Intinti Gruhalakshmi 30 June Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 672 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. లాస్య, భాగ్య ఇద్దరూ కలిసి గాయత్రి ఇంటికి వెళ్తారు. తను పేపర్ చదువుతూ ఉంటుంది. ఎక్కడో జరుగుతున్న విషయాలను పేపర్ లో చదువుతున్నావు కానీ.. నీ సొంత మనుషులకు ఏం జరుగుతోందో మాత్రం నువ్వు తెలుసుకోవా అంటుంది లాస్య. ఇద్దరూ కలిసి తనకు అర్థం అయి అర్థం కానట్టుగా మాట్లాడుతారు. గాయత్రికి అసలు విషయం ఏంటో అర్థం కాదు. అక్కడ తులసి.. కూతురు డబ్బును కోన్ ఐస్ క్రీమ్ లా నాకేస్తున్నా గాయత్రి పట్టించుకోదా అని అంటుంది లాస్య. అక్కడ తులసి డైనోసార్ ను మించిపోతోంది. అంకితను తన గుప్పిట్లో పెట్టేసుకుంటోంది.. అంటుంది లాస్య. అంకితను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తను లోన్ తీసుకున్న 20 లక్షలకు షూరిటీ పెట్టించుకుంది తులసి అంటుంది లాస్య.
దీంతో గాయత్రి షాక్ అవుతుంది. షూరిటీ సంతకం అంటే.. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని చెప్పడం అంటుంది లాస్య. దీంతో వామ్మో అంటుంది భాగ్య. ఒకవేళ తులసి లోన్ డబ్బులు కట్టకపోతే.. ఆ డబ్బులు అంకిత కట్టాల్సిందే కదా అంటుంది లాస్య. దీంతో నో.. నేను అలా చేయనీయను అంటుంది గాయత్రి. ఇద్దరూ కలిసి గాయత్రిని రెచ్చగొట్టడంతో ఇప్పుడే తులసి ఇంటికి వెళ్తాను అంటుంది గాయత్రి. మరోవైపు తులసికి తను షూరిటీ సంతకం పెట్టిందని తెలిస్తే ఏం చేయాలి అని అనుకుంటారు పరందామయ్య, అనసూయ, అంకిత. మనం వేసే అడుగు గురించి ఆలోచిస్తాం కానీ.. తులసి మాత్రం నాలుగు అడుగులు ముందే వేసి ఆలోచిస్తుంది అంటాడు పరందామయ్య. ఇంతలో వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు చేసుకొని తీసుకొస్తుంది తులసి. తినండి అంటుంది. దీంతో అందరూ తింటారు.
సూపర్ టేస్ట్ ఆంటి.. అంటుంది అంకిత. ఇంతలో అక్కడికి వచ్చిన గాయత్రి.. ఉంటుంది ఉంటుంది.. టేస్ట్ గానే ఉంటుంది అంటుంది గాయత్రి. నువ్వు తింటున్న మిరపకాయ బజ్జీ ఖరీదు 20 లక్షలు అంటుంది. మీరు కూడా టేస్ట్ చేద్దురు కానీ.. రండి అంటుంది దివ్య.
దీంతో నాకు అవసరం లేదు అంటుంది. నేను తులసిని నిలదీయడానికి వచ్చాను అంటుంది గాయత్రి. నీ ఆరాటం తప్పితే నీతో నిలదీయుంచుకునే తప్పు నేనుప్పుడూ చేయను గాయత్రి. ఆవేశం తగ్గించుకో అంటుంది తులసి. దీంతో ఆంటి మీరు లోపలికి వెళ్లండి. అమ్మతో నేను మాట్లాడుతాను అంటుంది అంకిత.
దీంతో ఎందుకు మీ ఆంటికి నోటి మాటలు రావా అంటుంది గాయత్రి. ఎంతకు తెగించకపోతే ఇంత పబ్లిక్ గా అబద్ధం ఆడుతావు తులసి అంటుంది గాయత్రి. అబద్ధం ఏంటి.. నేనేం అబద్ధం ఆడాను చెప్పు గాయత్రి అంటుంది. దీంతో నా కూతురు డబ్బు అవసరం లేదు అంటూనే.. నీ బ్యాంక్ కు సంబంధించిన లోన్ కోసం అంకితతో ఎందుకు షూరిటీ సంతకం పెట్టించుకున్నావు అంటుంది గాయత్రి.
