Intinti Gruhalakshmi 4 March Today Episode : లాస్యను కొట్టబోయిన ప్రేమ్.. ప్రేమ్ ను కొట్టిన నందు.. ప్రేమ్, శృతిని ఇంట్లో నుంచి బయటికి పంపించిన తులసి.. ఇంతలో మరో ట్విస్ట్

Advertisement
Published by
Advertisement

Intinti Gruhalakshmi 4 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 4 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 571 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి ఇంట్లో మహాశివరాత్రి సంబురాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి. అందరూ సరదాగా ఉండటంతో తులసి కూడా సంతోషంగా ఉంటుంది. మా కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు అని తులసి కోటను మొక్కుతుంది తులసి. మరోవైపు నందు, లాస్య.. అప్పుడే నిద్రలేస్తారు. రాములమ్మ కాఫీ అంటుంది లాస్య. వాళ్లను చూసి పరందామయ్య విసుక్కుంటాడు. ఈరోజు శివరాత్రి.. అందరూ ఉదయాన్నే లేచి రెడీ అయి పూజలు చేస్తుంటే మీరు ఇంకా కాఫీ దగ్గరే ఉండిపోయారు అంటూ మండిపడతాడు. దీంతో లాస్య వెంటనే రెడీ అయి వచ్చి.. నేను కూడా పూలు కడతాను అంటుంది శృతితో.

Advertisement

intinti gruhalakshmi 4 march 2022 full episode

దీంతో మొన్న సంక్రాంతికి కటినప్పుడే అన్ని పూలు ఊడిపోయాయి అంటుంది శృతి. ఇంతలో ప్రేమ్ వచ్చి.. నువ్వు పూలు కట్టడం పక్కన పెట్టు. అందరూ పూజ చేశాక నువ్వు ఇంత ప్రసాదం తిను. అదైనా నీకు పూజ చేసిన ఫలాన్ని అందిస్తుంది అంటాడు ప్రేమ్. దీంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత కిచెన్ లోకి వెళ్లి.. రాములమ్మను పిలిచి.. నేను ఏం వంటలు చేయాలో చెబుతా. ఆ వంటలు చేయి అంటుంది. దీంతో వంటలు పూర్తి చేయడం ఎప్పుడో అయిపోయింది అంటుంది రాములమ్మ. ఏం వంటలు చేయాలో చెప్పాలనుకుంటే ఉదయమే లేవాలి అంటుంది తులసి. దీంతో అక్కడి నుంచి కోపంగా వెళ్తుంది తులసి. ఆ తర్వాత అక్కడి నుంచి అంకిత దగ్గరికి వెళ్తుంది. పూజ ఏర్పాట్లు చేద్దాం పదా అంటుంది.

Advertisement

దీంతో పూజ ఏర్పాట్లు ఎప్పుడో పూర్తయ్యాయి. ప్రసాదం కూడా పూర్తయింది. పూజ అయిపోయాక వెళ్లి ప్రసాదం తిను అంటుంది. ఆ తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. అందరూ మహాశివుడి లింగానికి పూజ చేస్తుంటారు. లాస్య, నందును మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. దీంతో లాస్యకు కోపం వస్తుంది.

చివరకు హారతి తీసుకెళ్లి ఇస్తుంది రాములమ్మ. తర్వాత అందరికీ ప్రసాదం ఇస్తుంది అంకిత. లాస్య దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం అయిపోతుంది. దీంతో సారీ ఆంటి.. మీ దగ్గరికి వచ్చేసరికి ప్రసాదం అయిపోయింది. ఏమనుకోకండి.. మళ్లీ తెచ్చిస్తాను అంటుంది అంకిత.

దీంతో లాస్యకు కోపం వస్తుంది. అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. అదేంటి లాస్య  అలా వచ్చేశావు అంటాడు నందు. ఎందుకు అలా కోపంగా ఉన్నావు లాస్య. నిన్ను ఎవ్వరూ ఏం అనలేదు కదా.. అంటాడు నందు. ఎవ్వరూ ఏం అనకుండానే నీకు నువ్వే అనేసుకుంటున్నావు లాస్య అంటాడు నందు.

