Home » Entertainment » Intinti Gruhalakshmi 30 August 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 30 Aug Today Episode : నందు తులసి భర్త అని తెలిసి సామ్రాట్ షాకింగ్ నిర్ణయం.. మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటాడా? తులసి ఏం చేస్తుంది?

Authored By
Varun G
The Telugu News | Updated on: August 30, 2022, 9:08 am
Advertisement

Intinti Gruhalakshmi 30 Aug Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 724 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ మగాడు ఎవరో తెలుసుకోవచ్చా మేడమ్ అని ఓ రిపోర్టర్ తులసిని అడుగుతాడు. దీంతో తులసి షాక్ అవుతుంది. నందు, లాస్య కూడా షాక్ అవుతారు. అడుగుతున్నారు కదా చెప్పమ్మా అంటాడు బాబాయి. దీంతో చెబుతాను.. తప్పకుండా చెబుతాను కానీ.. ఇప్పుడు కాదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను అంటుంది తులసి. సమయం వచ్చినప్పుడు అంటే ఎప్పుడు మేడమ్ అంటుంది మరో రిపోర్టర్. నేను ఎవరెస్ట్ శిఖరం ఇప్పుడే ఎక్కడం మొదలు పెట్టాను. మొత్తం పైకి చేరాక.. జెండా పాతాక అప్పుడు చెబుతాను అంటుంది తులసి. నువ్వు అక్కడిదాకా పోతే కదా.. అని మనసులో అనుకుంటుంది లాస్య. నా జీవితం ఇక ఆగిపోయిందేమో అని అనుకుంటున్న సమయంలో సామ్రాట్ గారు నాకు దేవుడిలా ఆశ్రయం ఇచ్చారు అంటుంది తులసి.

Advertisement

intinti gruhalakshmi 30 august 2022 full episode

దీంతో తులసి గారు మీరు చెప్పాల్సింది నా గురించి కాదు.. మ్యూజిక్ స్కూల్ గురించి అంటాడు సామ్రాట్. దీంతో రాముడి గురించి చెప్పకుండా రామాయణం పూర్తి కాదు. ఇది కూడా అంతే అంటుంది తులసి. నాలుగు మైకుల ముందు కూర్చొని మహారాణిలా పోజులు కొడుతోంది అని నందుతో అంటుంది లాస్య. ఈ అభి ఏమయ్యాడు… ఇంకా రాలేదు అని అనుకుంటుంది లాస్య. ఇంతలో శృతి.. సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది. అతడిని కలుస్తుంది. మిమ్మల్ని నేను అంటూ ఏదో అడగబోతుంది. ప్రశ్నించడం కాదు. అడగడం కూడా కాదు. ఒక విషయం గురించి మీ మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అంటుంది శృతి. దీంతో చెప్పండి.. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని అంటాడు సామ్రాట్. మీ మనసులో ఏ ఉద్దేశం పెట్టుకొని మా ఆంటీని ఇంత హెల్ప్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తుంది శృతి.

Advertisement

మీరు మా ఆంటీని ఇష్టపడుతున్నారా? అని డైరెక్ట్ గా అడుగుతుంది శృతి. ప్రశ్న ఎవరిదైనా.. అనుమానాలు ఎవరివైనా.. సమాధానం చెప్పడం నా బాధ్యత. అవును.. నేను తులసి గారిని ఇష్టపడుతున్నాను అంటాడు సామ్రాట్. సామ్రాట్ గారు అంటుంది. ఆత్మాభిమానమే బలంగా, తలెత్తుకునే మహిళగా తులసి గారిని నేను ఇష్టపడుతున్నాను అంటాడు సామ్రాట్.

పెద్దగా చదువుకోకపోయినా అది ఎదగడానికి అడ్డు కాదని.. తోటి మహిళలకు ఆదర్శంగా ఉన్న తులసి గారిని నేను ఇష్టపడుతున్నాను. నన్ను మనిషిగా మార్చిన తులసి గారి గొప్పదనాన్ని నేను ఇష్టపడుతున్నాను. అది తప్పా అంటాడు సామ్రాట్.

Advertisement

Intinti Gruhalakshmi 30 Aug Today Episode : తులసి గారు కేవలం బిజినెస్ పార్టనర్ మాత్రమే అని చెప్పిన సామ్రాట్

నీ భయం నాకు అర్థం అయింది. క్లారిటీగా చెబుతున్నాను విను. తులసి గారు కేవలం నా బిజినెస్ పార్ట్ నర్ మాత్రమే. తనకు నేను సపోర్ట్ గా ఉన్నాను తప్పితే నా మనసులో ఎలాంటి ఉద్దేశం లేదు.. అని చెప్పేస్తాడు సామ్రాట్. తులసి గారి క్యారెక్టర్ చాలా గొప్పది. దయచేసి తనను అవమానించకండి అంటాడు సామ్రాట్.

తర్వాత ప్రెస్ మీట్ అయిపోతుంది. అందరూ భోజనాలు చేస్తుంటారు. భోజనాలు చేసే వాళ్లు.. అందరూ తులసి, సామ్రాట్ గురించే మాట్లాడుకుంటారు రిపోర్టర్స్. వాళ్లు మాట్లాడుకునే మాటలు నందు, లాస్య వింటారు. తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి పూజ చేస్తుంటారు.

మరోవైపు బైక్ మీద అభి కోపంగా వస్తుంటాడు. ఇద్దరూ కలిసి భార్యాభర్తల్లా పూజ చేయడం చూసి నందు, లాస్యకు కోపం వస్తుంది. సామ్రాట్, తులసి ఇద్దరూ ఎర్రటి నీళ్లలో చేతులు పెట్టి తెల్లకాగితం మీద పెడతారు. పూజారి చేతుల్లో ఉన్న కాగితం ఎగిరిపోయి నందు మీద పడుతుంది.

దీంతో నందు వైట్ షర్ట్ కాస్త ఎర్రగా అవుతుంది. తర్వాత ఆ పేపర్ ను పూజారి తీసుకొని కింద పెడతాడు. పూర్ణాహుతిని అగ్నిలో వేసి నమస్కారం చేస్తారు సామ్రాట్, తులసి. పూజ ముగిసింది అని చెబుతాడు పంతులు. కోపంతో మరోవైపు అభి వస్తుంటాడు.

Advertisement

ఇంతలో కోపంగా వచ్చిన అభి.. చప్పట్లు కొడతాడు. వావ్ అంటాడు. అతడిని చూసి అందరూ షాక్ అవుతారు. వ్యాపార భాగస్వామ్యం అంటే భార్యాభర్తల బంధం లాంటిదని పూజారి అనడంతో కోపంతో రగిలిపోతాడు అభి. ఇది ఏ వేదంలో ఉందో.. ఏ శాస్త్రంలో ఉందో కొంచెం చెబుతారా పంతులు గారు అంటాడు అభి.

అభి నువ్వు ఇక్కడ నోరు ఎత్తడానికి వీలు లేదు అంటాడు పరందామయ్య. దీంతో నేను అతిథిగా రాలేదు. మామ్ కు కొడుకుగా వచ్చాను అంటాడు. ఆ తర్వాత దీపక్ కూడా కోపంతో ఇదంతా మీ నాన్న చేయిస్తున్నాడు అంటాడు. దీంతో నందునే తులసి భర్త అని సామ్రాట్ కు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి