Intinti Gruhalakshmi 30 March Today Episode : అనాథాశ్రమంలో పరందామయ్య, అనసూయ.. ప్రేమ్ వాళ్లను చూస్తాడా? తులసి, మాధవికి పరందామయ్య కనపిస్తాడా?

Intinti Gruhalakshmi 30 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 593 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుందాం అంటుంది తులసి. దీంతో వాళ్లు దొరకరు ఎందుకంటే.. వాళ్లను నువ్వే దాచావు అంటుంది లాస్య. నేనెందుకు దాస్తాను అంటుంది తులసి. ఎందుకంటే మాతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంటాడు నందు. మొత్తానికి పరందామయ్య, అనసూయ విషయంలో కూడా తులసిని కార్నర్ చేస్తారు నందు, లాస్య. నాకు మా అమ్మానాన్నలు కావాలి… అని అరుస్తాడు నందు. పిచ్చోడిలా తులసి మాటలు నమ్మావు కదా. ఇప్పుడు ఏమంటావు.. రోగం కుదిరిందా.. ఎవరేంటో అర్థం అయిందా అని నందును రెచ్చగొడుతుంది లాస్య.

intinti gruhalakshmi 30 march 2022 full episode

ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. ఇది తులసి కుట్ర. ఇక్కడి నుంచి నేను మా అమ్మానాన్నలతోనే కదులుతాను.. అంటాడు నందు. దీంతో అత్తయ్య, మామయ్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను అంటుంది తులసి. మరోవైపు ప్రేమ్.. జరిగిన విషయం తన ఫ్రెండ్స్ కు చెబుతాడు. ఎందుకురా నాకు ఇలా జరుగుతోంది అని అంటాడు. దీంతో మొన్ననే కదా ఆటో నడపడం స్టార్ట్ చేశావు అంటారు ఫ్రెండ్స్. దీంతో తన తల్లి చెప్పిన విషయాలను చెబుతాడు ప్రేమ్. ఇంతలో ప్రేమ్ కు ఫోన్ వస్తుంది. దివ్య ఫోన్ చేస్తుంది. నాన్నమ్మ, తాతయ్య వాళ్లు లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు అని చెబుతుంది దివ్య.

దీంతో నువ్వేం టెన్షన్ పడకు.. నేను వెతికి తీసుకొస్తా అని చెబుతాడు. తన ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెతికించమని చెబుతాడు. మరోవైపు మాధవికి ఫోన్ చేసి.. అక్కడికి అత్తయ్య, మామయ్య వచ్చారా అని అడుగుతుంది. దీంతో రాలేదు అని చెబుతుంది.

నేనూ వస్తాను.. వాళ్లను కలిసి వెతుకుదాం అంటుంది మాధవి. ఇద్దరూ కలిసి రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు. మరోవైపు పరందామయ్య, తులసి.. ఇద్దరూ బ్యాగు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్లు ఏడుస్తూ వెళ్తుంటారు.

నడవడం కష్టంగా ఉంది అంటుంది అనసూయ. ఆ నందు గాడితో వెళ్లడం కంటే ఈ కష్టాన్ని భరించడమే నయం అంటుంది అనసూయ. తులసికి కూడా రోడ్డు మీద తిరిగి తిరిగి కళ్లు తిరుగుతాయి. దీంతో ఒక చోట కూర్చుంటారు. వాళ్లను పరందామయ్య, అనసూయ చూస్తారు.

Intinti Gruhalakshmi 30 March Today Episode : పరందామయ్య, అనసూయను చూసిన తులసి

తులసి కూడా వాళ్లను చూసి పరిగెడుతుంది. కానీ.. వాళ్లు దొరక్కుండా తప్పించుకుంటారు. తులసి మనల్ని చూసిందంటే.. మళ్లీ నందు దగ్గరికి పంపిస్తారు అనుకొని వెళ్లి దాచుకుంటారు. దీంతో మామయ్య, అత్తయ్య.. నేను మిమ్మల్ని చూశాను అంటుంది తులసి.

ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కున్నారు నాకు తెలుసు. దయచేసి బయటికి రండి మామయ్య అంటుంది తులసి. మీకు దండం పెడతాను.. బయటికి రండి మామయ్య. మీరు మీ అబ్బాయితో వెళ్లక్కర్లేదు. మాతోనే ఉందురు కానీ.. నా మాట విని బయటికి రండి అత్తయ్య అంటుంది తులసి.

పాపం ఏడుస్తుంది వెళ్దాం పదండి అంటుంది అనసూయ కానీ.. వద్దు అంటాడు పరందామయ్య. మరోవైపు ప్రేమ్ కూడా తన తాతయ్య, నానమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. ఓ వృద్ధాశ్రమానికి వెళ్తాడు. అప్పుడే అదే సమయానికి అక్కడికి పరందామయ్య, అనసూయ వస్తారు.

కానీ.. ప్రేమ్ వాళ్లను చూడడు. మరోవైపు పరందామయ్య ఆశ్రమానికి వెళ్లి మేము అనాథలం అని చెబుతాడు. కానీ.. ప్రేమ్ వాళ్ల ఫోటోను చూపించేసరికి.. మీరు అనాథలు కాదు.. అబద్ధాలు చెబుతున్నారు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

3 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

4 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

6 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

6 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

7 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

8 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

9 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

10 hours ago