Intinti Gruhalakshmi 4 March Today Episode : నేను ఈ ఇంటి కోడలును అని ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పించు అన్న లాస్య

ఉదయం నుంచి నేను పూజ కార్యక్రమాల్లో పాల్గొందామని అనుకున్నా కానీ.. నన్ను ఉదయం నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదు.. అంటుంది లాస్య. మీ వాళ్ల మనసులో అసలు నా గురించి ఏముందో తెలియాలి అని అంటుంది లాస్య. నువ్వు ఇప్పుడే నీ వాళ్లతో నేను ఈ ఇంటి కోడలును అని ఒప్పించు.. అని నందుతో అంటుంది.

దీంతో రేపు మాట్లాడుదాంలే అంటాడు. దీంతో వద్దు ఇప్పుడే చెప్పాలి అంటూ సీరియస్ అవుతుంది లాస్య. దీంతో కోపంతో లాస్యను తీసుకొని వస్తాడు నందు. అందరూ వినండి. లాస్య ఒక విషయం మీ నోటి నుంచి విని తెలుసుకోవాలని అనుకుంటోంది అంటాడు నందు.

భర్త స్థానంలో నేను ఇచ్చే హామీని తను నమ్మడం లేదు అంటాడు నందు. నీ మాటే నమ్మడం లేదు.. మా మాట ఏం వింటుంది అంటుంది అనసూయ. సూటిగా అడుగుతున్నాను.. సూటిగా చెప్పండి. ఈ ఇంట్లో కోడలు ఎవరు.. తులసా.. లాస్యా అంటాడు నందు.

దీంతో మళ్లీ ఇంట్లో గొడవ స్టార్ట్ అవుతుంది. మహాశివరాత్రి రోజు ఇంట్లో పూజ పూర్తవగానే అందరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. తులసికి ఈ ఇంట్లో దక్కే మర్యాద తనకు దక్కడం లేదని అంటోంది అంటాడు నందు. దీంతో ఎవ్వరూ మాట్లాడరు.

ఈరోజు తెలిసిపోవాలి. ఎవరి పొజిషన్ ఏంటో తెలవాలి. లాస్యకు ఈ ఇంటి కోడలుగా ఎందుకు మర్యాద దక్కడం లేదు అంటాడు నందు. దీంతో మర్యాద అనేది అడుక్కొని తీసుకునేది కాదు. ఎదుటి వాళ్ల మనసులోంచి పుట్టుకురావాలి అంటాడు ప్రేమ్.

నేను నిన్ను అడగలేదు. మా అమ్మానాన్నలను అడుగుతున్నా అంటాడు. ప్రేమ్ మాట్లాడేది.. నీ గొంతుతోనా అంటాడు తులసిని. నేను అడుగుతున్నాను చెప్పండి.. మీరు లాస్య గొంతుతో మాట్లాడుతున్నారా.. లేక మీ గొంతుతో మాట్లాడుతున్నారా అంటాడు ప్రేమ్.

చివరకు ఆ గొడవ కాస్త నందు, ప్రేమ్ మధ్యకు చేరుతుంది. పాతికేళ్లు మీ కోసం అమ్మ పడ్డ శ్రమను లాక్కున్నారు. ఇంకా సరిపోలేదా అంటాడు ప్రేమ్. తన కోసం తన వాళ్లతో అల్లుకున్న బంధాన్ని కూడా తీసేద్దామని అనుకుంటున్నారా అంటాడు నందు.

మా అమ్మ సంస్కారం ముందు మీరు దేనికీ పనికిరారు అంటాడు ప్రేమ్. ఇప్పటి వరకు నాకు మాత్రమే విలువ లేదని నేను బాధపడ్డాను. నీకు కూడా విలువ లేదని నీ కొడుకు తేల్చేశాడు నందు అంటుంది లాస్య. ఒక్కరు కూడా ప్రేమ్ ను తప్పుపట్టడం లేదు అంటుంది లాస్య.

మా నాన్న.. మా అమ్మ అంటూ గొప్పలు చెప్పుకుంటావు కదా అని నందును అంటుంది లాస్య. దీంతో ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ గాకు అంటాడు ప్రేమ్. లాస్యపై కూడా విరుచుకుపడతాడు ప్రేమ్. దీంతో ప్రేమ్ ఇక ఆపు.. వద్దు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు అంటుంది తులసి.

