Intinti Gruhalakshmi 4 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 4 సెప్టెంబర్ 2021, శనివారం రాత్రి ప్రసారం కాబోయే 416 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
నందు కంపెనీకి జీకే వస్తాడు. అక్కడ అటూ ఇటూ చూసి.. ఉద్యోగులు కూడా లేరు. చివరకు కంపెనీని మూసేసే స్థితికి వచ్చారన్నమాట అని అంటాడు. చూడండి.. ఇది నాకంపెనీ.. నా ఇష్టం. ఇందులో మీరు జోక్యం చేసుకోవద్దు.. అని చెబుతాడు నందు.
కూల్ కూల్.. అని చెప్పిన జీకే.. నీకో బిజినెస్ ప్రపోజల్ ఇద్దామని వచ్చాను.. అని అంటాడు. దీంతో నందు షాక్ అవుతాడు. లాస్య కూడా అక్కడే ఉంటుంది. బిజినెస్ ప్రపోజలా? అంటే.. అవును.. మీరు కాదనలేని బిజినెస్ ప్రపోజల్ అంటాడు జీకే.
చెప్పండి.. ఏంటి బిజినెస్ ప్రపోజల్ అని నందు అడుగుతాడు. దీంతో జీకే.. బిజినెస్ ప్రపోజల్ కంటే ముందు నీతో నీ చిన్నకొడుకు ప్రేమ్ గురించి మాట్లాడాలి.. అంటాడు. ప్రేమ్ గురించి మాట్లాడటం ఏంటి.. వాడు మీతో ఏమైనా గొడవ పడ్డాడా? ఐయమ్ సారీ.. వాడి తరుపున నేను క్షమాపణలు చెబుతున్నాను.. అంటాడు నందు.
ఏంటి సార్.. ఎందుకు అలా నవ్వుతున్నారు.. అంటాడు నందు. మీ ప్రేమ్ గొడవలు పెట్టుకునేవాడో కాదో తెలియదు కానీ.. నాకు మాత్రం బాగా కావాల్సిన వాడు అయ్యాడు.. అంటాడు జీకే. దీంతో నందుకు ఏం అర్థం కాదు. అసలు.. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండీ.. అసలు మీరు నన్ను ఎందుకు కలవాలనుకున్నట్టు.. అంటాడు.
ఇంతలోనే ప్రేమ్.. ఫైల్ తీసుకొని నందు ఆఫీసుకు వస్తాడు. నాన్నా అంటాడు. మీ ఫైల్ కావాలని చెప్పారంట కదా.. తెచ్చాను అంటాడు. ఫైలా.. నేనేం చెప్పలేదే అంటాడు నందు. నిజానికి.. ఇదంతా లాస్య వేసిన ప్లాన్. అది నందుకు తెలియదు. అదే అర్జెంట్ అని చెప్పారంట కదా.. అందుకే ఇద్దామని తీసుకొచ్చాను.. అనగానే అవునండి.. ఈ ఫైల్ మనకు చాలా అర్జెంట్.. అందుకే నేనే చెప్పాను.. అని కవర్ చేస్తుంది లాస్య. ఇక నేను బయలుదేరుతాను.. అని చెప్పి వెళ్లిపోతాడు ప్రేమ్.
మీ అబ్బాయి వినయం, విధేయత.. వండర్ ఫుల్. సార్.. ఇప్పటి వరకు ఎందుకు వచ్చారు.. ఏంటి అనే విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికైనా మీరు క్లారిటీ ఇస్తారా? అని అడుగుతాడు నందు. అనగానే.. జీకే.. నందుకు ఓ ఫోటో పంపిస్తాడు. ఆ ఫోటో చూడండి.. అని చెబుతాడు.
ఆ ఫోటో అక్షరది. ఆమె నా కూతురు.. అక్షర అని చెబుతాడు. నా కూతురును చూపించకుండా.. నీ కొడుకు గురించి అడగడం భావ్యం కాదు కదా.. అందుకే ముందు నా కూతురు ఫోటోను చూపించాను. నా కూతురు ప్రేమ్ ను ఇష్టపడింది. నా కూతురు ఇష్టపడిన దాన్ని దేన్ని నేను ఇవ్వకుండా ఉండలేదు. అలా కోరుకున్న ప్రతిదాన్ని నేను తీసుకొచ్చి చేతుల్లో పెట్టాను. అలాగే నీ కొడుకు ప్రేమ్ ను కూడా నేను తనకు ఇద్దామనుకుంటున్నాను. ఈ విషయం ప్రేమ్ తో మాట్లాడి ఉండొచ్చు కానీ.. మనం పెద్దవాళ్లం.. మనం డీల్ చేసుకోవడం బెటర్ అని మీ దగ్గరికి వచ్చాను. బిజినెస్ ప్రపోజల్ గురించి మాట్లాడుతాను.. అని చెప్పి అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుతున్నాడేంటి.. అని అనుకుంటున్నారా? ఆ విషయం దగ్గరికే వస్తున్నాను. మీ అబ్బాయికి, మా అమ్మాయికి పెళ్లి చేస్తే.. మా అమ్మాయి కోరికా తీరుతుంది. మీ అబ్బాయి కోటీశ్వరుడు అవుతాడు.. అని చెబుతాడు జీకే.
