Intinti Gruhalakshmi 6 Sep Today Episode : తులసి ఆఫీసులో అడుగు పెట్టడానికి వీలు లేదు.. సామ్రాట్ షాకింగ్ నిర్ణయం.. లాస్య ప్లాన్ సక్సెస్

Intinti Gruhalakshmi 6 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 6 సెప్టెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 730 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈయన గారు తులసిని తీసుకొని రమ్మన్నారు. కానీ.. తులసిని వెళ్లి ఎవరు బతిమిలాడాలి అని లాస్యతో అంటాడు నందు. నువ్వు నీ మైండ్ తో ఆలోచించకు. నా మైండ్ తో ఆలోచించు అంటాడు నందు. దీంతో నా ప్లాన్ ఏంటో చెవిలో చెబుతాను. నేను చెప్పినట్టుగా చేయి అంటుంది లాస్య. దీంతో వామ్మో సామ్రాట్ కు తెలిస్తే అంటాడు నందు. ఏం కాదు.. సామ్రాట్ కు తెలియదు అంటుంది లాస్య. ఏమైనా కానీ.. జరిగింది జరిగినట్టు సామ్రాట్ గారికి నేను అన్ని విషయాలు చెప్పేస్తాను అంటాడు నందు. దీంతో నీకేమైనా పిచ్చా అంటుంది లాస్య. ముందు నేను చెప్పినట్టు చెయి అంటుంది లాస్య. మరోవైపు అభి.. నందు, తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. ఇంతలో తులసి, అంకిత ఇద్దరూ అటు వైపు వస్తారు. మామ్ నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అంటాడు అభి.

intinti gruhalakshmi 6 september 2022 full episode

ఏం మాట్లాడాలన్నా ఇప్పుడు వద్దు అని అంటుంది అంకిత. దీంతో నేను మామ్ తో మాట్లాడాలి అంటాడు. డాడ్ తో బిహేవ్ చేసే పద్ధతి నువ్వు మార్చుకోవాలి మామ్ అంటాడు అభి. దీంతో అంకితకు కోపం వస్తుంది. అభి మాటలు పట్టించుకోకండి ఆంటి అంటుంది అంకిత. మీ ఇద్దరి మధ్య జరిగే గొడవలు ఇప్పటివి కావు. ఇదివరకు ఎప్పుడూ నువ్వు డాడీని అవమానించలేదు కానీ… ఈ మధ్య మాత్రం డాడీని నువ్వు అవమానిస్తున్నావు అంటాడు అభి. దీంతో నా మీద బురద జల్లావు కదా.. ఆత్మ రక్షణ చేసుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను అంటుంది తులసి. మార్నింగ్ డాడీ వచ్చి ఏమన్నారు.. సామ్రాట్ గారు నిన్ను ఆఫీసుకు తీసుకురమ్మన్నారు. అంతే కదా.. దాని కోసం నువ్వు వస్తే వస్తా అనాలి రాకపోతే రావద్దు అనాలి కానీ.. ఇలా చేయడం ఏంటి అని అంటాడు అభి. నేను మీ నాన్నతో రానని అనడం చీదరించుకోవడం అనుకుంటే.. నేను ఆయన ఇంటికి వెళ్లి బతిమిలాడటాన్ని ఏమనాలి అంటుంది తులసి.

మీ నాన్న గారికి నువ్వంటే చాలా ఇష్టం కదా బాబు. ఒక్కసారి అడుగు. అమ్మ నీ మాట ఒక్కసారి విన్నది కదా. నువ్వు మాత్రం అమ్మ మాట ఎందుకు వినవు అని ఒకసారి అడుగు అంటుంది తులసి. నేను వెంట వెళ్లనిది మీ నాన్నను ఇబ్బంది పెట్టాలని కాదు.. నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అంటుంది తులసి. నువ్వు మీ డాడ్ కు సపోర్ట్ చేయి.. కానీ మీ అమ్మను చెడు చేయకు. పాపం.. ఒంటరి ఆడదిరా అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 6 Sep Today Episode : శృతి, ప్రేమ్ మధ్య చిలిపి గొడవ

కట్ చేస్తే ప్రేమ్ ఉదయమే రెడీ అయి వెళ్తుంటాడు. ఎక్కడికి వెళ్తున్నావురా అని అడుగుతుంది తులసి. దీంతో ఈవెంట్ మేనేజర్ ఫోన్ చేశాడు. రమ్మంటే వెళ్తున్నాను అంటాడు. ఆ మాట ముందే చెబితే నేను టిఫిన్ చేసేదాన్ని కదా. శృతి నువ్వయినా చెప్పొద్దా అంటుంది తులసి.