దీంతో నాకు ఆ అవసరం లేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను అంటుంది తులసి. దీంతో ఆంటి ఆగు అంటుంది తులసి. దీంతో మీ అమ్మ చెప్పిందే నిజమా అంటుంది తులసి. దీంతో వాళ్లు వచ్చి పోలీస్ కంప్లయింట్ ఇస్తామంటే షూరిటీ సంతకం పెట్టాను ఆంటి అంటుంది అంకిత.
అంత రియాక్షన్ అవసరం లేదు తులసి. అంకితకు షూరిటీ ఇచ్చే తప్పని పరిస్థితిని ఇరికించావు. ఎలాగూ నువ్వు బ్యాంక్ కు డబ్బు కట్టలేవు. షూరిటీ సంతకం పెట్టింది కాబట్టి.. తనే కట్టాల్సి వస్తుంది. చాలా బాగా ప్లాన్ చేశావు అంటుంది గాయత్రి. దీంతో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు అంకిత సంతకం పెట్టిన విషయం అస్సలు తెలియదు అంటుంది తులసి.
తను పెద్ద మనసుతో షూరిటీ సంతకాన్ని నాకు బిక్షగా వేసి ఉంటుంది అంటుంది తులసి. చాలా గొప్ప పని చేశావు అంకిత. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా ప్రాణం ఉండగా అంకితకు నా లోన్ తీర్చే అవకాశం రానివ్వను అంటుంది. ఒకవేళ అంకిత ఆ డబ్బులు కట్టాల్సి వస్తే అని అడుగుతుంది గాయత్రి.
దీంతో అప్పుడు నీ దగ్గరికే అంకితను పంపించేస్తాను అంటుంది తులసి. దీంతో ఇప్పటికైనా మాట మీద నిలబడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది గాయత్రి. నువ్వు ఆ నిజాన్ని నా దగ్గర దాచడమే నా గుండెను నలిపేస్తోంది అంటుంది తులసి. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అంటుంది తులసి.
రేపు నా కొడుకు అభి కూడా వచ్చి ఇలాగే నిలదీస్తాడు. నాకు చెప్పిందేంటి.. నువ్వు చేసిందేంటి అని నన్ను నిలదీస్తాడు. అప్పుడు నేను ఏం సమాధానం చెప్పగలను చెప్పు అంటుంది తులసి. మీ అందరికీ తెలిసినా కూడా అంకిత సంతకం చేసిన విషయం నాకు చెప్పలేదా అంటుంది తులసి.
కట్ చేస్తే.. రంజిత్ ఫోన్ కాల్ లిస్ట్ ను సంపాదిస్తుంది అంకిత. ఆ విషయం తులసికి చెబుతుంది. ఆ రంజిత్ మీకు కాల్ చేసే ప్రతి సారీ ముందు లాస్య ఆంటికి ఫోన్ చేశాడు. మిమ్మల్ని కలిసి వెళ్లిన ప్రతి సారి కూడా లాస్య ఆంటికి ఫోన్ చేశాడు అంటుంది అంకిత. అంటే.. ఆ రంజిత్ లాస్య తాలుకు మనిషి అనేదే కదా అర్థం అంటుంది తులసి.
అవును.. అంటుంది అంకిత. అంటే.. ఆ 20 లక్షల మాయం వెనుక లాస్య ఉన్నట్టే కదా అంటుంది తులసి. ఇప్పుడు చూడు ఆ లాస్యను ఎలా ఆడిస్తానో అంటుంది తులసి. మరోవైపు తనకు కంపెనీ అమ్మే ఫ్రెండ్ తో కలిసి నందు, లాస్య పార్టీ చేసుకుంటారు.
ఇంతలో తులసి.. లాస్యకు ఫోన్ చేస్తుంది. దీంతో ఫోన్ లిఫ్ట్ చేసి అక్కడే పెడుతుంది లాస్య. ఇంతలో మందు తాగిన మత్తులో నేను ఒకరి గురించి చెప్పాలనుకుంటున్నా అంటాడు నందు. దీంతో ఎవరు వాళ్లు అంటుంది భాగ్య. తులసి అక్కా అంటుంది. ఛీ మంచి మూడ్ లో ఉన్నప్పుడు తన గురించి ఎందుకు అంటాడు నందు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.