నువ్వు ఏది ఇస్తే అదే నీకు దొరుకుతుంది లాస్య. ముందు అది తెలుసుకో అంటుంది తులసి. మొత్తం మీద కోపంతో లాస్యను కొట్టబోతాడు ప్రేమ్. దీంతో నా భార్యనే కొడతావా అంటూ ప్రేమ్ ను కొడతాడు నందు. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోవాలంటూ ప్రేమ్, శృతికి చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Recent Posts

Yamadonga : యమదొంగ కథ అసలు ఎన్టీఆర్ కోసం కాదు.. ఆసక్తికర నిజం బయటపెట్టిన విజయేంద్ర ప్రసాద్

Yamadonga  : తెలుగు సినీ పరిశ్రమలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ‘యమదొంగ’ ఒకటి. యంగ్…

4 hours ago

Police Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,000 పోలీసు జాబ్స్‌ భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

Police Jobs  : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త…

5 hours ago

Anasuya Jabardasth : నా గొంతు నొక్కేయాలని చూశారు’.. జబర్దస్త్ వదిలేయడానికి అసలు కారణం చెప్పిన అనసూయ

Anasuya Jabardasth : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు స్టార్ యాంకర్‌గా, వెండితెరపై ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్…

6 hours ago

Team India or Gujarat Titans : భారత జట్టా.. గుజరాత్ జ‌ట్టా… సెలక్షన్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు..!

Team India or Gujarat Titans : భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైన…

7 hours ago

School Holidays : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… వేసవి సెలవులు పొడిగింపు.. ఎప్ప‌టి వ‌ర‌కు అంటే..!

School Holidays : తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు సంతోషకరమైన వార్త అందింది. ఇప్పటికే వేసవి సెలవులను ఆస్వాదిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం…

8 hours ago

Thotakura Vajresh Yadav : ఉప్పల్‌ సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయండి.. తోటకూర వజ్రేష్ యాదవ్ పిలుపు

Thotakura Vajresh Yadav : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు మరింత ఊతమివ్వనున్న కీలక కార్యక్రమం ఆదివారం జరగనుంది. మల్కాజిగిరి…

8 hours ago

Bandi Ramesh : బాలాజీ నగర్‌.. కాలనీ సమస్యల పరిష్కారానికి బండి రమేష్ భరోసా..!

Bandi Ramesh : కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని బాలాజీ నగర్ డివిజన్‌లో ఉన్న ఓల్డ్ బాలాజీ నగర్ హౌసింగ్ బోర్డ్…

9 hours ago

Talari Ambrose in Peddi : పెద్ది సినిమాలో అందరి దృష్టిని ఆకర్షించిన తలారి ఆంబ్రోస్ పాత్ర.. ఈ నటుడు ఎవరో తెలుసా?

Talari Ambrose in Peddi : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలైన…

10 hours ago

Redmi Turbo 5 అదిరిపోయే ఫీచర్లు వచ్చేస్తోంది.. భారీ బ్యాటరీతో కొత్త ఫోన్‌పై పెరిగిన అంచనాలు..!

Redmi Turbo 5  : భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన లాంచ్‌కు రంగం సిద్ధమైంది. బడ్జెట్ ధరలో ప్రీమియం…

11 hours ago

Modi Cabinet TDP : మోదీ కేబినెట్‌లో టీడీపీకి మరో బెర్త్..? చంద్రబాబు నిర్ణయంపై ఉత్కంఠ..!

Modi Cabinet TDP : దేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి రంగం సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన…

12 hours ago

Telangana Students : తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఖాతాలోకి నేరుగా డ‌బ్బలు..!

Telangana Students : తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో ప్రభుత్వం కీలక మార్పులకు…

13 hours ago

Peddi Movie Day 2 Box Office Collections : పెద్ది డే 2 కలెక్షన్స్ రిపోర్ట్.. వీకెండ్‌లో కొత్త రికార్డులు ఖాయమా?

Peddi Movie Day 2 Box Office Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ…

13 hours ago