నేను చెప్పినా కూడా వినలేదు ఆంటి అంటుంది శృతి. బయటికొచ్చి ముగ్గేయబోతూ ప్రేమ్ బండిని చూసి నా చీరలనే తడుపుతావా.. ఇప్పుడు చెబుతా నీ సంగతి అని చెప్పి తన బైక్ టైర్ గాలి తీస్తుంది శృతి. ఇంతలో ప్రేమ్ బయటికొచ్చి ముగ్గు వేస్తున్న శృతిని చూస్తాడు.

ఆ తర్వాత తన బైక్ దగ్గరికి వస్తాడు. బైక్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో బైక్ టైర్ లో గాలి లేదని చూసి షాక్ అవుతాడు. ఏమైంది ప్రేమ్ అని అమాయకంగా అడుగుతుంది శృతి. ఏంటి నావైపు అనుమానంగా చూస్తున్నావు. టైర్ లో గాలి తీసింది నేను అనుకుంటున్నావా. నీ లాగా నాకు అంత ఉక్రోశం లేదు అంటుంది.

ఇంతలో తులసి వచ్చి ఈ పాలు తీసుకెళ్లి వాడికి ఇవ్వమ్మా అంటుంది శృతి. సరే అంటుంది. మరోవైపు ఆఫీసులో ఉన్న సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇందుకు ఇంత డిస్టర్బ్ అవుతున్నాను. చిన్న విషయాన్ని ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటున్నాను.

నేను ఈ విషయం మరిచిపోవాలి అని అనుకుంటాడు సామ్రాట్. ఇంతలో తన  రూమ్ లోకి లాస్య, నందు ఇద్దరూ వస్తారు. దీంతో తులసి వచ్చిందేమో అని డోర్ వైపు చూస్తాడు సామ్రాట్. కానీ.. తులసి రాదు. ఇద్దరినీ కూర్చోమంటాడు. తులసి రాలేదు సార్.. రానని చెప్పమంది అంటుంది లాస్య.

ఎంత రిక్వెస్ట్ చేసినా రాలేదు.. వినిపించుకోలేదు అంటుంది లాస్య. ఏ పార్టనర్ కు ఇవ్వనంత విలువ మీరు తులసికి ఇచ్చారు. నిజం చెప్పాలంటే మీరు తులసికి ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి మాకు చాలా జలసీగా అనిపించింది. దాచుకోకుండా ఓపెన్ గా చెప్పేస్తున్నాను.

ఇంకో జన్మెత్తినా తులసికి ఇలాంటి అవకాశం రాదు. రాసిస్తాను అంటుంది లాస్య. ఆ తులసి ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా సార్. మా ఇష్యూలో ఇన్వాల్వ్ అవడానికి మీరు ఎవరు అంటూ మిమ్మల్ని తీసిపారేసింది సార్. ఎంతైనా మాజీ భర్త సార్.. కొంచెం అయినా గౌరవం ఇవ్వాలి కదా. దులిపి అవతల పారేసింది అంటుంది లాస్య.

దీంతో సామ్రాట్ కు కోపం వస్తుంది. ఆమెకేనా… నాకు అంతకంటే ఎక్కువ పొగరు ఉంది. తను ఈ ఆఫీసులో ఇక అడుగు పెట్టడానికి వీలు లేదు. తను మనసు మార్చుకున్నా నేను మార్చుకోను. నా మాటగా ఈ విషయాన్ని మీ మాజీ భార్యకు చెప్పండి అని సామ్రాట్ నందుకు చెబుతాడు.

ఆ తర్వాత నందు, లాస్య ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. మీరు పార్టనర్ షిప్ నుంచి తప్పుకున్నారా? అని మీడియా వాళ్లు వచ్చి తులసిని అడుగుతారు. దీంతో ఆ విషయం సామ్రాట్ గారే చెప్పాలి అంటుంది తులసి. మరోవైపు పేపర్లలో ఈ విషయం రావడంతో తులసి ఇంటికి వెళ్లి సామ్రాట్ నిలదీస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

8 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

9 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

10 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

12 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

12 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

13 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

14 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

14 hours ago