Intinti Gruhalakshmi 4 Feb Today Episode : అంకితను అనసూయ, తులసి మీదికి రెచ్చగొట్టిన లాస్య.. తులసి ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేసిన గాయత్రి.. ఇంతలో మరో ట్విస్ట్

Intinti Gruhalakshmi 4 Feb Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 ఫిబ్రవరి 2022, శుక్రవారం ఎపిసోడ్ 547 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాతయ్యకు చపాతీలు చేసి పెట్టవా అని అంకితను అడుగుతుంది అనసూయ. దీంతో సరే అమ్మమ్మ నేను చేసి పెడతాను అంటుంది అంకిత. పక్కనే ఉన్న లాస్య.. తనను బుట్టలో వేసుకోవడం కోసం.. నువ్వు ఇప్పుడు వచ్చావు కాబట్టి నిన్ను అడిగారు. నువ్వు లేకపోతే ఏం చేసేవాళ్లు అని అంటుంది లాస్య. బయటి నుంచి తెచ్చుకునేవాళ్లు కదా అంటుంది. ఏది ఏమైనా మీ తాతయ్యకు తులసి చేతి వంట తప్పించి ఇంకొకరి వంట తినడం తెలియదు కదా అంటుంది. దీంతో అంకిత లాస్య ట్రాప్ లో పడిపోతుంది. అక్కడి నుంచి వెళ్లి చపాతీలు చేసి పరందామయ్య, అనసూయకు తీసుకొచ్చి పెడుతుంది.

intinti gruhalakshmi 4 february 2022 full episode

చపాతీలు చూసి షాక్ అవుతాడు పరందామయ్య. చపాతీలు మొత్తం మాడిపోతాయి. వాటిని చూసి తినలేకపోతారు. ఉప్పుగా ఉన్నాయని అంటుంది అనసూయ. కషాయం అంటుంది. ఏమిటే చపాతీలలో ఉప్పు ఇంత తగలేశావు అంటుంది అనసూయ. నువ్వు డాక్టర్ వు ఆ మాత్రం తెలియదా అంటుంది. మధ్యలో లాస్య కలుగజేసుకొని పాపం చిన్నపిల్ల వదిలేయండి అత్తయ్య అంటుంది లాస్య. దీంతో దాన్ని కూడా నీలాగా చేయమంటావా.. ఇప్పటి నుంచి పద్ధతిగా అన్ని నేర్పిస్తేనే తులసిలా పనిచేస్తుంది అంటుంది అనసూయ. సరే సరే.. నువ్వు వెళ్లి టీ తీసుకురా అంటుంది అనసూయ. వెళ్లి టీ తీసుకొస్తుంది. టీ తాగి.. ఛీ ఛీ ఇది టీనా. నీకు చాయ్ చేయడం కూడా రాదా. అంకిత పని చేస్తే మనసు పెట్టి కుదురుగా పనిచేయి.. లేకపోతే చేయకు అని అంటుంది అనసూయ.

నాకు టైమ్ లేదు కదా అమ్మమ్మ అంటుంది. అప్పుడు చేయకు అంటుంది అనసూయ. నోర్మూసుకొని పనిచేస్తేనే ఇన్ని మాటలు అంటున్నారు. చేయకపోతే ఇంకెన్ని మాటలు అంటారో అంటుంది అంకిత. వంట విషయంలోనే ఇలా ఉంటే.. ఇంటికి పెద్ద కోడలుగా బాధ్యత ఎలా చూసుకుంటావు అంటుంది. తులసిని చూసి నేర్చుకో అంటుంది అనసూయ.

తనలా చేయడం ఇంకెప్పుడు నేర్చుకుంటావు అంటుంది అనసూయ. దీంతో నేను అంకితను.. తులసిని కాదు అంటుంది అంకిత. తులసి అలా చేస్తుంది.. తులసి ఇలా చేస్తుంది ఎంత సేపు ఇదే క్యాసెట్టా. ఆంటి అన్ని విషయాలో తనకు అనుభవం ఉంది. తను ఏళ్ల నుంచి చేస్తోంది. ఆంటి పొద్దున అనగా వెళ్లి రాత్రి ఎప్పుడో వస్తుంది.. ఆంటి చాలా బిజీ..

కానీ.. నేను ఖాళీగా లేను కదా అమ్మమ్మ. నా జాబ్ జాబ్ కాదా. మీ లెక్కలో అది పనికి రాదా అంటుంది అంకిత. నేను ఎంత బిజీగా ఉన్నా.. మీటింగ్ హడావుడి ఉన్నా మీరు చెప్పిన పని చేస్తాను.. చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ.. మీరు ఇంత చిన్న విషయాన్ని ఇలా చేస్తే ఎలా. మాటి మాటికి తులసి ఆంటితో పోల్చుతున్నారు. దయచేసి నన్ను తులసి ఆంటితో పోల్చొద్దు అని చెప్పి వెనక్కి తిరుగుతుంది అంకిత. చూసేసరికి అక్కడికి తులసి వస్తుంది.

ఇంతలో లాస్య కలుగజేసుకుంటుంది. వావ్.. ఇన్ని రోజులు తులసి ఆంటి అన్నావు.. ఇప్పుడు తులసిగా మారిపోయిందా అంటుంది. మరోవైపు తులసి మాట్లాడుతుంది. నేను నీ వంట గురించి మాట్లాడటం లేదు. నీ సంస్కారం గురించి. వాళ్ల మీద ఎందుకు అలా అరుస్తున్నావు అంటుంది అంకిత.

