరిటీకి కారణం మా అమ్మే. తన నుంచే ఇవన్నీ నేను నేర్చుకున్నాను అంటాడు ప్రేమ్. జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా ఉండకూడదో చెప్పడానికి జీవితానుభవాలే మనకు దారి చూపుతాయి అంటాడు ప్రేమ్. ఒక్క రోజు కాదు.. ఒక్క నెల కాదు.. ఒక్క సంవత్సరం కాదు.. 20 సంవత్సరాలకు పైగా మా అమ్మ మా నాన్నతో నరకయాతన పడింది.. అంటాడు.
మా అమ్మ చిన్న చిన్న ఆనందాలు కూడా కోల్పోయింది. నా భర్త నన్ను దూరంగా ఊటీకో తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆప్యాయంగా నన్ను దగ్గరికి తీసుకుంటే చాలు అని తపించిపోయేది.. అని చెప్పి ఏడుస్తాడు ప్రేమ్. ఇవే మా అమ్మ కోరికలు.. ఇవే మా అమ్మ ఆశలు అంటాడు ప్రేమ్.
ఏ ఒక్క కోరిక తీర్చలేదు మా నాన్న. కానీ.. ముగ్గురు పిల్లలను కన్నాడు. చాటుగా కూర్చొని మా అమ్మ ఏడ్చేది. కానీ.. నేను తనను ఓదార్చలేకపోయాను. అందుకే మా నాన్న మీద నాకు ద్వేషం. అప్పుడే డిసైడ్ అయ్యాను. ఎప్పటికీ మా అమ్మను ఒంటరిగా వదిలిపెట్టకూడదు అని. కానీ.. మా అమ్మే నన్ను దూరంగా తరిమేసింది అంటాడు ప్రేమ్.
మా అమ్మను ఒంటరిదాన్ని చేయకూడదు అనుకున్నాను కానీ.. నన్నే ఒంటరిదాన్ని చేసింది అంటాడు ప్రేమ్. తల్లి బాధను అంత దగ్గరగా చూసిన ఏ కొడుకూ.. కట్టుకున్న భార్యను బాధపెట్టడు అని శృతితో చెబుతాడు ప్రేమ్. నేను చేస్తున్నది కూడా అదే అంటాడు.
మీ తల్లీకొడుకులను దేవుడు సాధ్యమైనంత త్వరగా కలుపుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది అంటుంది శృతి. కట్ చేస్తే.. ప్రవళిక పార్కులో ఉంటుంది. తులసి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.