అంతే కాదు.. అంతకన్నా అద్భుతమైన ఆఫర్ మరొకటి ఉంది. అప్పుల్లో మునిగిపోయి అప్పుల భారంతో ఉన్న మీ కంపెనీ ఇకపై అప్పుల నుంచి బయటపడబోతుంది. ఇక నుంచి సక్సెస్ ఫుల్ కంపెనీగా దూసుకుపోతుంది. నా అల్లుడు కోటీశ్వరుడు అయినప్పుడు.. నా అల్లుడి తండ్రి కూడా ఒక మంచి పొజిషల్ లో ఉండాలని అనుకుంటా కదా. అందుకే ప్రేమ్ ను మీరు ఈ పెళ్లికి ఒప్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయినట్టే.. అని అంటాడు జీకే.
అంటే జీకే గారు.. అంటూ నందు ఏదో చెప్పబోయే సరికి.. లాస్య మధ్యలో కల్పించుకొని.. నందు నువ్వు ఆగు. జీకే గారు.. మీరు ఇంత గొప్ప బిజినెస్ ప్రపోజల్ తో మా దగ్గరికి వచ్చాక దానికి నందు మాత్రం ఎందుకు కాదంటాడు. నందు.. కరెక్ట్ డీల్ మన దగ్గరికి వచ్చింది. దాన్ని యుటిలైజ్ చేసుకోవడం మన బాధ్యత.. అని అంటుంది లాస్య. జీకే గారు.. మీరు ఈ విషయంలో ఇంకేం ఆలోచించకండి. నందుకు నేను ఎంత చెప్తే అంత. ప్రేమ్ కు నందు ఎంత చెప్తే అంత. మీరు చెప్పిన బిజినెస్ ప్రపోజల్ ఓకే అవుతుంది.. అని చెబుతుంది లాస్య. సరే.. చూద్దాం.. నా కూతురుకు ప్రేమ్ భర్తగా రావడం అనేది ముఖ్యం. దాని కోసం మీరు ప్రేమ్ ను ఎలా ఒప్పిస్తారు.. అనేది మీ ఇష్టం.. అని చెప్పి వెళ్లిపోతాడు జీకే.
కట్ చేస్తే.. తులసి.. ప్రేమ్ కోసం ఎదురు చూస్తుంటుంది. ప్రేమ్ ఎక్కడికి వెళ్లాడు.. ఇంకా ఇంటికి రాలేదు. శృతిని గుడికి కూడా తీసుకవెళ్లలేదు. అసలు.. ఇంతసేపు ఎక్కడికి వెళ్లాడు.. అనే విషయం ప్రేమ్ కు అర్థం కాదు. ఆయన కూడా ప్రేమ్ కు ఎప్పుడూ అప్పగించేవారు కాదు. కానీ.. ఈరోజు కొత్తగా ప్రేమ్ ను పిలవడం ఏంటి.. నాకు తెలియకుండా.. ఏదో జరుగుతోంది అని అనుకుంటుంది తులసి.
ఇంతలోనే లాస్య అక్కడికి వస్తుంది. తులసి నువ్వు ఆలోచించేది కరెక్టే అంటుంది. దేని గురించి అని అడుగుతుంది. నీకు తెలియకుండా నీ వెనుక ఏదో జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా. నీకు తెలియకుండా ఓ మ్యాటర్ జరుగుతోంది. సడెన్ గా ప్రేమ్ ను ఆఫీసుకు పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ విషయం ప్రేమ్ కు కూడా తెలియదు.. అని అంటుంది లాస్య. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అంటుంది తులసి.