నాకు తెలిసి అంకిత తప్పేం లేదు అని అంటుంది లాస్య. దీంతో అగ్నిలో ఆజ్యం పోయకు లాస్య అంటుంది తులసి. ఆంటి మీరు చెప్పేది కరెక్టే కానీ.. నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. అందరూ మీలా పర్ ఫెక్ట్ గా ఉండరు కదా. ఈ ఇంట్లో ఉండే ప్రతి కోడలును మీతో కంపేర్ చేయొద్దు అంటుంది అంకిత.

ఇది అర్థం చేసుకోకపోతే ఏ కోడలు.. కోడలుగా ఈ ఇంట్లో ఉండలేదు అంటుంది అంకిత. వాళ్లు చేతగానివాళ్లలాగానే ఉంటారు. ఇలా అయితే.. ఈ ఇంట్లో గొడవలు అస్సలు ఆగవు అని చెప్పి అంకిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇన్నాళ్లు నా గొంతు మాత్రమే వినిపించింది. ఇప్పుడు అంకిత గొంతు కూడా న్యాయం కోసం పైకి లేచింది.

Intinti Gruhalakshmi 4 Feb Today Episode : గాయత్రికి ఫోన్ చేసి జరిగిన విషయాలు చెప్పిన లాస్య

నా గొంతు నొక్కినట్టు అంకిత గొంతు కూడా నొక్కే ప్రయత్నం చేయకండి అంటుంది లాస్య. ఈ ఇంట్లో గొడవలు అన్నింటికి కారణం లాస్య మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య. ఈ ఇష్యూను ఇక్కడితో వదిలేయకూడదు. ఈ ఇంట్లో ముసలం పుట్టేలా చేయాలి అని అనుకుంటుంది లాస్య.

జరిగిందంతా గాయత్రికి చెబితే.. మిగితా విషయాలన్నీ తనే చూసుకుంటుంది అని అనుకొని వెంటనే గాయత్రికి ఫోన్ చేస్తుంది. మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అంటుంది లాస్య. విషయం ఏంటి అంటుంది. మీ ఎక్స్ వియ్యంకురాలు తెగ హడావుడి చేస్తుంది.

నీ కూతురు ఆకాశంలో ఎగురుతున్న తులసిని కిందికి వచ్చేలా చేసింది. మనం కలలో కూడా ఊహించని పనిచేసి ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఒకేసారి వాళ్ల అత్తగారికి మా అత్తగారికి మొహం వాచేలా సమాధానం చెప్పింది అంటుంది లాస్య.

మరోవైపు అంకిత అలా మాట్లాడే సరికి.. బాధపడుతూ కూర్చుంటుంది తులసి. బాధపడకు అని అంటాడు పరందామయ్య. జీవితంలో నేను ఓడిపోయాను మామయ్య అంటుంది. అంకితకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాను అని పరందామయ్యకు చెప్పి బాధపడుతుంది.

నేను ఏదైతే జరగకూడదని అనుకుంటున్నానో అవే జరుగుతున్నాయి. అంకిత నావైపు చూసే చూపులకు సమాధానం చెప్పలేకపోతున్నాను.. అని చెప్పి బాధపడుతుంది తులసి. ఇప్పుడున్న పరిస్థితుల్లో తనకు కోపం రావడం న్యాయమే కదా మామయ్య.. అంటుంది తులసి.

తప్పు నీది కాదమ్మా.. పరిస్థితులదే తప్పు అంటుంది. మరోవైపు గాయత్రి.. తులసి ఇంటికి వచ్చి నా కూతురుతో వంట పని చేయించడానికి మీరెవరు అంటూ సీరియస్ అవుతుంది. వాళ్లతో గొడవ పెట్టుకుంటుంది. నాకూతురును టార్చర్ పెడుతున్నందుకు మీ అందరినీ అరెస్ట్ చేయించగలను.. అని మాట్లాడుతుంది గాయత్రి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

12 minutes ago

Hair Loss : అయ్యయ్యో.. బట్టతల వస్తుందని బాధపడుతున్నారా… ఇలా చేయండి వెంటనే వెంట్రుకలు మొలుస్తాయి…?

Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…

1 hour ago

Cluster Beans : గోరుచిక్కుడు కాయను చిన్న చూపు చూడకండి… దీని ఔషధ గుణాలు తెలిస్తే మతిపోతుంది…?

Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…

2 hours ago

Suvsrna Gadde : ఈ కూరగాయ అందరికీ తెలిసినదే…కానీ, దీని ప్రయోజనం అంతగా తెలియదు…?

Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…

3 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాద‌శి రోజున ఈ నియ‌మాలు పాటించండి.. ఆ ప‌నులు అస్స‌లు చేయోద్దు..!

Toli Ekadashi 2025  : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…

4 hours ago

Toli Ekadashi 2025 : తొలి ఏకాదశి రోజు పేలాల పిండి తింటే మంచిదా, దాని విశిష్ట‌త ఏంటి?

Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…

5 hours ago

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…

6 hours ago

Coffee : రోజుకి 2 కప్పుల కాఫీ తాగారంటే చాలు… యవ్వనంతో పాటు,ఆ సమస్యలన్నీ పరార్…?

Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…

7 hours ago