దీంతో నందు.. నీ రెండో కొడుకుకు పెళ్లి సంబంధం చూశాడు అని చెబుతుంది లాస్య. పెళ్లి సంబంధమా? అని షాక్ అవుతుంది తులసి. అవును తులసి.. ఎందుకు అంత షాక్ అవుతున్నావు. నీ కొడుకుకు పెళ్లి చేయవా? నీ కొడుకుకు పెళ్లి చేయకుండా అలాగే ఉంచుకుంటావా? అని అడుగుతుంది లాస్య. నా కొడుకుకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి.. ఎవరిని పెళ్లి చేసుకోవాలి.. అనే విషయం వాడికి తెలుసు.. అని అంటుంది తులసి. ఒక తండ్రిగా తన కొడుకుకు సంబంధం చూశాడు నందు. అది తన బాధ్యత. అది కూడా కోటీశ్వరుల సంబంధం. ప్రేమ్ ఎంత తాపత్రయపడినా.. నువ్వు ఎంత కష్టపడినా.. అటువంటి సంబంధాన్ని తీసుకురాలేవు.. అంటుంది లాస్య.
ప్రేమ్ పెళ్లితో మీరు లాభపడాలని అనుకుంటున్నారు. అందుకే.. ప్రేమ్ పెళ్లి గురించి మాట్లాడుతున్నావా? అంటుంది తులసి. మీ వ్యాపారాల కోసం ప్రేమ్ జీవితాన్ని నాశనం చేస్తున్నారా? అని తులసి అడిగితే.. అయ్యో.. తులసి ప్రేమ్ జీవితాన్న మేమెందుకు నాశనం చేస్తాం.. అనగానే చూడు లాస్య.. ప్రేమకు ఇష్టమైన పెళ్లి చేసుకుంటాడు. వాడికి ఇష్టమైన జీవితాన్ని గడుపుతాడు అని చెబుతుంది తులసి.
అయ్యో.. తులసి.. ప్రతిదీ నువ్వు నెగెటివ్ గా ఆలోచిస్తావు ఎందుకు.. అనగానే.. ప్రేమ్ నువ్వు తెచ్చిన సంబంధం అస్సలు చేసుకోడు.. అంటుంది తులసి. ప్రేమ్.. ఈ పెళ్లి చేసుకుంటేనే మా కంపెనీ అప్పులు తీరుతాయి. లేదంటే నందు కంపెనీని మూసుకోవాల్సిన పరిస్థితి. ఆ తర్వాత నందు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో కూడా తెలియదు. నువ్వు ఎంతైనా నందు మాజీ భార్యవే కదా. ఆయన ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే.. ఆ తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకో అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
కట్ చేస్తే.. అక్షర అక్షర అంటూ జీకే తన కూతురును పిలుస్తాడు. మీరు గుడ్ న్యూస్ చెబుతున్నారా? అని అడుగుతుంది. ప్రేమ్ వాళ్ల నాన్నను కలిశారా? నా గురించి మాట్లాడారా? అంకుల్ ఏమన్నారు? అని ప్రశ్నల మీద ప్రశ్నలను అడుగుతుంది అక్షర. వాళ్లు ఆల్ మోస్ట్ ఒప్పుకున్నట్టే.. అని అంటాడు జీకే. దీంతో అక్షర చాలా ఖుషీ అవుతుంది. థ్యాంక్యూ డాడీ అంటుంది. నీ గురించి నేను ఏదైనా చేస్తాను అక్షర. నీ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీ… అంటుంది. ఇంతకీ నేను అడిగిన దాని సంగతి ఏం చేశారు అని అడుగుతుంది అక్షర. ప్రేమ్ ఫోన్ నెంబరే కదా. నీ మొబైల్ నెంబర్ కు ఫార్వార్డ్ చేశాను చూడు.. అని చెబుతాడు జీకే. దీంతో చాలా సంతోషంతో అక్షర అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇంతలో తన పీఏ మురళి వచ్చి.. సార్ నాకో చిన్న డౌట్.. అని అడుగుతాడు. నీకు డౌట్ రాకపోతే ఆశ్చర్యం కానీ.. డౌట్ వస్తే ఆశ్చర్యం ఎందుకు? అడుగు అంటాడు. ఆ నంద గోపాల్ గారు చూస్తే మీరు అడిగిన దానికి ఎస్ అని చెప్పలేదు నో అని చెప్పలేదు మీరు మాత్రం అక్షరకు మాటిచ్చేశారు.. అనగానే.. చూడు మురళి నేను ఇప్పటి వరకు చేసిన ఏ బిజినెస్ డీల్ లో కూడా నేను ఓడిపోలేదు. ఈ డీల్ కూడా అంతే. నందగోపాల్ కు డబ్బు కావాలి. డబ్బు ఆశకు లొంగని వాడు ఉండడు. అక్షర పెళ్లి ప్రేమ్ తో జరగడం ఖాయం.. అని చెబుతాడు జీకే.
కట్ చేస్తే.. నందు, లాస్య.. ఇద్దరూ తెగ ఆలోచిస్తుంటారు. ఆ ప్రేమ్ ఒక తిక్కలోడు. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. ఈమధ్య శృతి వెంట తిరుగుతున్నాడు.. ఇప్పుడు సడెన్ గా వచ్చి జీకే కూతురును చేసుకో అంటే అస్సలు వినడు. ఏం చేయాలి.. అని తనలో తాను ఆలోచిస్తుంటుంది లాస్య. ఆ ప్రేమ్ గాడిని డీల్ చేయడం కొంచెం కష్టమైన పని. ఏ ఆటంకం లేకుండా జీకే కూతురుతో ప్రేమ్ పెళ్లి అవ్వాలంటే ఏం చేయాలి. ఎలా ప్లాన్ చేయాలి.. అని నందు కూడా అనుకుంటాడు.
లేదు లాస్య. ఇది వర్కవుట్ అవుతుందని నాకు అనిపించడం లేదు.. అంటాడు నందు. ప్రేమ్ ను ఒప్పించి జీకే కూతురుతో పెళ్లి చేయాలంటే కష్టం ఏమో అనిపిస్తోంది అంటాడు. మన కంపెనీ కోసం ఇప్పుడు ఎదుర్కొనే కష్టం కంటే ఇది అంత పెద్దది కాదు.. అంటుంది లాస్య.
ప్రేమ్ విషయంలో మనం ఆలోచించాల్సింది డబ్బు విషయంలో కాదు. ప్రేమ్ కు అడ్డంగా ఉన్న శృతిని అడ్డు తొలగించుకోవాలి. వాళ్లిద్దరూ ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ.. తర్వాత శృతి పెళ్లి వేరేవాళ్లతో అయిపోయింది. కానీ.. ఇప్పుడు విడాకులు తీసుకొని శృతి ఒంటరిగా ఉంటోంది. మళ్లీ శృతికి ప్రపోజ్ చేయడానికి ప్రేమ్ ప్లాన్ చేస్తున్నాడు. ప్రేమ్.. శృతికి ప్రపోజ్ చేస్తే తను ఒప్పుకోవచ్చు. అప్పుడు మన ప్లాన్ అంతా బెడిసికొడుతుంది.. ఈ విషయంలో మనకు అడ్డుగా ఉన్న వ్యక్తి శృతి. దాని అడ్డు మాత్రం తొలగాలి.
అనగానే.. శృతిని పెళ్లి చేసుకుంటాడా? ఛీ.. ఛీ.. ప్రేమ్.. శృతిని పెళ్లి చేసుకోవడం నేను అస్సలు ఒప్పుకోను. నా ఇంటి కోడలుగా విడాకులు తీసుకున్న అమ్మాయిని నేను ఒప్పుకోను. జీకే కూతురును చేసుకుంటేనే ప్రేమ్ బాగుంటాడు. ప్రేమ్ తన జీవితంలో సెటిల్ అవుతాడు. ప్రేమ్ తో పాటు.. ఇంట్లో వాళ్లు అందరూ ఈ పెళ్లికి ఓకే అనాలి.. అనగానే.. ఒప్పిస్తా.. అందరినీ ఒప్పిస్తాను నేను. శృతిని చేసుకోవడం కంటే.. జీకే కూతురును చేసుకుంటే.. ఎందుకు బెటరో నేనే అందరికీ చెబుతాను. జీకే ఆఫర్ ను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. ప్రేమ్, మన కంపెనీ.. ఇద్దరూ ఒకే సారి సెట్ అయిపోవాలి.. అని అంటాడు నందు. దీంతో లాస్య.. ఫుల్ ఖుషీ అవుతుంది.
తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచి.. నందు.. జీకే కూతురు విషయం గురించి చెబుతాడు. దీంతో తులసి, ప్రేమ్, శృతి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ప్రేమ్.. ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? తులసి ఏమంటుంది.. అనే విషయాలు తెలియాలంటే.. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడాలి.
Karthika Pournami : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో కార్తీక పౌర్ణమి ఒకటి. పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి ప్రకాశంతో…
Technician Vacancies : ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మెదక్ (OFMK) జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్ & జూనియర్ అసిస్టెంట్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తాయని అందరికీ తెలిసిందే. అంతేకాదు కొన్ని…
Donald Trump : ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలవడం మనం చూశాం. ట్రంప్ గెలుపుపై భారత…
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గానీ, ఆయన…
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243…
IAS Officers : పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 13 మంది IAS అధికారులను బదిలీ చేసింది. ఉప…
Samantha : సమంత క్రేజ్ అప్పటికీ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. మయోసైటిస్ వలన కొన్నాళ్లు సినిమాలకి బ్రేక్ ఇచ్చిన…
This website uses cookies.